రాష్ట్రీయం

మావోయిస్టుల డంప్ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 5: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం మావోయిస్టుల డంప్ లభ్యమయింది. కాంకేర్ జిల్లా అంతాగఢ్ ప్రాంతంలోని తాడోకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పదబేడా అటవీ ప్రాంతంలో జిల్లా పోలీసులు, బిఎస్‌ఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ డంప్ దొరికింది. 14 బర్మార్ తుపాకులు, 2 పిస్తోళ్లు, 25 రౌండ్ల తూటాలు, 15 ఏకె-47 రౌండ్లు, 4 టిఫిన్ బాంబులతో పాటుగా విప్లవసాహిత్యం, నిత్యావసర వస్తువులు లభించినట్లు బస్తర్ ఐజీ కల్లూరి తెలిపారు. సుక్మా జిల్లా కొండేర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు యువకులను శుక్రవారం మధ్యాహ్నం మావోలు అపహరించారు.

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
కోట, డిసెంబర్ 5: బట్టలు ఉతుక్కునేందుకు ముగ్గురు స్నేహితులు చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతిచెందగా ఒకరు క్షేమంగా బయటపడిన సంఘటన శనివారం నెల్లూరు జిల్లా కోట మండలంలో జరిగింది. మండలంలోని చిట్టేడు గ్రామానికి చెందిన ఎనిమిదోవ తరగతి చదువుతున్న సంజాం పద్మశ్రీ (13), తిరుమలశెట్టి వెంకటరమణమ్మ, కె మరియమ్మ బట్టలు ఉతుక్కునేందుకు శనివారం కేశవరం పంచాయతీ పరిధిలోని మద్దాలికండ్రిగ సమీపంలో వున్న అత్తివల్లూరు చెరువు వద్దకు వెళ్లారు. అయితే బట్టలు ఉతుకుతూ ప్రమాదశాత్తు పద్మశ్రీ, వెంకటరమణమ్మ చెరువులో పడిపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన మరియమ్మ పరుగుపరుగున గ్రామంలోకి వెళ్లి మృతుల బంధువులకు తెలిపింది. దీంతో వారు అగ్నిమాపక సిబ్బందికి, 108కి, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే ఇద్దరు స్నేహితుల మృతదేహాలు చెరువులో తేలియాడుతూ వుండటంతో ఒడ్డుకుచేర్చారు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి వెనుతిరిగి వెళ్లారు. విఆర్వో మృతులపై వివరాలు సేకరించారు. పద్మశ్రీ తల్లిదండ్రులు అపాచి కంపెనీలో పనికి వెళ్లివుండగా, వెంకటరమణమ్మ తల్లిదండ్రులు నారుమళ్లలో కూలీపనులకు వెళ్లివున్నారు. తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.

అంతర్రాష్ట్ర దొంగలముఠా అరెస్టు
ఐదుట్రిప్పర్లు, రెండు కార్లు స్వాధీనం
మదనపల్లె, డిసెంబర్ 5: ఒక రాష్ట్రంలో టిప్పర్లును దొంగతనం చేసి.. వాటికి రంగులు, నెంబరుప్లేట్లు మార్చి మరో రాష్ట్రంలో అమ్ముకుంటున్న తొమ్మిది మంది దొంగల ముఠాలో ఏడుగుర్ని మదనపల్లె పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె డిఎస్‌పి రాజేంద్రప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన జయరామ్‌చిన్నప్ప అలియాస్ శీను(29), రాజప్పరామచంద్ర అలియాస్ రాము(23), మదనపల్లెకు చెందిన ఆటోసుబ్బు మరికొంతమంది బృందంగా ఏర్పడి టిప్పర్లు, కార్లు దొంగతనం చేసేవారు. దొంగతనం చేసిన వీటిని అనంతపురం జిల్లా గార్లదినె్న మండలం క్రిష్ణాపురానికి చెందిన నెట్టం రామ్మోహన్(29) మధ్యవర్తిత్వంతో విజయవాడకు చెందిన పుచ్చకాయల నాగశీను అలియాస్ నాగరాజు(24)కు అమ్మేవారు. వాటిని విజయవాడకు చెందిన వుద్దండి రాధాక్రిష్ణ అలియాస్ చంటి(45) కొనుక్కొని నెంబరుప్లేట్లు మార్పుచేసి ఎక్కువ లాభానికి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేవాడు. గతనెల 22 మదనపల్లెలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుల సమాచారం ఇచ్చారన్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా వారిని కూడా శనివారం అరెస్టుచేసినట్టు డిఎస్పీ వివరించారు. ఇదిలావుండగా పలు బంగారు ఆభరణాల షోరూమ్‌లో చాకచక్యంగా ఆభరణాలు కాజేసే మహిళను మదనపల్లె పోలీసులు శనివారం అరెస్టుచేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు దర్గా సమీపంలో ఉంటున్న పులిపాటి భాగ్య(38) భర్త వెంకటేష్ చనిపోవడంతో కర్నాటక,చిత్తూరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేది. మదనపల్లెలో అనుమానితురాలిగా తిరుగుతున్న పులిపాటి భాగ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్టు అంగీకరించిందన్నారు. ఆమె వద్ద 181గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.