రాష్ట్రీయం

ఈ వర్శిటీలో అంతా మంచివారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఫేస్‌బుక్‌లో పేర్కొన్న అంశాలను విశే్లషిస్తే అతని అంతరంగంలో తలెత్తిన కల్లోలం, ఆటుపోట్లు, మానసిక సంఘర్షణ విదితమవుతాయి. 2013 మేలో ఫేస్‌బుక్‌లో రోహిత్ ఇలా రాశారు. ‘నా తల్లి పవిత్రమైన మాతృమూర్తి. నాకు జీవితమంటే విరక్తి పుట్టినప్పుడల్లా నా తల్లిని తలుచుకుంటాను. ఆమె జ్ఞాపకాలనుంచి స్ఫూర్తి పొందుతుంటాను. నన్ను నా తల్లి ఎప్పుడూ వదిలిపెట్టదు’ అని పోస్టు చేశారు. 2010లో సెంట్రల్ వర్శిటీలో చేరినప్పుడు ఇలా పోస్టు చేశారు. ‘ఈ వర్శిటీ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడి మనుషులు చాలా మంచివారు. చాలా సంతోషంగా ఉంది. కొత్త మంచి స్నేహితుల కోసం ఎదురుచూస్తున్నాన’ని పేర్కొన్నారు. రోహిత్ ఫేస్‌బుక్‌లో తొలుత రాజకీయ రహిత వ్యాఖ్యలు చేసేవారు. ఆ తర్వాత ఫిడెల్ క్యాస్ట్రో, చెగువీరా తదితరుల గురించి తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే భారతీయ సమాజంలో ఉన్నత కులాల ఆధిపత్యంపైన ఆయన ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. అంబేద్కర్, పెరియార్‌ల గురించి తెలియదంటే విమర్శించేవారు.