సంపాదకీయం

గోరక్షణ గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిశంసనకు గురి అయిన ‘నకిలీ గోరక్షకులు’ ఎవరన్నది స్పష్టం కాకపోవడం అనేక అనవసర వివాదాలను సృష్టిస్తోంది. ఈ తథాకథిత-సోకాల్డ్- నకిలీలు గోరక్షకులు కాదన్నది ప్రధానమంత్రి కనిపెట్టిన మహావిషయం. గోరక్షకులు కానివారు, గోరక్షణ పట్ల ఆసక్తిలేనివారు, గోరక్షణ అవసరం లేదని భావించేవారు, గోరక్షణ తప్పని ప్రచారం చేసే వారు దేశంలో కోట్లమంది ఉన్నారు. వీరెవ్వరూ చట్టం దృష్టిలో నేరస్థులు కారు. కానీ గోవధను పాక్షికంగాను, సర్వ సమగ్రంగాను నిషేధించే చట్టాలను అనేక రాష్ట్రాలు రూపొందించి ఉన్నాయి. అందువల్ల చట్టాల ప్రకారం ఆవులను రక్షించాలని భావించేవారు కూడ నేరస్థులు కారు. మరి నకిలీ గోరక్షకులు ఎవరు? నరేంద్రమోదీ చెప్పలేదు. చట్టాలున్నది అమలు జరగడానకి..అమలు జరుపవలసిన బాధ్యత పోలీసులది, న్యాయస్థానాలది, ప్రభుత్వ యంత్రాంగాలది. గోవధ పాక్షిక నిషేధపు చట్టాలుగాని, గోవధ సమగ్ర నిషేధపు చట్టాలు కాని అమలు జరిగి ఉండినట్టయితే 1947 నుంచి ఇప్పటివరకు కోట్లాది ఆవులు కోడెలు, దూడలు పెయ్యలు, లేగలు, ఎద్దులు హత్యకు గురయి ఉండేవికావు. అమలు జరగలేదన్నది నిరాకరింపజాలని నిజం. నేరాలను నిరోధించే కఠినమైన చట్టాలు ఉన్నందువల్ల నేరాలు ఆగిపోవు. ఆగిపోవడం కాదు, కానీ చట్టాలను ఉల్లంఘించిన నేరస్థులను ప్రభుత్వం నిర్బంధించి న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి. నేరం ఋజువు చేయాలి. నేరస్థులను శిక్షింపజేయాలి. గోవధ నిషేధపు చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం కావడం చరిత్ర. అందువల్లనే కోట్లాది ఆవులు అంతరించిపోయాయి. చట్టాలు అమలు జరగనప్పుడు అమలు జరగడంకోసం ఉద్యమాలు రావడం సహజం...ఉద్యమాలను చిత్తశుద్ధితో నిర్వహించే వారితోపాటు, ఉద్యమాలను అడ్డుపెట్టుకొని అక్రమ ప్రయోజనం పొందాలని యత్నించే నకిలీలు, కల్తీలు, వంచకులు పుట్టుకురావడం కూడ సహజం. బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమంలోనే నకిలీలు చెలామణి అయ్యారు. సమాజ సేవకులలో నకిలీలు కుప్పలు తెప్పలు, ధర్మాచార్యులలో సైతం నకిలీలు పుట్టుకురావడం పరాకాష్ఠ. కానీ నకిలీలు అపవాదం మాత్రమే, సహజం కాదు. నకిలీలు ఉన్నారని మొత్తం ధర్మాచార్యులను నిందించలేము, నకిలీలు ఉన్నారని మొత్తం గోరక్షకులను నిందింపజాలము..దిలీపుడు గోరక్షకుడు, ఛత్రపతి శివాజీ గోరక్షకుడు, మహాత్మాగాంధీ గోరక్షకుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గోరక్షకుడు..రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణం, ‘‘ఆవులను దూడలను ఇతర పాడి పశువులను వధించడాన్ని ప్రభుత్వం నిషేధించాల’’ని నిర్దేశిస్తోంది. ‘నకిలీ’లు గోరక్షకులు కానప్పుడు రక్షణ ఉద్యమంలో వారిని ముడిపెట్టడం ఎందుకు? అన్ని రంగాలలోని నకిలీలలను పసికట్టి ఏరివేయడం కఠినంగా శిక్షించడం ప్రభుత్వం బాధ్యత..
దళితులను సంఘ విద్రోహులు హత్య చేయడం పట్ల, దళితులపై దాడులు జరుపుతుండటం పట్ల నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేయడం ఈ జాతీయ సంస్కృతికి అనుగుణమైన పరిణామం. ఇతర జాతులను సైతం, విదేశీయ దురాక్రమణ దారులను సైతం హత్యచేయరాదన్నది అనాదిగా హిందూ జాతీయుల స్వభావం. దళితులు హిందువులు. అనాదిగా ఈ దేశంలో పుట్టి పెరిగిన ఈ భూమి బిడ్డలు. అందువల్ల ఈ మన మాతృభూమిపై దాడిచేసిన విదేశీయులను సైతం హత్య చేయరాదని భావించిన హిందుత్వం ఈ మాతృభూమి బిడ్డలైన ఈ జాతీయ కుటుంబంలోని వారైన దళితులను హత్య చేయడం సహించదు. దళితులపై దాడి చేస్తున్న నేరస్థులు హిందువులు కాజాలరు. వారు హిందుత్వంపై దాడి చేస్తున్న బీభత్సకారులు. ఇలాంటి బీభత్సకారులను పట్టి శిక్షించడం ప్రభుత్వాల పని. చట్టాలద్వారా దళితులకు రక్షణ కల్పించినంత మాత్రాన దళితులపై దాడులు ఆగడం లేదు. అంటరానితనం పేరుతో దళితులను దేవాలయాలకు దూరంగా ఉంచుతున్నవారు, దళితులను ద్వేషిస్తున్న వారు హిందువులు కాజాలరు. వారు నేరస్థులు. అసాంఘిక శక్తులు. ఈ అసాంఘిక శక్తుల నుంచి దళితులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది...
