బిజినెస్

సంస్కరణలు అమలైతే 9 శాతానికి భారత్ వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ ఆర్థికవేత్త లారెన్స్ సమ్మర్స్ అంచనా
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన సంస్కరణలను ఆచరణలోకి తెస్తే భారత వృద్ధిరేటు దశాబ్దకాలంపాటు 9 శాతానికి తగ్గకుండా నమోదయ్యే అవకాశాలున్నాయని, ఆ తర్వాత కూడా 8 శాతంగా ఉండొచ్చని ప్రముఖ ఆర్థికవేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ లారెన్స్ సమ్మర్స్ శనివారం అన్నారు. హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘్భరత్ మినహా, మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధిరేటు నానాటికీ దిగజారిపోతోంది. ఈ క్రమంలో భారత్ సంస్కరణల పథంలో నడిస్తే రాబోయే దశాబ్దకాలంలో 9 శాతం సగటుతో దేశ జిడిపి నమోదవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రభావంతో ఆ తర్వాత దశాబ్దం 8 శాతంగా, ఆపై 7.5 శాతానికి తగ్గకుండా వృద్ధిరేటు ఉంటుందని భావిస్తున్నాను.’ అన్నారు.