ప్రకాశం

ఇసుక అవసరాల కోసం దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 5:జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టే కాంట్రాక్టు పనులకు సంబంధించి ఇసుక అవసరాల కోసం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్‌కు, పంచాయతీరాజ్ ఇంజనీర్లకు దరఖాస్తు చేసుకోవాలని గనుల,్భగర్భశాఖ సహాయసంచాలకులు రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయితీరాజ్‌శాఖద్వారా జాతీయ ఉపాధిహామీ పథకానికి సంబంధించి సిమెంటు రోడ్డుపనులు జరుగుతున్నందున పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎక్కడ పనులు జరుగుతున్నాయి, సంబంధిత పనికి ఎంత ఇసుక అవసరం అవుతుంది, ఆ పనికి ఎంత దూరంలో ఇసుక రీచ్ లభ్యత ఉందనే విషయం స్పష్టంగా తెలియచేస్తూ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యులు జెసికి తెలియచేయాలన్నారు. ఈనెల 4న గనులు, భూగర్భశాఖమంత్రి పీతల సుజాత పంచాయితీరాజ్ ఇంజనీర్లు, భూగర్భ, గనులశాఖ ఎడి, డిడిలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పంచాయతీరాజ్ శాఖ వారు సీనరేజ్ చార్జీలు లేకుండా ఇసుక సరఫరా చేసుకునేందుకు జివో నెంబరు 20ని విడుదల చేయటం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖ వారికి ఇసుక కోసం జెసికి చేసుకున్న దరఖాస్తులు పంచాయితీరాజ్ శాఖ ఇఇ, భూగర్భజలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇసుక రీచ్‌లు పరిశీలించి జెసికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. సంబంధిత పంచాయతీరాజ్ పనులకు కావాల్సిన మేర ఇసుక కేటాయింపు ఉత్తర్వులు ఇస్తారన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టే జాతీయ ఉపాధిహామీ పథకం సిమెంటు రోడ్డుకు సరఫరా చేసే ఇసుకను పంచాయతీరాజ్ ఇఇలు, మైనింగ్ శాఖ ఎడి, తహాశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు లేదా సంయుక్త కలెక్టర్ కేటాయించిన ఆధీకృత అధికారులు మాత్రమే తనిఖీచేపట్టాలన్నారు. ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు ఈ పనులకు సంబంధిత వాహనాలు తనిఖీలు చేపట్టకూడదని రామచంద్రరావు తెలిపారు.

గిడసబారుతున్న పొగతోటలు
* దెబ్బతీసిన వర్షాభావం
* తోటల ఎదుగుదలకు నీరు పెడుతున్న రైతులు
* తెగుళ్లతో రైతుల్లో ఆందోళన
* పెరిగిన ఖర్చులు...తగ్గనున్న దిగుబడులు
కందుకూరు, ఫిబ్రవరి 5 : వర్షాభావ పరిస్థితుల కారణంగా పొగాకు తోటలు కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఎదుగుదల లేక గిడసబారి పోతున్నాయి. ఇదిలాఉండగా మరోవైపు పొగ మొక్కలకు తెగుళ్లు ఆశించి పైర్లలో ఎదుగులదల కూడా నిలిచిపోతోంది. ఇటు వర్షాభావం, అటు తెగుళ్ల కారణంగా పొగతోటల్లో ఎదుగుదల లోపించడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గే సూచనలు కన్పిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది వాతావరణం అనుకూలించడంతో రైతుల అంచనా మేరకు పొగాకు దిగుబడులు వచ్చాయి. ధర కూడా అమ్మకాలు ప్రారంభ దశలో కొంత మేర మందంగా ఉన్నా, ఆ తరువాత ధరలు కొంత మేర పెరిగాయి. అయినప్పటికీ రైతులు నష్టాలు భరించక తప్పలేదు. దీంతో రైతులు ఆత్మహత్యల బాట పట్టారు. పొగాకు రైతుల దయనీయ పరిస్థితిని గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు 20 రూపాయలు కేజీకి అదనంగా చెల్లించేలా ఒప్పందానికి వచ్చి ఆ మొత్తాన్ని రైతు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది కూడా రైతులు నవంబర్, డిసెంబర్ మాసాల్లో కురిసిన వర్షాలకు పొగనాట్లు వేశారు. అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించక, వర్షాలు కురవక తోటల్లో ఎదుగుదల కనిపించడం లేదు. వర్షాలు కురవకపోవడంతో పొగతోటలు గిడసబారుతున్నాయి. దీంతో తోటల ఎదుగుదలకు రైతులు అధిక వ్యయప్రయాసలకు ఓర్చి ట్యాంకర్ల ద్వారా, ఆయిల్ ఇంజన్ల ద్వారా నీరు పెట్టుకుంటూ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం నీరు పెట్టేందుకు ఎకరాకు ఎరువులతో కలిపి 7 వేల నుంచి 10 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు.
