క్రీడాభూమి

ఎట్టకేలకు బంగ్లాదేశ్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, ఫిబ్రవరి 26: ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ ఎట్టకేలకు బోణీ చేసింది. ఈ టోర్నీలో ఇంతకుముందు టీమిండియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆ జట్టు తాజాగా శుక్రవారం మీర్పూర్‌లో జరిగిన పోరులో పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ను 51 పరుగుల తేడాతో మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన యుఎఇ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు మొహమ్మద్ మిథున్, సౌమ్య సర్కార్ 46 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం సర్కార్ (21)తో పాటు సాబిర్ రెహ్మాన్ (6), మిథున్ (47), ముష్ఫికర్ రహీమ్ (4) త్వరత్వరగా నిష్క్రమించగా, మిగిలిన బ్యాట్స్‌మన్లలో మహ్మదుల్లా (36-నాటౌట్) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు రాబట్టలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే సాధించగలిగింది. యుఎఇ బౌలర్లలో మొహమ్మద్ నవీద్, అమ్జాద్ జావెద్ రెండేసి వికెట్లు, రోహన్ ముస్త్ఫా, మొహమ్మద్ షహజాద్ చెరో వికెట్ అందుకున్నారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన యుఎఇ జట్టును బంగ్లాదేశ్ బౌలర్లు సమర్ధవంతంగా ప్రతిఘటించారు. ముఖ్యంగా మహ్మదుల్లా, మషఫ్రీ మోర్తజా, ముస్త్ఫాజుర్ రహ్మాన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన యుఎఇ జట్టులో రోహన్ ముస్త్ఫా (18), మొహమ్మద్ షహజాద్ (12), ముహమ్మద్ ఉస్మాన్ (30) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించకుండానే నిష్క్రమించారు. ఫలితంగా 17.4 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైన యుఎఇ జట్టు 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.