సబ్ ఫీచర్

బట్టీ కార్మికులకు భద్రత కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకు భారమై పొట్ట చేత పట్టుకొని ఒడిషా నుండి తెలంగాణకు తరలి వస్తున్న కార్మికుల దైనందిన జీవితం దుర్భరంగా ఉంది. ఒడిషా కార్మికులపై ఇటుక బట్టీ యజమానుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయ. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇటుక బట్టీల్లో దాదాపు 11వేల మంది ఒడిషా వలస కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ వీరికి కనీస వసతులు లేవు. పలువురు పనిభారం ఎక్కువై అనారోగ్యం బారిన పడుతున్నారు. కూలీ చేయలేని పరిస్థితిలో ఉన్న వారిని కొట్టి మరీ పని చేయిస్తుండటం విషాదం. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం జిల్లాలోని పెద్దపల్లిలో కూలీ గర్భవతి నూర్జాజాహ్రాను బట్టీలోని గుమస్తా కొట్టిన దెబ్బలకు మరణించడంతో మరోసారి ఒడిషా కార్మికుల దుర్భర జీవితం తెరపైకి వచ్చింది. 2014లో చొప్పదండి పట్టణ శివారులోని ఇటుక బట్టీలో ముగ్గురు యువతులపై యజమాని లైంగిక దాడులకు పాల్పడ్డ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంఘటన మరవకముందే మరో దారుణం పెద్దపల్లిలో జరగటం ఒడిషా కార్మికుల జీవన పోరాటం ఎంతటి దుర్భరంగా ఉందో అర్థం అవుతుంది. ఒడిషా సర్దార్లు ఎక్కువ కమీషన్లకు కక్కుర్తిపడి కార్మికులను నమ్మించి బట్టీల యజమానులకు తక్కువ కూలీతో అప్పగిస్తున్నారు. తెలంగాణలో పనిచేసే వారికి రోజు కూలీ 2వందల రూపాయలకు పైగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన ఒడిషా కూలీలు మాత్రం శ్రమదోపిడీకి గురౌతున్నారు. రోజంతా పనిచేస్తే కనీసం 30 రూపాయలైనా ఇవ్వడం లేదు. యజమానులు ఇరుకు గదుల్లో కార్మికులను బంధించడం, వేతనం ఇవ్వకపోవడం, చిన్న పిల్లలతో పనులు చేయించడం, లైంగిక దాడులులాంటివి దారుణ అకృత్యాలు జరిగినా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మరోప్రక్క కూలీల పనికి అంతుపొంతన లేదు. కార్మిక చట్టం ప్రకారం రోజుకు 8 గంటల పనిచేయాలన్న నిబంధనలు ఇక్కడ అసలే ఉండవు.

- గుండు రమణయ్య