సబ్ ఫీచర్

ఆలయ నిబంధనలు పాటించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ రాష్ట్రంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశం 10 సంవత్సరాలలోపు బాలికలు, 50 సంవత్సరాల పైబడిన స్ర్తిలకు మినహాయించి మిగతా స్ర్తిలకు ఆలయ ప్రవేశం లేకపోవడంపై హిందూమతంలో స్ర్తిలపై వివక్ష చూపుతున్నారనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. సనాతన ధర్మంలో ‘సృష్టికర్త’ నిరాకారుడన్న విషయం వాస్తవం. అయినప్పటికీ ముప్పది మూడుకోట్ల దేవతలను ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక నిష్ఠ. హిందూ ధర్మం ఈనాడు పిలువబడుతున్న హిందూమతంలో ఈనాటికి కూడా నిరాకారుడైన ‘సృష్టికర్త’ అయిన మహాదేవుడిని లింగాకారంలోనే పూజిస్తున్నారు తప్ప ఇతర దేవుళ్ల మాదిరిగా విగ్రహ రూపంలో పూజించడం లేదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.
చదువులకు తల్లి సరస్వతీదేవి, సంపదలకు తల్లి లక్ష్మీదేవి, శక్తికి తల్లి పార్వతీదేవి, భూమాత, గోమాత, గంగామాత అని ఆరాధించే సంప్రదాయం హిందూమతంలో స్ర్తిలను గౌరవించడమే కాదు, పూజించడం స్ర్తి ఆధ్యాత్మికతకు నిదర్శనం అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసినదే. అయినప్పటికీ వాస్తవంలోనికి పోకుండా స్ర్తిని అడ్డం పెట్టుకుని హిందూధర్మాన్ని, సమాజాన్ని, సంస్కృతిని అంతమొందించాలని కంకణం కట్టుకుని దుష్ప్రచారం చేయడం విదేశీ భావజాలానికి బానిసలైన వారి నైజం. హిందూ స్ర్తిలకు ఉన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఇతర ఏ సంప్రదాయాలలో ఉన్నదో స్ర్తిల పక్షపాతులం అని చెప్పుకొంటూ హిందుత్వంలో స్ర్తిలకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన చెందేవారు హిందుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేవారు చెప్పగలరా?
యుక్త వయసులోని అమ్మాయిలను విదేశీయులైన అరబ్బులకు అమ్ముతున్న వైనం స్ర్తి పక్షపాతులు తమకు తెలియదన్నట్లు ఎందుకు నటిస్తారు? యుక్తవయసులో ఉన్న అమ్ముడుపోయిన అమ్మాయిలు వీరి దృష్టిలో స్ర్తిలు కారా? వీరి విషయంలో ఎందుకు నోరు మెదపడంలేదో కారణం చెప్పగలరా? తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని హిందుత్వవాదులు తమను నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులని తప్పించుకొంటారని చెప్పే స్ర్తి పక్షపాతులైన వీరికి హిందూ స్ర్తిలే వివక్షకు గురవుతున్నట్లు, ఇతర మతాల స్ర్తిలు సుఖః సంతోషాలతో ఉన్నట్లు కనిపిస్తున్నదా? ఈ విషయంలో వౌనంగా ఎం దుకుంటున్నారు? కొన్ని వర్గాలలోని స్ర్తిలకు ప్రార్థనాలయాలకు, స్మశాన వాటికలకు ప్రవేశము లేదు. ఆ వర్గాలలోని స్ర్తిల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే శబరిమలై అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశం గురించే ఇక్కడ మాట్లాడాలనడం హిందూ స్ర్తిలే స్ర్తిలుగాని ఇతర మతస్తులైన భారతీయ స్ర్తిలు వీరి దృష్టిలో స్ర్తిలు కారా? వీరు హిందూ స్ర్తిల గురించే మాట్లాడతారా? లేదా భారతదేశంలోని అన్ని మతాల స్ర్తిల గురించి వీరికి అవసరం లేదా? వీరు సమాజానికి సమాధానం చెప్పాలి. హిందువులకు ప్రామాణికమైన ఋగ్వేదంలోనే స్ర్తి స్వేచ్ఛను హరించిన విషయం ఉన్నదని చెప్పే స్ర్తి పక్షపాతులు ముప్పాళ్ల రంగ నాయకమ్మ వ్రాసిన రామాయణ విషవృక్షం లాంటివి వేదాలు హిందూధర్మాన్ని, సంస్కృతిని కూకటివేళ్ళతో పీకేయాలన్న విదేశీ భావజాలం కలవారికి మాత్రమే ప్రామాణికం తప్ప హిందూ ధర్మాన్ని ఆచరించేవారికి ప్రామాణికం కాజాలదన్న విషయాన్ని గుర్తించాలి.
