రాష్ట్రీయం

మరిన్ని నేవీ బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పు నౌకాదళ అధికారి సోనీ వెల్లడి
విశాఖపట్నం, డిసెంబర్ 3: తమిళనాడులో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని అన్ని విధాలా ఆదుకోడానికి తూర్పు నౌకాదళం మరిన్ని చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటికే హెలికాప్టర్లు, జెమిని బోట్లు, యుద్ధ నౌకతో ఆహార పదార్థాలను పంపించింది. వరద ముంపు ఇంకా తగ్గకపోవడం, బాధితు సంఖ్య పెరిగిపోవడంతో మరిన్ని యుద్ధ నౌకలతో ఆహార పదార్థాలు, దుప్పట్లు, ఇతర వస్తువులను చెన్నై పోర్టుకు తరలించింది. తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ గురువారం విశాఖలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ఐరావత్‌తో పాటు ఒక హెలికాప్టర్, ఓక వైద్య బృందం, 20 మంది డైవర్లు, ఎనిమిది జెమిని బోట్లు బుధవారం విశాఖ నుంచి బయల్దేరి, గురువారం మధ్యాహ్నానికి చెన్నై హార్బర్‌కు చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ సహ్యాద్రి యుద్ధ నౌకలు, ఒక హెలికాప్టర్, మరో వైద్య బృందాన్ని, 30 టన్నుల ఆహార పదార్థాలను, ఒక టన్ను తినేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని తరలిస్తున్నట్టు సోనీ వివరించారు.