పెరిగిన ఖర్చులు
గత ఏడాదికి, ఈ ఏడాదికి వ్యవసాయ ఖర్చుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. అన్ని ఖర్చులు పెరిగాయని రైతులు చెప్తున్నారు. గత ఏడాది ఆకుకూర్చే కూలీలు ఎకరాకు 13 వేల నుంచి 14 వేల రూపాయలు తీసుకుంటే ఈ ఏడాది 15వేల నుంచి 16వేలు వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పొగాకు బ్యారన్ క్యూరింగ్ చేసే డ్రైవర్ ఖర్చు గత ఏడాది 8వేలు కాగా ప్రస్తుతం 10 వేల వరకు పలుకుతోంది. ఈ విధంగా ప్రతి దానిలోను గత ఏడాది కంటే ఈ ఏడాది ఖర్చులు పెరిగాయి. తగ్గనున్న దిగుబడుల నేపథ్యంలో గత ఏడాది లాగా ధరలు పలికితే పొగాకు రైతులు మరింత నష్టాలు భరించాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కౌలు ధరలతో కలిపి ఎకరాకు 70వేల నుంచి 80వేల రూపాయల వరకు సాగుకు ఖర్చు అవుతుందని, ఎకరాకు కౌలు 16వేల నుంచి 18 వేల దాకా అడ్వాన్స్ కౌలు చెల్లించి సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు. ఇదిలాఉండగా ప్రస్తుతం నీరు కట్టుబడి, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలతోపాటు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా టుబాకోబోర్డు సిబ్బంది కొనుగోలుకు ముందుగానే విదేశీ ఆర్డర్లను సేకరించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లావ్యాప్తంగా కాపుల నిరసన
జిల్లాకు తాకిన ముద్రగడ ఆమరణ నిరాహరదీక్ష సెగ
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 5: కాపుల్ని బిసిల్లో చేర్చాలని కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన స్వగృహంలో శుక్రవారం ఉదయం చేపట్టిన ఆమరణ నిరాహరదీక్షకు మద్దతు జిల్లావ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలను కాపుసంఘాల నాయకులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా కాపుల సంఖ్య గణనీయంగానే ఉందనే చెప్పవచ్చు. దీంతో ముద్రగడకు కాపులు సంఘీభావం తెలుపుతున్నారు. అందులోభాగంగానే కాపులు ముద్రగడ ఇచ్చిన పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా జిల్లాకేంద్రమైన ఒంగోలులో కాపు కల్యాణ మండపంలో ఆహారం మానివేసి ఖాళీ కంచాలతో శబ్ధం చేస్తూ కాపునేతలు వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు కె సంజీవకుమార్, కాపు కల్యాణమండపం కోశాధికారి తోటపల్లి వెంకటరంగరావు మాట్లాడుతూ ముద్రగడ పిలుపుమేరకు ఖాళీ కంచాలతో శబ్ధంచేస్తూ నిరసన తెలిపామన్నారు. ఈ ఉద్యమం ఉద్ధృతం కాకముందే సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. స్థానిక కలెక్టరేట్ ముందు, అన్ని మండలాల తహశీల్దార్ల కార్యాలయాల ఎదుట శనివారం నుండి రిలేనిరాహర దీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ దీక్షలకు జిల్లాలోని కాపులందరు సిద్దంగా ఉండాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో కాపునాయకులు నాగిశెట్టి బ్రహ్మాయ్య, ఆరిగ చలమయ్య, ఆరిగ మల్లికార్జునరావు, కుర్రా ప్రసాదుబాబు, పసుపులేటి గోవిందరావు, బి హరిబాబు, పి సురేష్‌బాబు, పి మల్లిఖార్జునరావు, జి కిశోర్, డి వెంకటకృష్ణారావు, యు శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సైనికునిపై కేసు నమోదు
