హైదరాబాద్

ఎవరికెన్ని స్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జిహెచ్‌ఎంసి జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలో గులాబీ పార్టీ విజయ దుందుబి మోగించింది. తెలంగాణలో జిహెచ్‌ఎంసి మొట్టమొదటి పాలకమండలిలో సభ్యుడిగా స్థానం దక్కించుకునేందుకు ఎంతోమంది నేతలు పార్టీలు మారి, తమ తలరాతలను కూడా మార్చుకున్నారు.
అప్పటికపుడు పార్టీలు మారిన వారికే టిఆర్‌ఎస్ టికెట్లు కేటాయించటంతో టిఆర్‌ఎస్ 40 నుంచి 50 వరకు మాత్రమే సీట్లు వస్తాయని రాజకీయ విశే్లషకులు చెప్పగా, అందరి అంచనాలను తారుమారు చేస్తూ టిఆర్‌ఎస్ కారు మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది.
పాతబస్తీ, కోర్ సిటీ, శివార్లు అంటూ తారతమ్యం లేకుండా అన్ని డివిజన్లలోనూ తమ సత్తాను చాటుకుంది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే శివార్లలోని మైలార్ దేవులపల్లి, సెటిలర్లు ఎక్కువగా ఉండే మాదాపూర్, హాఫీజ్‌పేటతో పాటు తలపండిన రాజకీయ నేతలకు నిలయమైన ఖైరతాబాద్, అలాగే తెలంగాణేతర ఓటర్లు ఎక్కువగా ఉన్న గోషామహల్ వంటి డివిజన్లలో కూడా ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొంది తమ సత్తాను చాటుకున్నారు.
తెరాస గెలిచిన డివిజన్లు
కాప్రా, డా.ఏఎస్‌రావునగర్, మీర్‌పేట హెచ్‌బి కాలనీ, మల్లాపూర్, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, బిఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ, సరూర్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం, సైదాబాద్, మూసారాంబాగ్, గోషామహల్, మైలార్‌దేవులపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, జియాగూడ, మంగళ్‌హాట్, గుడిమల్కాపూర్, గన్‌ఫౌండ్రి, హిమాయత్‌నగర్, గోల్నాక, నల్లకుంట, అంబర్‌పేట, బాగ్ అంబర్‌పేట, అడిక్‌మెట్, రాంనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వరకాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ, అమీర్‌పేట, వెంగళరావునగర్, సనత్‌నగర్, రెహ్మత్‌నగర్, బోరబండ, కొండాపూర్, గచ్చిబౌలీ, శేరిలింగంపల్లి, మియాపూర్, హాఫీజ్‌పేట, చందానగర్, రామచంద్రాపురం, బాలజీనగర్, అల్లాపూర్, మూసాపేట, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, వివేకానందనగర్‌కాలనీ, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్, చింతల్, సూరారం, సుభాష్‌నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మచ్చబొల్లారం, ఆల్వాల్, వెంకటాపురం, నేరెడ్‌మెట్, వినాయక్‌నగర్, వౌలాలీ, ఈస్ట్ ఆనంద్‌బాగ్, మల్కాజ్‌గిరి, గౌతంనగర్, అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్, బన్సీలాల్‌పేట, రాంగోపాల్‌పేట, బేగంపేట, మోండామార్కెట్ డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయం సాధించినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు.
మజ్లిస్‌కు దక్కిన స్థానాలు
పాతబస్తీలోని అక్బర్‌బాగ్, ఆజంపురా, చావ్‌నీ, డబీర్‌పురా, రెయిన్‌బజార్, మొఘల్‌పురా, తలాబ్ చెంచలం, లలితాబాగ్, కుర్మగూడ, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్ కుంట, సులేమాన్‌నగర్, శాస్ర్తీపురం, దత్తాత్రేయనగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, నానల్‌నగర్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, విజయనగర్‌కాలనీ, అహ్మద్‌నగర్, రెడ్‌హిల్స్, మల్లేపల్లి, జాంబాగ్, షేక్‌పేట, ఎర్రగడ్డలో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు
కమలనాథులకు నాలుగు స్థానాలు
టిడిపి, బిజెపిలు మిత్రపక్షంగా పోటీ చేసినా, గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌లోనే స్థానాలను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కమలనాథులు పాతబస్తీలోని ఘాన్సీబజార్, బేగంబజార్, ఆర్కేపురం డివిజన్లలో విజయం సాధించారు. ఇక టిడిపి మాత్రం కెపిహెచ్‌బికాలనీ ఒకే ఒక డివిజన్‌లో విజయం సాధించింది.