సంపాదకీయం

‘మట్టి’ పరిమళించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుష్య భారత్‌ను స్వచ్ఛ భారత్‌గా పునర్ నిర్మించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పడుతున్న ఆరాటం మరోసారి ఆవిష్కృతమైంది. ఆదివారం తన మనసులోని మాటల-మన్‌కీ బాత్-ను దేశప్రజలకు వెల్లడించిన మోదీ పర్యావరణ పరిశుభ్రతను పరిరక్షించవలసిన బాధ్యతను మరోసారి గుర్తు చేశారు. అనాదిగా వాతావరణ పరిశుభ్రత పరిసరాల స్వచ్ఛత మన ధార్మిక సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవన పద్ధతులతో ముడివడి ఉన్నాయన్న మహా విషయం మోదీ మనసులోని మాటలలో మరోసారి ధ్వనించింది. ‘‘పంచభూత భాసితమైన ప్రకృతి’’ మానవుని మనుగడకు ప్రధాన భూమిక. అందువల్ల స్వచ్ఛమైన పరిసరాలు స్వచ్ఛమైన మానసిక వ్యవస్థకు దోహదం చేస్తున్నాయి. స్వచ్ఛత లోపించడం మానసిక శారీరక బౌద్ధిక ఆధ్యాత్మిక ప్రగతి నిరోధిస్తున్న అతితీవ్రమైన అవరోధం. బాహ్య పరిశుభ్రత అంతశుద్ధికి దోహదం చేయగలగడం భారతీయ జీవన విధానం. భారతీయుల ధార్మిక ఉత్సవాలన్నీ ఇలా స్వచ్ఛతను పదేపదే సంతరించి పెట్టడానికి దోహదం చేయాలన్నది తరతరాల ఆకాంక్ష. నీటి ద్వారా పరిశుభ్రత ఏర్పడుతోంది. నిప్పుద్వారా పరిశుభ్రత ఏర్పడుతోంది, భూమి, గాలి ఆకాశం కాలుష్యముక్తం అవుతున్నాయి. మనవ థార్మిక ఉత్సవాలు ఈ ప్రక్రియకు దోహదం చేశాయి. కానీ వర్తమానంలో జీవనవిధానం మొత్తం కాలుష్యంతో కల్తీ అయిపోయింది. నీరు కల్తీకావడం పరాకాష్ఠ-శుభ్రపరచవలసి శుభ్రపరుస్తున్న నీరు అపరిశుభ్రం అయిపోయింది. గంగానది దుర్గం ధ పంకిల ప్రవాహంగా మారిపోవడం భారత జాతీయ జీవనవాహినిలో పేరుకున్న కాలుష్యానికి ప్రతీక మాత్రమే. మన పండుగల సమయంలో శుభకార్యాల సమయంలో ఇళ్లను అలంకరిస్తున్న మామిడి వేప అరటి కొబ్బరి ఆకులు దుర్గంధ నిరోధకాలు. ప్లాస్టిక్ మామిడి ఆకుల తోరణాలు, ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సం చులు- సకలం ప్లాస్టిక్ మయం అయిపోవడం కాలుష్యాన్ని పెంచిన క్రమానుగత జీవన పతనం. చెట్లనుండి వచ్చిన నార, జనుపనార, పత్తి, నూలు సంచులు లేనేలేవు. ఈ ప్రాకృతిక పదార్థాలన్నీ ఏమయిపోయాయన్న ధ్యాస కూడ మనకు లేదు. ఈ మొత్తం కాలుష్య ప్రక్రియ విదేశీయులు మన నెత్తికెత్తిపోయినది. ప్లాస్టిక్‌ను క్రమంగా నిర్మూలించాలన్న లక్ష్యం దూరంగా ఎండమావులలోని నీటివలె ఊరిస్తూనే ఉంది. మన చెరువుల నదుల సముద్రాల నీరు మాత్రం మురికి పట్టిపోయింది. హిమాలయాల మంచు కరగడం వల్ల ఏర్పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సైతం ప్లాస్టిక్ కాలుష్యాలు చేరిపోవడం నడుస్తున్న చరిత్ర. గ్రామాలలోని వ్యవసాయ బావులు, మంచినీటి బావులు, పూడిపోయాయి. పూడిక తీసే అవసరం లేదు. ఎందుకంటె భూమాత శరీరాన్ని ఇనుపగొట్టాలతో వేల అడుగుల లోతు వరకు గాయపరుస్తున్న ‘బోరింగ్’ల యుగం ఇది. నరేంద్ర మోదీ మాటలలో ఆదివారం ధ్వనించిన స్వచ్ఛ ఆందోళనకు ఇదంతా నేపథ్యం..
