సబ్ ఫీచర్

హైందవంలో ప్రత్యేకత...ఆరాధనా స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్తి భావస్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ హిందువులకు ఉంది. ఇతరమతాల్లో లేదు. ఇతర మతాల్లో కొనసాగే అసహనం భావస్వేచ్ఛ ఎట్లా అవుతుంది. హైందవంలో నిరీశ్వర సాంఖ్యం అని ఒక తత్వం ఉంది. భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు సాంఖ్యం- అంటే దేవుడు లేడు అనేవారు కూడా మన్నింపబడ్డారు. ఇదొక ఆలోచనావిధంగా గౌరవించారు. ఇక దేవుడున్నాడనేవాడు ఒకే దేవుణ్ణికాదు మూడుకోట్ల మంది దేవతలను ఆరాధించుకోవచ్చునన్నారు. ఇదే హైందవం. కాబట్టి కొందరు దుర్మార్గులు రాజకీయ లబ్దికోసం ఇవ్వాళ చిత్రిస్తున్నట్టు మహిషాసుర, నరకాసుర, రావణ, కుంభకర్ణులు మూలవాసులు కాదు. ద్రవిడవాసులూ కాదు. రాముడు ఉత్తర దేశానికి చెందిన ఆర్యుడూ కాదు.
స్కృతాన్ని తృతీయ ఐచ్ఛిక భాషగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని తమిళనాడులో కరుణానిధి వ్యతిరేకించారు. హిందీని అనుసంధాన భాషాగా ఉపయోగించడానికి కూడా ఈయన వ్యతిరేకించాడు. తమిళం గొప్ప భాషే కాని అది ఒక ప్రాంతీయ భాష. తిరుత్తని దాటి ఉత్తరంగా పది అడుగులు వేస్తే తెలుగు మొదలవుతుంది. తమిళాన్ని ఎవరూ అవమానించలేదు. కానీ కొందరు తమిళులు తెనుగును, హిందీని, కన్నడాన్ని, సంస్కృతాన్ని అవమానించారు. నిజానికి వారి పురుచ్చితలైవి, అయ్యంగార్ (తెంగళ్ వైష్ణవ)కుటుంబలో పుట్టింది-వారు నిత్యం పాడుకుని తరించే త్యాగరాజ కీర్తనలు రచించినవాడు బ్రాహ్మణుడు. వారి అగ్రశ్రేణి హీరో ఎంజి రాంచంద్రన్ తమిళుడు కాడు. కేరళకు చెందినవాడు. కరుణానిధి సంస్కృత పదం. వారి టివి ఛానల్ ‘ఉదయన్’ సంస్కృత పదం.
1940వ దశకంలోద్రావిడ ఉద్యమం వేళ్లూనింది. దీనికి బిషప్‌లు నారు వేసి నీరు పోశారు. శిశువుకు ఆక్సిజన్, ఆహారం అందించే అంబిలికల్ కార్డు (జీవనాడి) సంస్కృతం. దానినుండి భారత జాతిని దూరం చేయాలన్న ప్రయత్నం జరిగింది. కర్ణాటకలో లింగాయతులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీరంతా బసవన్నగారి భక్తులు. బసవేశ్వరుడు కృష్ణాజిల్లా నుండి విజయవాడ పరిసర ప్రాంతాల నుండి వలస వెళ్లిన శైవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. గత కొద్దికాలంగా బసవన్న బ్రాహ్మణుడు కాదు మంగలి అన్నారు. మంగలి కాదు మాదిగ అంటూ కొద్ది రోజుల క్రితం ఒక పుస్తకం వచ్చింది. మాదిగ అయితే ఏమిటి? తప్పా? హరళయ్య, కల్యాణయ్య, శీలవంతుడు మాదిగవారు. మయావతి వేశ్య. వీరంతా బసవన్న గారి శిష్యులు. ఐతే ఇక్కడ ప్రధానాంశం ఇది కాదు. బసవన్న ఏ కులానికి చెందినవాడో ఆ కులాన్ని మార్చడం చరిత్ర విరుద్ధం. బసవన్న కుల వ్యవస్థను పాటించలేదు. కాని ఆయన వివాహమాడిన గంగను బండారు బలదేవుడనే శైవ బ్రాహ్మణుని కుమార్తెనే.
హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ స్టడీ సెంటర్ ఉంది. అందులో క్రైస్తవులు, మావోయిస్టులు ప్రధానంగా సభ్యులు. ఈ రెండు వర్గాల వారు హిందూ అనే మాట వింటే మండిపడతారు. ఇక్కడ ఉగ్రవాది మక్బుల్ భట్ జయంతి, మహిషాసుర, నరకాసుర జయంతులు నిర్వహించారు. ఎందుకు? నరకాసురుడు ఎవరికీ కులదైవం కాదు. అసలు మహిషాసురుడు, నరకాసురుడు ఎవరు? మహిషము అంటే దున్నపోతు. దీనికి వివేకమూ, చైతన్యమూ తక్కువ. అందుకని మహిషాన్ని తమోగుణానికి సంకేతంగా ఉపయోగించారు. అయ్యప్ప మహిషితో యుద్ధం చేశాడు. పులిమీద స్వారీ చేశాడు అంటే తమస్సు, రజస్సులను జయించాడు అని కథలోని సంకేతం. నల్లబట్టలు మృత్యువుకు చీకటికి సంకేతం. మకరవిలుక్కు జ్ఞానానికి సంకేతం. కవులు కళాకారులు జ్ఞానులు, శాస్తవ్రేత్తలు ప్రధానంగా తమ భావాలను ప్రతీకాత్మకంగా చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. లోక్‌సభలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఏచూరి సీతారాం మహిషాసురుణ్ణి సమర్ధించి, దేవిని నిందించాడు. కమ్యూనిస్టులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఈశ్వరుడికి అనేక రూపాల్లో సేవలు చేసుకుంటుంటారు. అక్కడికి కుమ్మరి కుండ వస్తుంది, పద్మశాలి నేసిన కొత్త వస్త్రం వస్తుంది, రైతు పంచిన ధాన్యం తలంబ్రాలు అవుతాయి. బ్రాహ్మణుడు వేదమంత్రాలు చదివి విశ్వశాంతి కోరుకుంటాడు. ఇవన్నీ కలిస్తేనే బ్రహ్మోత్సవాలు. మంగలి-మంగళ వాద్యం మ్రోగిస్తాడు. దేవదాసీలు నృత్యకైంకర్యం చేస్తారు. కళాకారులైన దేవదాసీ అనే శబ్దం తర్వాత కాలంలో దురర్ధాన్ని సంతరించుకుంది. పూరీ జగన్నాథ రథాన్ని కొన్ని వేలమంది భక్తులు పట్టుకొని లాగుతారు. ఇలాంటి భారతీయ ఆథ్యాత్మిక భావనను క్రైస్తవులు, కమ్యూనిస్టులు పరిహసిస్తారు. ముస్లింలైతే పూర్తిగా ఆలయాలనే ధ్వంసం చేశారు.
‘డ్రాకో’ అంటే ఒక నక్షత్ర మండలం. దీనినే చైనీయులు డ్రాగన్ అంటారు. భారతీయులు నరకాసుర రాశి మండలం అన్నారు. నరకుడు ధరాపుత్రుడు. ధర అనే సంస్కృత పదం నుంచి ‘టెర్రా’ లాటిన్ పదం పుట్టింది. ‘మెడిటెర్రా’ అంటే మధ్యధరా అని అర్థం. సంస్కృతాన్ని, సంస్కృతిని భారతీయ దేవీ భావనలను ధ్వంసం చేస్తే ఇక్కడ ప్రజలు త్వరగా క్రైస్తవులుగా, ముస్లింలుగా, మార్క్సిస్టులుగా మారిపోతారు. అందుకని నరకాసుర, మహిషాసుర ఉత్సవాలు జరుపుతున్నారు. 2015 డిసెంబర్‌లో మాల్డాలో రెండున్నర లక్షలమంది మైనారిటీ ముస్లింలు నేషనల్ హైవే మీదికు వచ్చి అక్కడి దుర్గాదేవి ఆలయాన్ని ధ్వంసం చేసి వెళ్లారు. దీనిపై మమతా బెనర్జీ ఏవిధమైన చర్య తీసుకోలేదు. కారణం ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలంటే వాళ్ల ఓట్లు కావాలి. బహుజన సమాజ్ వాది పార్టీ నేత కాన్షీరామ్‌కు విదేశీ క్రైస్తవులనుండి భారీగా నిధులు అందుతుండేవి. ‘బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులను చంపండి’ అని నినాదం ఇచ్చాడు. వీరు కట్లపాములు, తాచుపాములు అన్నాడు. ఇలా విమర్శించడం రాజ్యాంగ విరుద్ధం. ఐనా ఎవరూ కాన్షీరామ్‌ను విమర్శించడానికి సాహసించలేదు. కారణం ఆ వ్యక్తుల మీద ‘దళిత విరోధి’ అనే ముద్ర వేస్తారని భయం.
ఆముక్తమాల్యదలో మాలదాసరి అనే ఒక సద్వైష్ణవుడి కథ ఉంది. అలాగే మనివాహనాళ్వార్ దళితుడు. ఇతనిని బ్రాహ్మణులు సన్నిద్ధరాళ్వారుల్లో ఒకరిగా గౌరవిస్తారు. కాని దళితుల ముసుగులో ఉన్న క్రైస్తవులు, మార్క్సిస్టులు బ్రాహ్మణుల మీద శ్రీమహావిష్ణువు మీద పార్లమెంట్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు. 26, ఫిబ్రవరి 2016న రాజ్యసభలో పేరు పెట్టి శ్రీమహావిష్ణువును ఏచూరి సీతారాం నిందించాడు.
