సంపాదకీయం

వన్య హననం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోధక చర్యలను ముమ్మరం చేయకపోయినట్టయితే అనేక జాతుల వన్యప్రాణులు మరో నాలుగేళ్లలో అంతరించి పోవడం ఖాయమని అంతర్జాతీయ అధ్యయనాలు నిర్థారించడం పర్యావరణం పట్ల అనురక్తి కల వారిని ఆందోళన కలిగిస్తున్న వ్యవహారం. ‘ప్రపంచ వన్యప్రాణి పరిరక్షక నిధి’- వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్- డబ్ల్యుడబ్ల్యుఎఫ్- లండన్ వన్యప్రాణి సంరక్షక సంఘం- జులాజికల్ సౌసైటీ ఆఫ్ లండన్- జెడ్‌ఎస్‌ఎల్- సంస్థలు జరిపిన అధ్యయనం వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. 1970 సంవత్సరం ప్రాతిపదికగా ఈ అధ్యయనం జరిగింది. 1970లో అవనీతలంలో నివసించిన వన్యప్రాణులలో 2012 నాటికి 58 శాతం అంతరించిపోయాయి. ప్రతి ఏటా పూర్వ సంవత్సరం ప్రాతిపదికగా రెండు శాతం వన్యప్రాణులు- జంతువులు, పక్షులు, కప్పలు, తాబేళ్లు వంటి ఉభయచరాలు, చేపలు వంటి జలచరాలు నష్టమైపోతున్నాయన్నది అధ్యయనంలో నిగ్గుతేలిన నిజం. ఈ ప్రాతిపదికగా 1970 నాటి వన్యప్రాణుల సంఖ్య పరిమాణంలో మూడింట ఒకవంతు మాత్రమే 2020 నాటికి మిగిలి ఉంటాయట! ఇదే ఏభై ఏళ్లలో మన దేశంలోని ఏభై శాతం వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. ప్ర పంచం మొత్తం మీద 2020 నాటికి - ఒక్క శాతం జలచరాలు- 1970తో పోల్చినపుడు- అంతరించి పోవడం ఖాయమని ఈ అధ్యయనం హెచ్చరించింది. భూమి ఉపరితల కాలుష్యం కంటే జలకాలుష్యం అతి తీవ్రంగా ఉండడం జలచరాలు అంతరించిపోయే ప్రమాదాన్ని తీవ్రతరం చేస్తోంది. మానవుడు ‘అమానవీయ’ రీతిలో ప్రకృతిని నియంత్రిస్తుండడం, నిర్దేశిస్తుండడం, అనుభవిస్తుండడం, నిర్మూలిస్తుండడం వన్యజీవ హననానికి ఏకైక కారణం! అడవులను నరికివేయడం, కొత్తగా అడవులను పెంచకపోవడం ఈ దుస్థితికి ప్రధాన హేతువు. సహజమైన ప్రగతికి ప్రతీక అయిన మాధ్యమమైన వ్యవసాయాన్ని కృత్రిమ ప్రగతికి ప్రతిరూపమైన ‘ప్రపంచీకరణ’ దిగమింగుతుండడం రెండవ కారణం! ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక కేంద్రీకరణ పెరుగుతోంది. ఈ కేంద్రీకరణ కాలుష్యాన్ని కూడా కేంద్రీకరిస్తోంది. ఈ కాలుష్యం ప్రభావానికి బలై ఊపిరి పీల్చుకొనలేకపోతున్న పశువులు, జంతువులు, పక్షులు, జలచరాలు పారిపోతున్నాయి. ఎక్కడికి పారిపోవాలి? దేశమంతటా హరిత నిర్మూలన జరిగింది, ప్రపంచమంతటా అటవీ విధ్వంసం జరిగిపోయింది. హరితవనాలు, పరిమళ పవన వాటికలు కాలుష్య కేంద్రాలుగా మారాయి, మారిపోతున్నాయి. చెట్లు నిలిచిన చోట సిమెంటు కట్టడాలు వెలశాయి. ఫలితంగా తాపం పెరిగింది. ఉష్ణోగ్రత పెరిగింది, సముద్ర జలాలు పొంగి తీరాలను ముంచెత్తుతున్నాయి. పర్వతాలలోని హిమశకలాలు, సముద్రాలలో ‘మంచుద్వీపాలు’ వేడిమికి కరిగిపోయి మునిగిపోతున్నాయి! అందువల్ల పారిపోయే పిచ్చుక దారిలోనే పరిమారిపోతోంది. ఉరకలెత్తే ఉడుత ఊపిరి కోల్పోతోంది! దశాబ్దుల క్రితమే నగరాలలో పిచ్చుకలు అంతరించిపోయాయి! ప్రస్తుతం పల్లెసీమల్లో సైతం పిచ్చుకలకు నిలువనీడ లభించని దుస్థితి ఏర్పడిపోయింది!