దళితులపై దాడి చేస్తున్న వారు గోరక్షకులు కాదు. కాదని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. కానీ నరేంద్ర మోదీ చెప్పి న తీరు మాత్రం నిజమైన గోరక్షకులకు మధ్య వైరుధ్యాన్ని కల్పించడానికి దోహదం చేస్తోంది. దళితులపై వివిధ కారణాలతో భౌతికంగా, భౌద్ధికంగా, ఆర్థికంగా దాడులు చేస్తున్న దుర్జనులు దేశమంతటా ఉన్నారు. దళితులు హిందువులు..హిందుత్వంలోని వివిధ మతాలకు చెందిన కులాలవారు. కానీ దళితులకు, అనుసూచిత కులాలవారికి, అనుసూచిత వనవాసీలకు లభిస్తున్న అరక్షణల-రిజర్వేషన్ల-ను ఇతర ప్రయోజనాలను కాజేసిన, కాజేస్తున్న నకిలీలు కూడ ఉన్నారు. ఈ నకిలీలు దళితులు కారు. అలాగే నకిలీలు గోరక్షకులు కూడ కాదు. నిజమైన దళితులకు, నిజమైన గోరక్షకులకు మధ్య వైరుధ్యం లేదు. అన్ని కులాల వారిలోను, అన్ని మతాలవారిలోను అత్యధికులు గోసంతతి వధను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గోసంతతి వ్యవసాయానికి ఆధారం. ఈ దేశంలోని అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయదారులు. వ్యవసాయదారులు భూమాతతో పాటు గోమాతను కూడ రక్షించుకుంటున్నారు. మొత్తం భారతదేశం మీద గోమాంస భక్షకులు జనాభాలో ఆరుశాతం కంటె తక్కువ ఉన్న ట్టు అధికార అనధికార నిర్ధారణలు జరిగాయి. అందువల్ల ప్రతి కులంలోను ప్రతియత్నంలో అత్యధికులు గోరక్షణ కోరుతున్నారు, గోభక్షణను వ్యతిరేకిస్తున్నారు. మరీ నియతంగా గోమాంసం తినేవారి సంఖ్య జనాభాలో కేవలం ఒకటిన్నర శాతమేనట. విదేశాలకు ఎగుమతి చేయడానికై గోమాంసాన్ని డబ్బాలలో భద్రపరుస్తున్న యాంత్రిక వధ్యశాలల వల్ల మాత్రమే గోసంతతి అంతరించిపోతోంది. అందువల్ల అన్ని కులాల వారితోపాటు దళితులలో సైతం అత్యధికులు గోవధ నిషేధాన్ని సమర్థిస్తున్నారు. దళితులపై దాడి చేస్తున్న వారు నకిలీ గోరక్షకులు కారు. నరేంద్ర మోదీ ఈ స్పష్టమైన వాస్తవాన్ని విచక్షణతో వివరించవలసి ఉండింది. వివరించలేదు, రాజకీయ ఆవేశంతో సమస్యను కలగాపులగం చేసి అనవసర గందరగోళాన్ని సృష్టించారు.
గోమాంస భక్షకులపై దాడులు చేస్తామనడం నేరం. చట్ట ప్రకారం గోరక్షణకు చర్యలు తీసుకోవడం మాత్రమే కర్తవ్యం. చెదురుమదురుగా జరుగుతున్న నేరాలవల్ల కర్తవ్యానికి గ్రహణం పట్టరాదు. ఈ దేశంలోని వైవిధ్యాల మధ్య చిచ్చుపెట్టడానికి శతాబ్దుల తరబడి విదేశీయ హస్తాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని వమ్ము చేయడానికి ఏకైక మార్గం చట్టాలను అమలు జరుపవలసినవారు అవినీతినుంచి ముక్తం కావడం. రాజ్యాంగంలోని 48వ అధికరణంలో నిర్దేశించినట్టుగా కేంద్ర ప్రభుత్వం 1950వ దశంకంలోనే గోవధ సమగ్ర నిషేధ శాసనాన్ని రూపొందించి ఉండాలి. మద్యపాన నిషేధం వల్ల మద్యపానం నేరం అవుతుంది. అలాగే సమగ్రమైన జాతీయ స్థాయి చట్టంవల్ల గోవధ సహజంగానే నేరం అవుతుంది. గోవధ ఆగిపోవడం వల్ల వ్యవసాయం బతుకుతుంది..దేశ ప్రజలు ఆకలినుంచి ముక్తులవుతారు.