ఏవి మూఢ విశ్వాసాలో, ఏవి గూఢ విశ్వాసాలో (మిస్టిసిజం) నిర్ణయించవలసింది శాస్తవ్రేత్తలు. అంతేకాని విదేశాలనుంచి నిధులకోసం భారతీయతను విమర్శించే దేశద్రోహలు కాదు. పుట్టపర్తి సాయిబాబాను బురుడీ బాబా అని విమర్శిస్తున్నారు. సత్యసాయిబాబా చేసిన సేవా కార్యక్రమాలు వీరికి కనబడలేదా? మొత్తం ఆయన విదేశాలనుండి సేకరించిన డబ్బుతోనే ప్రధానంగా చేశాడు. వెంకటేశు అనే పశుల కాపరి పద్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని క్రైస్తవులు ఒక కరపత్రం వేశారు. ఇది తిరుపతి వేంకటేశ్వర మహాత్మ్యం కథను అపహాస్యం చేస్తూ రాసింది. ఆకాశరాజు కుమార్తె పద్మావతి. ఆమె ఏడుకొండల వాణ్ణి వివాహమాడింది. అంటే అది యోగశాస్త్రం. మన వెనె్నముక మీద ఏడు ముడులున్నాయి. వాటినే చైతన్య చక్రాలు అంటారు. వీటిమీదనుండి ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. వీటికే ఏడుకొండలు అని పేరు. ఆకాశానికి పైన సహస్రదళ పద్మం ఉంది. ఆమెకే పద్మావతి అనే సంకేతం. గణేశుడు మూలాధార చక్ర అధిష్టాత. ఇది ఫృధ్వీతత్వం. పంచభూతాలకు ఈ శరీరానికి సన్నిహిత సంబంధం ఉంది. ఇలా పాంచభౌతిక ప్రకృతి రహస్యాలను యోగులు, కవులు సాంకేతిక భాషలో చెప్పారు. ‘స్వాతి ప్రవాళకమ్’ అని ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. ఇది ఎర్రని రంగు గల నక్షత్రం. ఇక్కడ వాయుతత్వం గోచరిస్తుంది. హనుమంతుడు రుద్రాంశలో జన్మించిన వాయుపుత్రుడు. ఎర్రని మూతి కలవాడు. సుపర్ణుడు కాలస్వరూపుడు. వైష్ణవంలో హనుమంతుడికి గరుడాళ్వారుకు గల ప్రాధాన్యం వేరుగా చెప్పనవసరం లేదు. ధృవుని కథ చూడండి. ఇది భూమి యొక్క మూడవ చలనానికి సంబంధించిన అంశం. అంటే భూమి 25,800 సంవత్సరాలకు తిరిగి యథాతథ స్థితికి చేరుకుంటుంది. అప్పుడు ధృవస్థానం మారుతుంది. ఈ రహస్యం వ్యాసమహర్షికి తెలుసు. పాశ్చాత్యులకు తెలియదు. ఆకాశంలో ‘‘మీరా’’ అనే నక్షత్రరాశి ఉంది. దీన్ని భారతీయులు కుంభకర్ణుడు అని పిలుస్తున్నారు. అంటే పురాణ కథలు నక్షత్ర సంకేతాలు-లేదా దేశ చరిత్రలు.
పూర్తి భావస్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ హిందువులకు ఉంది. ఇతరమతాల్లో లేదు. ఇతర మతాల్లో కొనసాగే అసహనం భావస్వేచ్ఛ ఎట్లా అవుతుంది. హైందవంలో నిరీశ్వర సాంఖ్యం అని ఒక తత్వం ఉంది. భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు సాంఖ్యం- అంటే దేవుడు లేడు అనేవారు కూడా మన్నింపబడ్డారు. ఇదొక ఆలోచనావిధంగా గౌరవించారు. ఇక దేవుడున్నాడనేవాడు ఒకే దేవుణ్ణికాదు మూడుకోట్ల మంది దేవతలను ఆరాధించుకోవచ్చునన్నారు. ఇదే హైందవం. కాబట్టి కొందరు దుర్మార్గులు రాజకీయ లబ్దికోసం ఇవ్వాళ చిత్రిస్తున్నట్టు మహిషాసుర, నరకాసుర, రావణ, కుంభకర్ణులు మూలవాసులు కాదు. ద్రవిడవాసులూ కాదు. రాముడు ఉత్తర దేశానికి చెందిన ఆర్యుడూ కాదు. ‘ర’ అంటే సూర్యుడు. సీత అంటే భూమి. దశకంఠుడు అంటే అరిషడ్వర్గాలు. మానవ సహజమైన దుర్గుణాలకు సంకేతం.

- ముదిగొండ శివప్రసాద్