ఎన్నికల కబాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న ‘కబాలి’ చిత్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నట్టుగా కోలీవుడ్ సమాచారం. తన రియల్ లైఫ్‌లో ఎంత వయసులో ఉన్నాడో అంతే వయసుతో ఈ పాత్రలో కనిపిస్తాడు రజని. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. ఈనెలలోనే షూటింగ్ పూర్తికానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24న తమిళ సంవత్సరాది సందర్భంగా అక్కడ విడుదల చేస్తారని మొదట అనుకున్నారు. కానీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా విడుదల వాయిదా వేయాలని చిత్ర నిర్మాతను రజనీకాంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల తేదీ ప్రకటించాక, సినిమా విడుదల తేదీ ఖరారు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ చివరిలోగానీ, మే మొదట్లోగానీ విడుదల చేయమని సూచించినట్టుగా సమాచారం.