మిర్చిమసాలా

ఎవరు ఛూస్తారులే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైస్ ఛాన్సలర్ల నియామకానికి ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం దరఖాస్తులు స్వీకరించింది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. అంత వరకూ ఓకే...దరఖాస్తుల్లో ఉన్న వివరాలు అధికారులను బైర్లుకమ్మేలా చేస్తున్నాయి. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన చంద్రాకృష్ణమూర్తి తన బయోడాటా అంతా తప్పులు తడకలు, అబద్ధాలతో నింపారట! అది కాస్తా ఆలస్యంగా పెద్దల చెవిన పడగానే ఆమెను పక్కన పెట్టారు, ఆమె కంటే మేం తీసిపోయామా అంటూ మన వాళ్లు సైతం ఇష్టారాజ్యంగా వివరాలు నింపారట, ఎన్ని కాన్ఫరెన్స్‌లకు వెళ్లారు అంటే ఒకాయన 150 అని రాశాడట, ఆ 150 ఎక్కడ జరిగాయో ఎప్పుడు వెళ్లాడో ఆయనకే తెలియాలి, కాన్ఫరెన్స్ కంటెంట్ ఏమిటి? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది ? ఎలా వెళ్లాడు? ఆరోజు తన ఉద్యోగానికి సెలువులు పెట్టారా లేదా లాంటి వివరాల పూర్వాపరాలు తీస్తే అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు విద్యార్ధులు...
-బి.వి.ప్రసాద్

దేవుడే దిక్కు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేవాలయ అర్చకులు ఒకేరకమైన సమస్యలతో సతమతమవుతున్నారు. వీరి సమస్యలను పరిష్కరిస్తామంటూ ఇరు రాష్ట్రాల సిఎంలు, సంబంధిత మంత్రులు హామీలపై హామీలు గుప్పిస్తున్నప్పటికీ, పరిష్కారం కావడం లేదు. అర్చకుల సంఘాల ప్రతినిధులు సచివాలయానికి, సిఎం, మంత్రుల కార్యాలయాలకు తిరిగి తిరిగి అలసిపోతున్నారు. సర్కారు వారు తమ ఖజానా నుండి ఒక్క నయాపైస కూడా ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా, ఈ సమస్య నానుతూనే ఉంది. ఇక భగవంతుడా ‘నీవే దిక్కు..నీవే మా సమస్యలు పరిష్కరించా’లంటూ అర్చకులు వేడుకోవాల్సి వస్తోంది.
- పి.వి. రమణారావు

పాత వారే..!
అన్ని రాజకీయ పార్టీల్లోనూ జిహెచ్‌ఎంసి ఎన్నికల వేడి కొనసాగుతున్నది. మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తల నొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది సీనియర్లు టిక్కెట్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనపడడం లేదంటూ ఓ మహిళా కార్యకర్త పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాత వాళ్ళకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో చాలా మంది ఆందోళనలు చేపట్టడాన్ని, అసంతృప్తికి గురి కావడాన్ని ఒక విలేఖరి పార్టీ జాతీయ నాయకుడిని ప్రశ్నించగా, పార్టీలో ఉన్నదంతా పాత వారేనని, ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీలోకి ఈ సమయంలో కొత్త వారు ఎక్కడి నుంచి వస్తారని సదరు నాయకుడు ఠకీమని సమాధానమిచ్చి వెంటనే నాలిక కరచుకున్నారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

ఫేస్‌బుక్ వాల్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. కారణం ఏమిటా? అంటే 2009లో జగనన్న నాయకత్వం వర్థిల్లాలి అని గోడలపై నినాదాలురాశారట! ఈ విషయం తెలియగానే వైఎస్‌ర్ కాంగ్రెస్ అభిమానులు ఫేస్‌బుక్ వాల్‌పై జాగ్రత్తరోయ్ మనం వాల్‌మీద జగనన్న నాయకత్వం వర్థిల్లాలి అని రాసినా అరెస్టు చేస్తారు అంటూ చెప్పుకుంటున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చురుగ్గా ఉంటున్న నాయకులను ఏదో ఒక పాత కేసు తిరగదోడి అరెస్టులు చేయిస్తున్నారు. మరీ సిల్లీగా గోడలపై ఎప్పుడో రాతలు రాశారని ఇప్పుడు అరెస్టు చేయడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదంటున్నారు ఆ పార్టీ నాయకులు.
- మురళి

మరి ఆ వంద సీట్లు గెలిచెదేవరు?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తాజాగా సవాలు చేశారు. అంతకుముందు ఇదే సవాల్‌ను టిటిడిపి వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విసిరారు. ఈయన అయితే మరో అడుగు ముందుకేసి, టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలుచుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా, తెలంగాణ భూ భాగంలో అడుగు పెట్టనని ప్రకటించారు. రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సాధారణ విషయమే అయినప్పటికీ ఇక్కడో విషయాన్ని మాత్రం వీరిద్దరు చెప్పలేకపోతున్నారు. టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలుచుకోదు సరే, మరి ఆ వంద సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందా? టిడిపి గెలుచుకుంటుందా? ఆ విషయాన్ని షబ్బీర్ అలీకానీ, రేవంత్‌రెడ్డికానీ ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు? అంటే తమ పార్టీ ఎలాగూ వాటిని గెలుచుకోలేదని పరోక్షంగా చెప్పినట్టే కదా? అంటే ఆ వంద సీట్లు టిఆర్‌ఎస్ గెలుచుకుంటుందని చెప్పకనే చెప్పినట్టు కదూ!
- వెల్జాల చంద్రశేఖర్