జాతీయ వార్తలు

డిప్యూటీ కాగ్‌గా నంద కిశోర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భారత ఆడిట్‌, అకౌంట్‌ సేవలకు చెందిన 1981 బ్యాచ్‌ ఆఫీసర్‌ నందకిశోర్‌ డిప్యూటీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా నియమితులయ్యారు. నందకిశోర్‌ ఈ ఏడాది సెప్టెంబరు 1న డిప్యూటీ కాగ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన నియామకాన్ని కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదించింది. ప్రస్తుతం డిప్యూటీ కాగ్‌గా ఉన్న బల్వీందర్‌ సింగ్‌ ఆగస్టు 31న పదవీ విరమణ పొందనున్నారు.