రాష్ట్రీయం

డ్వాక్రాకు మొండిచెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇసుక రీచ్‌లు ఇక పెట్టుబడిదారులకే..

373రీచ్‌ల బహిరంగ వేలానికి 8న నోటిఫికేషన్ రాబడిలో 25శాతం మహిళా సంఘాలకు
మరో పాతిక శాతం రైతు సాధికారిత సంస్థకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

విజయవాడ, డిసెంబర్ 31:డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పరుగులు తీస్తుందంటూ ఇసుక అమ్మకాలను ఎంతో ఆర్భాటంగా అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్న వెనక్కి తీసుకుంది. కొత్త సంవత్సరం నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి బహిరంగ వేలంలో దక్కించుకున్న పెట్టుబడిదారుల చేతుల్లోకి ఇసుక వ్యాపారం వెళ్లనుంది. నూతన ఇసుక విధానంలో భాగంగా ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం గురువారం నగరంలో సమావేశమై అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటి వివరాలను ఈ సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించిన రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలో వున్న 373 ఇసుక రీచ్‌లలో 1.5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు గాను జనవరి 8వ తేదీ నోటిఫికేషన్ వెలువడనుంది. బహిరంగ వేలం వలన ఇసుక ధర పెరగకుండా చూస్తామని మంత్రి యనమల తెలిపారు. అలాగే ప్రభుత్వానికి కూడా నష్టం రాకుండా చూస్తూనే వచ్చే ఆదాయంలో 25శాతం సొమ్మును మహిళా సంఘాలకు, మరో 25 శాతం సొమ్మును రైతు సాధికారిత సంస్థకు కేటాయించటం జరుగుతుందన్నారు. మూడు క్యూబిక్ మీటర్ల ఇసుకను ఒక యూనిట్‌గా నిర్ధారించి ధరను రూ.550గా రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ధరకు అందుబాటులో వున్న ఇసుకను పూర్తిగా విక్రయించగలిగితే ప్రభుత్వానికి రూ.825 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేస్తున్నారు. ఇందులో సీనరేజ్‌గా రూ.75 కోట్లు స్థానిక సంస్థలకు చెందుతుంది. నూతన ఇసుక విధానంపై ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉప సంఘం జనవరి 3వ తేదీన మరోసారి సమావేశమై మార్గదర్శక సూత్రాలను ఆమోదించనుంది. ఇందుకోసం ఇసుకపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం తగ్గకుండా విధి విధానాలను రూపొందించాల్సిందిగా మైనింగ్‌శాఖ అధికారులను ఉప సంఘం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఇసుక రీచ్‌లలో నిర్ధారించిన పరిమాణంలో సంవత్సర కాలం పరిమితి ఉండేలా ఆన్‌లైన్‌లో టెండర్లు, ఈ-టెండర్లను తెరవనున్నారు. జనవరి 25న టెండర్లు తెరచి ఏజెన్సీలను నిర్ధారిస్తారు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే ఇసుక అమ్మకాలు నడుస్తాయి. తెల్లవారుజాము నుంచి కాంట్రాక్టులు పొందిన బడా బాబుల ఆధీనంలోకి వెళతాయి. నూతన ఇసుక విధానం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఆపై ఆరుమాసాల పాటు ఈ విధానాన్ని పర్యవేక్షించి మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేస్తామని మంత్రి యనమల తెలిపారు. ఈ సమావేశంలో మైనింగ్ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. (చిత్రం) సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు