తెలంగాణ

రూ.కోటి నగదు ఉన్న బ్యాగ్ స్వాధీనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగర శివారులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో మంగళవారం ఉదయం కోటి రూపాయల నగదు ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులు డంపింగ్ యార్డును పరిశీలిస్తుండగా డంప్ ఆపరేటర్ ఓ బ్యాగుతో వెళుతూ అనుమానాస్పదంగా తచ్చాడడాన్ని గమనించారు. వెంటనే బ్యాగులో ఏముందని ప్రశ్నించి దాన్ని తెరిచి చూడగా సుమారు కోటి రూపాయల నగదు ఉన్నట్లు గార్డులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.