భారత సంప్రదాయాలను, సంస్కృతిని ఇలా స్వచ్ఛతతో మళ్లీ అనుసంధానం చేయాలన్నది నరేంద్రమోదీ మనసులోని మాట. చెరువు మట్టితోను, బంకమట్టితోను చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునివ్వడం పరిసరాల ప్రక్షాళనలో భాగం. ‘స్వచ్ఛ్భారత’ విస్తరణకు దోహదకం! పంచ భూతాలలో ప్రధానమైనది భూమి. భూమికి వరసిద్ధి వినాయకుడు ప్రతీక, భూతత్త్వానికి గణపతి రూపం. అందువల్లనే వినాయక ఉత్సవాలు ప్రకృతితో మానవ జీవనాన్ని అనుసంధానం చేస్తున్నాయి. గరికె ఔషధీ రసగులిక...గరికెతో గణేశుడిని పూజించడంలోని పరమ లక్ష్యం ఆరోగ్యకరమైన జీవనం, అనేక జాతుల మొక్కలు వృక్షాలు ప్రకృతిలో పరిశుభ్రతా ధ్వజాలు. ఈ మొక్కల ఆకులతోను, వృక్షాల పత్రాలతోను భూమికి ప్రతిరూపమైన గణేశుని అర్చించడం సమాజాన్ని స్వచ్ఛతతో అనుసంధానం చేయడం, భౌతికమైన స్వచ్ఛత ప్రగతి, అంతర్గతమైన మానసిక స్వచ్ఛత ధార్మిక సుగతి. ప్రగతి సుగతి సనాతన భారత జాతీయ జీవన ప్రస్థాన రథ చక్రాలు! అందువల్లనే నరేంద్ర మోదీ మట్టితో భూమాత రూపంలో గణపతికి రూపాలను కల్పించాలని కోరడం స్వచ్ఛతా సాధనలో భాగం. మట్టి వినాయక విగ్రహాలను దుర్గామాత విగ్రహాలను రూపొందించాలన్న మోదీ పిలుపును ఉత్సవాలను జరిపే వారందరు పాటించాలి. ఇళ్లలోను బహిరంగ సార్వజనిక ఉత్సవ వేదికలలోను మట్టి విగ్రహాలను మాత్రమే నెలకొల్పి అర్చించాలి.. గణేశ పూజా ఉత్సవాలు సమీపిస్తున్నాయి, శక్తినీ దుర్గనూ పూజించే దసరా పండుగలు కూడ వస్తున్నాయి!
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను, ప్లాస్టిక్ పదార్ధాలను కలిపిన విగ్రహాలను పూజించి వాటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం పెరుగుతున్న సంగతిని మోదీ గుర్తు చేసారు! ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లోని పదార్ధాలు, ప్లాస్టిక్ సామగ్రి నీటిలోను ప్రకృతిలోను కలిసి జీర్ణమైపోవడంలేదు. అందువల్ల విగ్రహాలు నిమజ్జనమవుతున్న నీరు కలుషి తం అవుతోంది. నీరు కాలుష్యం కావడానికి ప్లాస్టర్ విగ్రహాలు ఒక శాతం కూడ కారణం కాకపోవచ్చు. మిగిలిన తొంబయి తొమ్మిది శాతం కాలుష్యం పారిశ్రామిక వ్యర్థాలవల్ల ఏర్పడుతోంది. జలాశయా ల సమీపంలో మల మూ త్ర విసర్జనాదులవల్ల కలుగుతోంది, ప్లాస్టిక్ పదార్ధాలు విస్తరించడం వల్ల కలుగుతోంది! రసాయనపు ఎరువులవల్ల ఏర్పడుతోంది, కృత్రిమమైన క్రిమిసంహారక రసాయనాలవల్ల విస్తరిస్తోంది! యథేచ్ఛగా పాడి పశువులను ఇతర జంతువులను వన్యప్రాణులను చంపేయడంవల్ల విజృంభిస్తోంది...అటవీ హరిత హననంవల్ల ఏర్పడుతోంది! ఇదంతా మన జాతీయ సంస్కృతికి దాపురించిన కాలుష్యం. పరిసరాలతోపాటు నీరు కూడ కలుషితమవుతోంది! అందువల్ల ప్రధానమైన వైపరీత్యం దుర్గంధం నిండిన, కాలుష్యంతో నల్లబారిన నీటిలో పవిత్రమైన విగ్రహాలను నిమజ్జనం చేయవలసిరావడం...మట్టితోనే అందరూ వినాయక విగ్రహాలను తయారుచేసుకొనడం స్వచ్ఛ భారత్ అవతరణకు ప్రారంభం మాత్రమే, ప్రతీక మాత్రమే. అసలు జరగవలసింది మిగిలిన తొంబయి తొమ్మిది శాతం కాలుష్యాన్ని ఎలా వదిలించుకోవాలన్న మథనం...
గత రెండు దశాబ్దులలో తెలుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు, పురపాలక నగరపాలక సంఘాలు, ధార్మిక క్షేత్ర దేవాలయ నిర్వాహకులు ప్లాస్టిక్ భూతాన్ని వదిలించుకొనడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. కానీ ప్లాస్టిక్ ను జనం వదిలిపెట్టడంలేదు. ఇదీ ప్రధాన వైపరీత్యం. బట్టసంచిని, జనపనార సంచిని కాగితం సంచిని ఉపయోగించాలన్న ధ్యాస పునరుద్ధరణకు నోచుకోవడంలేదు! హోలి ఉత్సవం సందర్భంగా పసుపు, గంధం, పచ్చకర్పూరం, పరిమళ పత్రాలు పువ్వులు కలిసిన నీటిని చల్లుకోవడం తరతరాల ఆచారం. కానీ గత అనేక ఏళ్లుగా పెట్రోలు, ఇతర రసాయనాలు, రంగులు కలిసిన హోలీ జలాలు మన జీవితాలను ముంచెత్తుతున్నా యి. కాలుష్యంనుండి, ఈ జీవన కాలుష్యం నుండి విముక్తం కావడం స్వచ్ఛమైన పరిమళ భరితమైన జీవన పద్ధతికి మార్గం. మన మనస్సులు మారితేనే మట్టి, ఈ దేశ జాతి మళ్లీ పరిమళిస్తాయి..మోదీ మాట ఇదే!