జాతీయ వార్తలు

జైలు నుంచి రేపు సంజయ్‌దత్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పూణెలోని ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్‌ను గురువారం ఉదయం 9 గంటల సమయంలో విడుదల చేసేందుకు అధికారులు అన్ని లాంఛనాలను పూర్తి చేస్తున్నారు. 1993 ముంబయి పేలుళ్ల నేపథ్యంలో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడన్న అభియోగంపై బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కోర్టు అయిదేళ్ల జైలుశిక్షను విధించిన సంగతి తెలిసిందే. శిక్షాకాలం ఇంకా కొద్దినెలలు ఉండగానే సత్ప్రవర్తన కారణంగా ఆయనను ముందుగానే విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దత్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన భార్య మాన్విత, ఇతర కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. జైలు వద్ద స్వాగత కార్యక్రమాలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ భద్రతా కారణాల రీత్యా అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు. సంజయ్ విడుదల కాబోతున్నందున బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ సంతోషం వ్యక్తం చేశాడు.