రాష్ట్రీయం

ఇష్టంగా.. గెలిపించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది చారిత్రక విజయం
నగరంలో లక్ష ఇళ్లు నిర్మిస్తాం
పేదల అజెండానే తెరాస లక్ష్యం
అందరూ మా బిడ్డల్లాంటి వాళ్లే
విపక్షాలది నిర్మాణాత్మక పాత్ర కావాలి
కొత్తగా మూడు వెయ్యి పడకల ఆస్పత్రులు
మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తాం
ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్ఘాటన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఇది చారిత్రక విజయం. మాపై నమ్మకంతో ఇష్టంగా గెలిపించిన ప్రజలకు శిరస్సువొంచి నమస్కరిస్తున్నా అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారన్నారు. తక్షణం హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా లక్ష ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏడాదిలోగా వీటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు నిర్మించనున్నట్టు చెప్పారు. వచ్చే బడ్జెట్‌లోనే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించనున్నట్టు చెప్పారు. ఆ తరువాత వరుసగా నాలుగైదేళ్లు ఇళ్ల నిర్మాణం చేపడితే పూర్తవుతాయన్నారు. విలేకరుల సమావేశానికి ముందు ఉన్నతాధికారులతో సమావేశమై నగరానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. హైదరాబాద్ ప్రజలంతా కెసిఆర్ వెంటే ఉంటామని పిడికిలెత్తి ప్రకటించారంటూ ప్రజలకు కృతజ్ఞతలు ప్రకటించారు. మంత్రులు, పార్టీ యంత్రాంగం కష్టపడి పని చేసిందని ప్రశంసించారు. ప్రజలు ఇష్టపడి గెలిపిస్తేనే ఇలాంటి ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. పేదల అజెండానే తెరాస అజెండాగా ప్రకటించారు. కెజి టూ పిజి ఉచిత విద్యవినా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అన్నింటినీ అమలు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రకటించిన హామీలను సైతం అమలుచేసి చూపిస్తామన్నారు.
నగరానికి మూడు వైపులా వెయ్యి పడకలతో మూడు ఆస్పత్రులు నిర్మించనున్నట్టు చెప్పారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి మాత్రమే ఇప్పటివరకు సేవలు అందిస్తున్నాయన్నారు. గతంలో తెరాసపై ఎన్నో అపోహలు సృష్టించారని, అవన్నీ అవాస్తవమని తేలిపోయిందన్నారు. అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో నివసించే అందరి భద్రత, ఉపాధి అవకాశాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, ఎంత పెద్దవారైనా ఐరెన్ హ్యాండ్‌తో డీల్ చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో తలెత్తే వివాదాలను అతి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎంఐఎం మా మిత్రపక్షమే. అందులో మరో మాట లేదన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగుండాలని, పెట్టుబడులు రావాలని అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. కింగ్ కోటి ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడంతోపాటు మూడు వెయ్యి పడకల ఆస్పత్రులను కొత్తగా నిర్మించనున్నట్టు చెప్పారు. కుద్బుల్లాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలకు సంబంధించి ఒక ఆస్పత్రి రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒకటి, మల్కాజిగిరి ప్రాంతంలో ఒకటి నిర్మించనున్నట్టు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి వారంలో శంకుస్థాపన చేస్తానన్నారు.
విపక్షాలు ఆలోచించుకోవాలి
వరంగల్ ఎన్నికల ఫలితాల తరువాత విపక్షాల్లో మార్పు వస్తుందని ఆశించానని, కానీ రాలేదని ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని నిర్మాణాత్మక సలహాలివ్వాలని కోరారు. అర్ధంపర్థం లేని విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగడంవల్ల ప్రయోజనం లేదని, ప్రజల స్పందన గమనించిన తరువాతైనా వైఖరి మార్చుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో చేసిన సవాళ్లను స్పోర్టివ్‌గా తీసుకోవాలన్నారు. తెరాస వంద డివిజన్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఒకరు, చెవి కోసుకుంటానని ఇంకొకరు రకరకాల ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. సిపిఐ నాయకుడు నారాయణ తనకు మంచి మిత్రుడని, ఒక చెవి నారాయణను చూడలేను కనుక చెవి కోసుకోవాల్సిన పనిలేదని చమత్కరించారు. కార్తకర్తలు ఎవరూ ఆయన చెవి కోసేందుకు ప్రయత్నించవద్దని నవ్వుతూ చమత్కరించారు. గెలిచిన కార్పొరేటర్లు ప్రజావిశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పని చేయాలని సూచించారు. లంచం ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్‌లో పని చేయించుకున్నానని ప్రజలు చెప్పుకొనే పరిస్థితి రావాలని, అప్పుడే ప్రజలు మనకిచ్చిన విజయానికి సార్థకత అని కెసిఆర్ అన్నారు.