క్రీడాభూమి

వాళ్లు మాట్లాడుకున్నారు !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్‌లో మనోహర్, షహర్యార్ ఖాన్ భేటీ
శ్రీలంకలో భారత్, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్?
దుబాయ్, నవంబర్ 23: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ ఇక్కడ సమావేశమై పలు అంశాలను చర్చించారు. అయితే, వివరాలు తెలియరాలేదు. చర్చలు అర్థవంతంగా సాగాయని, మంచి ఫలితం వస్తుందని తాను ఆశిస్తున్నానని షహర్యార్ ట్వీట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ వివరాలు ఇవ్వలేనని అన్నాడు. డిసెంబర్‌లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌లో టీమిండియా మ్యాచ్‌లు ఆడాలి. అయితే, అక్కడ ఆటగాళ్లకు భద్రత లేదన్న కారణంగా 2009 తర్వాత జింబాబ్వే తప్ప మరే జట్టూ పాక్‌లో పర్యటించలేదు. దీనితో పాక్ హోం సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడుతున్నది. కాగా, భారత్, పాక్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న కారణంగా యుఎఇలో మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేయలేదు. భారత్‌కు రావాల్సిందిగా పిసిబికి ప్రతిపాదించింది. అయితే, ఒప్పందం ప్రకారం యుఎఇలోనే మ్యాచ్‌లు ఆడతామని, భారత్‌లో పర్యటించే ప్రసక్తే లేదని పిసిబి తేల్చిచెప్పింది. ఇరు వర్గాలు పట్టుదలను సడలించుకోకపోవడంతో ద్వైపాక్షి సిరీస్ జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతటా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలో హషర్యార్‌తో మనోహర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, బిసిసిఐ ఈ సమావేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే వివరాలు తెలుస్తాయని షహర్యార్ ట్వీట్ చేయగా, బిసిసిఐ ఆ మాత్రం వివరాలు కూడా ఇవ్వలేదు.
తటస్థ వేదిక లంక?
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లను ఆడేందుకు తటస్థ వేదికగా శ్రీలంకను బిసిసిఐ ఖరారు చేసిందని సమాచారం. బోర్డు విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్, శ్రీలంక పేర్లను బిసిసిఐ అధికారులు పరిశీలించారు. చివరికి లంక పేరును ఖాయం చేశారు. ఈ విషయాన్ని 27వ తేదీన బోర్డు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయతే, కేంద్రం నుంచి అనుమతి లభించిందా లేదా అన్నది తెలియలేదు. (చిత్రం) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్ ఖాన్, భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్