కొమరోలు, ఫిబ్రవరి 5: మండలంలోని ఇడమకల్లు గ్రామానికి చెందిన ఒక విద్యార్థినిని గత కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన సైనికుడు బొంతా శివారెడ్డి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వేధిస్తున్నాడంటూ అందిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామని ఇన్‌ఛార్జి హౌస్ ఆఫీసర్ ఎం జిలానీబేగ్ తెలిపారు. సదరు బాలిక పాఠశాలకు వెళ్ళి వచ్చే సమయంలో దారికాచి సైనికుడు శివారెడ్డి వేధిస్తుండటంతో బాలిక సమాచారాన్ని శుక్రవారం తల్లిదండ్రులకు తెలియచేసింది. ఆమేరకు బాలికను వెంటపెట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
దొనకొండ, ఫిబ్రవరి 5: ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలోని రుద్రసముద్రం సమీపంలో శుక్రవారం జరిగింది. ఎస్సై అజయ్‌కుమార్ కథనం మేరకు రుద్రసముద్రం గ్రామానికి చెందిన వీరెళ్ళ బంగారయ్య (30) డీజిల్ కోసం దొనకొండకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన బంగారయ్య భార్య గత రెండేళ్ళ కిందట మృతిచెందింది. బంగారయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి వైద్యశాలకు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు.

చెత్తకుండీ పక్కన శిశువు మృతదేహం
కందుకూరు, ఫిబ్రవరి 5: ఓ చిన్నారి మృతదేహం చెత్తకుప్ప సమీపంలో దర్శనమిచ్చిన సంఘటన శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సరిగా ఎదుగుదల లేక తల్లి గర్భంలోనే చనిపోయిన బిడ్డను చెత్తకుండీ పక్కన పడేసి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు.

పొన్నూరుకు జాతీయస్థాయి కృషిరత్న పురస్కారం
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 5: ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి పొన్నూరు వేంకట శ్రీనివాసులకు లిటిల్ ఛాంప్స్ అకాడమీ జాతీయస్థాయి కృషి రత్న అవార్డుకి ఎంపిక చేయడం పట్ల ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సాహిత్యరంగంలోగత 30 సంవత్సరాలుగా విశేషమైన కృషి చేస్తూ స్వయంకృషితో ఎదిగిన పొన్నూరికి కృషిరత్న పురస్కారం ప్రదానం చేయడం అభినందించదగిన విషయమని తెలిపారు. గతంలో అకాశవాణి, విజయవాడ కేంద్రంలో రెండుసార్లు ఉత్తమకవిగా ఎంపిక కావడం, ఆంధ్ర నాటక కళాపరిషత్ పురస్కారం, లక్కోజు సాహితీ పురస్కారం, సభా సంచాలకాచార్య పురస్కారం, హాస్యసాహిత్య రత్న పురస్కారం, అన్నమయ్య సాహితీ పురస్కారం, కళాదర్బార్ పురస్కారం, గోదావరి సాహితీ పురస్కారం, ఎక్స్‌రే అవార్డు, జాషువా యువ కవి సాహితీ పురస్కారం, సాహితీ శ్రమశక్తి అవార్డులతో పాటు సుమధుర సాహితీ భూషణ, వికటకవి, వ్యాఖ్యాన శిరోమణి, సభావాచస్పతి బిరుదులను ఎన్నో అందుకున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాల విజయవంతంలో విశేష ప్రతిభ కనబర్చిన పొన్నూరికి జాతీయస్థాయిలో కృషిరత్న పురస్కారం రావడం సంఘానికి గర్వ కారణమని తెలిపారు. ఈనెల 7వతేది ఆదివారం ఈ అవార్డు అందుకోనున్న పొన్నూరుని ప్రకాశం జిల్లా రచయితల సంఘం కోశాధికారి యత్తపు కొండారెడ్డి, సంఘ సభ్యులు, అనందమయి కార్యదర్శి అన్ను విజయకుమారి, అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ, బాలు కళా సమితి అధ్యక్షులు పోలవరపు అజయ్‌బాబు, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్ళగుంట క్రిష్ణయ్య, టిటిడి జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అళహరి చెంచలరావు, తెలుగు సంస్కృతి సమితి కార్యదర్శి యువి రత్నం, శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అధ్యక్షులు మద్దుల నరసింహారావు, తదితరులు అభినందించినట్లు తెలిపారు.

