చిత్తూరు

బాబుది దుర్మార్గ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బెయల్‌పై విడుదలైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం
నెల్లూరు, డిసెంబర్ 8: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల చిత్తూరు జిల్లా రేణుగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్‌పై దాడి చేశారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి, 13 వైకాపా నాయకులపై ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. దీంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విద్యార్థి నాయకులు తివిక్రమ్, సురేష్‌నాయక్ ఈనెల 3న ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీస్‌లు ఎమ్మెల్యేను కోర్టులో హాజరుపరచగా కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఏర్పేడు పోలీస్‌లు ఎమ్మెల్యేనునెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. మంగళవారం బెయిల్‌పై ఎమ్మెల్యే, విద్యార్థి నాయకులు విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓట్లువేసి ముఖ్యమంత్రిని చేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు పాలనలో బడుగు, బలహీన వర్గాలకు చేసింది ఏమీలేదన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్లో కొన్నింటిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో వైకాపా అధికారంలోకి వస్తుందన్నారు. ప్రస్తుతం అధికారపార్టీ నాయకులకు వత్తాసుగా అధికారులు కూడా తలాడిస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ కార్యకర్తకు చీమకుట్టినాసరే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అప్పటి వరకు రాజశేఖర్‌రెడ్డి, జగనన్న అభిమానులు నిరాశ పడకుండా వేచి ఉండాలని ఆయన పేర్కొన్నారు.