హిందూ దేవాలయాలు వేల సంవత్సరాలుగా వివిధ పేర్లతో విశ్వవ్యాప్తంగా నిర్మితమయ్యాయ. అంతేకాదు ఒకే దేవుడు. ఒకే దేవత పేరుతో అనేక ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణం చేశారు. ఆయా దేవాలయాల నిర్మా ణం సమయంలో ఆయా ప్రాంతాల ప్రజల అభీష్టం మేర కు ఆయా దేవాలయాల ప్రవేశానికి, ధూపదీప నైవేద్యాలకు, ఆయా విగ్రహాల ఎత్తులకు కొన్ని నియమాలు, పద్ధతులు, ఆచారాలను ఏర్పాటుచేసుకొన్నారు. ఆయా దేవాలయాలకు వెళ్ళే భక్తులు అక్కడి నియమాలను పాటించడమే వారికి సరియైన ముక్తిగా భావిస్తారు. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో వేంకటేశ్వర దేవాలయాలు ఉన్నప్పటికి, స్థానికులు ఆయా దేవాలయాలలో పూజలు నిర్వహిస్తున్నప్పటికి ఆ ప్రజలే ఒక్కొక్కప్పుడు తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని, హుండీలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. దేవుడు ఒక్కటే అయినప్పటికీ తన గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నప్పటికీ అంత ప్రయాస పడి తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలను కోవడం వారిలోని విశ్వాసం. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. అక్కడి ఆచార నియమాలకు బద్ధులుగా దేవుడిని దర్శించుకుంటారు. అంటే వారికి స్థానిక వేంకటేశ్వర దేవాలయాలు లేవనా? మన దేశంలో పద్మనాభస్వామి దేవాలయాలు అనేక ప్రాంతాలలో ఉన్నప్పటికి కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దర్శనానికి వెళ్ళేవారు తప్పనిసరి శరీరం బొడ్డుపై భాగంలో గుడ్డలు లేకుండా దోవతి ధరించి వెళ్లటం అక్కడి ఆచారం. ఈ ఆచారం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది అనే విషయం గుర్తించాలి. మిగతా దేవాలయాలలో ఈ ఆచారం లేదు అనే విషయం కూడా గుర్తించాలి. విష్ణు ఆలయాలలో గర్భగుడిలోని విగ్రహాన్ని అక్కడ పూజాధిక్యాలు నిర్వహించేవారు తప్ప ఎంత గొప్ప వాళ్ళైనా వారికి విగ్రహ స్పర్శ చేసే వీలు కల్పించరు. కాని కర్నూలు జిల్లాలో యాగంటిలోని వేంకటేశ్వర స్వామి పాదస్పర్శ ప్రతి ఒక్క భక్తుడు చేసుకోవడం అక్కడి ఆచారం. ఇదే ఆచారం మిగతా అన్ని దేవాలయాలలో కొనసాగించాలనడం భావ్యమా?
ప్రతి ఒక్కరు దేవాలయాల ప్రవేశం చేయడం ప్రధానాంశమే. దీనిని కాదనే వారు మానవత్వాన్ని కోల్పోయినవారే. కాని ఆయా దేవాలయాల నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అక్కడి నియమ నిబంధనలను ప్రశ్నించేవారు దేవుడి ఆరాధకులు కాజాలరు.

-బలుసా జగతయ్య