గ్రాసం లేదు.. దాహం తీరదు..
* అల్లాడుతున్న మూగజీవాలు
మార్కాపురం, ఫిబ్రవరి 1: తీవ్ర వర్షాభావంతో కరవుప్రభావం అధికంగా ఉండడంతో పశ్చిమ ప్రకాశమైన మార్కాపురం డివిజన్‌లో పశుగ్రాసం కొరత తీవ్రమైంది. అలాగే భూగర్భ జలాలు అడుగంటి బోర్ల ద్వారా నీరు రాకపోవడంతో మూగజీవాల దాహం కూడా తీరని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏడాది ఈప్రాంతంలో నాగార్జున సాగర్ కాలువ కింద పంటలు పండితే ఈప్రాంత పశుపోషకులు ఆ ప్రాంతానికి వెళ్ళి పశుగ్రాసాన్ని కొనుగోలుచేసి మూగజీవాలకు గ్రాసంగా వేసేవారు. అయితే ఈఏడాది సాగర్ కాలువ పరిధిలోకూడా పంటలు లేకపోవడంతో పశుగ్రాసం కొరత తీవ్రమైంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకునేందుకు ప్రయత్నించినా ధర భారం కావడంతో పశుపోషకులు ఆమేరకు భారాన్ని భరించలేక మూగజీవాలను ఎలా పోషించాలా అని ఆవేదన చెందుతున్నారు. అలాగే గ్రామాల్లో నీరులేకపోయినప్పటికీ పొలాలకు వెళ్ళిన సమయంలో కుంటలు, వాగుల్లో నీరు ఉంటే పశువులు వాటిని తాగడంతో కొంతమేర ఇబ్బంది తగ్గేదని, అయితే పొలాల్లో మేత లేకపోవడం, అలాగే నీరు లేకపోవడంతో మూగజీవాలను పోషించడం పశుపోషకులకు భారంగా మారింది. ఇదిలాఉంటే ఇటీవల కాలంలో పాలధర కూడా తగ్గడంతో అధిక వ్యయ ప్రయాసలకోర్చి పాలు ఉత్పత్తి చేసినప్పటికీ ఫలితం ఉండదనే అభిప్రాయం పశుపోషకుల్లో వ్యక్తం అవుతోంది. గతంలో రాష్ట్రంలో కరవు ఏర్పడినప్పుడు రాష్ట్రప్రభుత్వాలు సబ్సిడీపై పశుపోషకులకు పశుగ్రాసాన్ని సరఫరా చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆమేరకు చర్యలు చేపట్టకపోవడంతో పశువులను పోషించడం కష్టంగా మారిందని, ప్రభుత్వం స్పందించకుంటే వేల రూపాయలు విలువచేసే గేదెలు, ఆవులను, ఇతర మూగజీవాలను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూగజీవాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.