తెలంగాణ

ఎంసెట్-2 లీకేజీపై సమగ్ర విచారణ జరిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు విచారణలో తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం తెలిపారు. లీకేజీ ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఎంసెట్-2 పరీక్ష జరగడానికి వారం రోజులు ముందే కోచింగ్ సెంటర్లకు కొందరు విద్యార్థులు గైర్హాజరయ్యారని, లీక్ అయిన పేపర్‌తో వారు ఇంటివద్ద ప్రిపేర్ అయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కోచింగ్ సెంటర్‌లో ప్రతిభ చూపని వారికి ఎంసెట్-2 లో మంచి ర్యాంకులు ఎలా వచ్చాయని కొందరు తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు భారీగా డబ్బులు దండుకుని పేపర్‌ను అమ్ముకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.