జాతీయ వార్తలు

ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోం:సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మోదీ బయోపిక్ నిర్మాతలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈసీ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సీల్డ్ కవర్‌లో ఈసీ సమర్పించిన నివేదికపై శుక్రవారం విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఈసీ నిర్ణయం సబబేనని తెలిపింది. మోదీ బయోపిక్.. ఓ రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించేదిగా ఉందని ఈసీ తమ నివేదికలో పేర్కొంది. ఈ సినిమాను వచ్చే నెల 19 వరకు అంటే చివరి దశ ఎన్నికల జరిగేవరకు విడుదల చేయొద్దని తెలిపింది. నివేదికను పరిశీలించి.. ఈసీ నిర్ణయంలో తాము కల్పించుకోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. మోదీ బయోపిక్ సినిమా విడుదలను ఈసీ అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.