ఇదంతా మానవుని మితిమీరిన భోంచేసే ప్రవృత్తి ఫలితం! అడవి చరిత్ర, జీవజాలాల చరిత్ర, వృక్షజాలం జీవన వ్యవస్థ అడవి. జంతుజాలానికి జీవన ప్రస్థాన వాటిక అడవి. వేటగాడు, వృక్ష హననకారుడు కేవలం అపవాదాలు. వెయ్యి చెట్లలో ఒక చెట్టును కొట్టడం, వెయ్యి జంతువులలో ఒకదానిని వధించడం మాత్రమే ఈ ‘అపవాద’- ఎక్సెప్షన్- స్వరూపం, స్వభావం! ప్రధానంగా మన దేశంలో అనాదిగా ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగింది. వన్యమృగాలు, వృక్షాలు, తీగెలు, పొదలు, వీటితో సహజీవనం చేసిన రుషులు, వనవాసీ జనసముదాయాలు అడవి చరిత్రలో భాగం! విదేశీయ దురాక్రమణదారులు, మరీ ప్రధానంగా బ్రిటన్ రాజకీయ బీభత్సకారులు ఈ చరిత్రను చెరిచారు. వేటగాడు, అక్రమార్జన లక్ష్యమైన వ్యాపారి అడవి చరిత్రను రాయడం ఆరంభమైంది. తుపాకులను ధరించిన అటవీ వ్యతిరేకులు జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అపురూపమైన జంతువుల మాంసం, అపురూపమైన పక్షుల మాంసం తినడం మరిగిన మానవులు దానవులైపోయారు. పులిని చంపి చర్మం నిండా గడ్డిని కూరారు. కృత్రిమ నిర్జీవ శార్దూలాలను ప్రదర్శించారు, విక్రయించారు, విదేశాలకు ఎగుమతి చేశారు! పులికే రక్షణ లేనప్పుడు జింకలకు, కుందేళ్లకు రక్షణ ఎలా లభిస్తుంది? మానవ మృగాల తీరని ఆకలికి వన్యమృగాలు ఆహుతయ్యాయి. ఇది ప్రత్యక్ష హననం. ఒక చెట్టు నశించిన చోట నుంచి పదిరకాల వందరకాల వన్యమృగాలు పలాయనం చిత్తగించాయి. ఇది పరోక్ష హననం. బ్రిటన్ ముక్త భారతదేశం బ్రిటన్ సర్వభక్ష్య వారసత్వం నుండి విముక్తి చెందకపోవడం నడుస్తున్న కథ.. వన్యప్రాణులను నిర్దయగా నిరంతరం చంపి భోంచేస్తున్న కథ ఇది!
అందుకే వెయ్యి చెట్లలో 900 చెట్లను నరికివేసే ప్రవృత్తి మానవులను ఆవహించింది. వెయ్యి జంతువులున్న అడవిలో మొత్తం జంతువులు హతమారిపోయే వరకూ తుపాకులు విశ్రమించని రక్తదాహ చిత్తవృత్తి రాజ్యం చేస్తోంది! ఆఫ్రికా అడవుల్లోకి వినోద విహారాలకు వెళ్లిన ధనమదాంధులైన అమెరికన్లు, ఐరోపా వారు అక్కడి నెమళ్లను చంపి వండి తినేశారు. ఫలితంగా ఆఫ్రికా అడవుల్లో పాముల సంఖ్య పెరిగింది. ఈ పాములను చైనా వారు పట్టుకుపోయారు.. కప్పలు అంతరించిపోవడంతో పంటలను నాశనం చేసే చిత్రవిచిత్ర క్రిములు, కీటకాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రిములను, పురుగులను, ఈగలను చంపడానికి టన్నులకొద్దీ విష రసాయనాలను వాడేస్తున్నారు. ఈ విషపు వాసనలు భరించలేని వానపాములు- ఎర్రలు- 30 అడుగుల లోపలికి వెళ్లి భూగర్భంలో దాక్కుంటున్నాయట! అందువల్ల వ్యవసాయ భూమిని సహజంగా నిరంతరం పరిపుష్టం చేసే వానపాములు లేక, భూమి నిర్జీవంగా మారిపోతోంది! మానవుని భస్మాసుర క్రీడ అతడికే ఇలా నష్టం కలిగిస్తోంది. అయినప్పటికీ వృక్ష విధ్వంసం ద్వారా పరోక్షంగాను, చంపడం ద్వారా ప్రత్యక్షంగాను వన్యప్రాణుల నిర్మూలన కొనసాగుతూనే ఉంది. ఆఫ్రికా ఖండంలో పదేళ్లలో లక్షా పదకొండువేల ఏనుగులను చంపేశారు, దంతాలను విదేశాలకు తరలించారు. 25 ఏళ్లుగా ఆఫ్రికాలో ఏటా సగటున పదివేల ఏనుగులు అంతరించిపోయాయి! ఈ హస్తిహననం ముఠాలను అధిక శాతం చైనా నిర్వహిస్తోంది! మనదేశంలోని పులులలో అధికశాతం చైనా బారిన పడడం మరో విషాదం.. పులి గోళ్లు, చర్మాలు చైనా వారి సంప్రదాయ ఔషధాల తయారీకి ముడివస్తువులు..
కృష్ణసార మృగం- బ్లాక్‌బక్- ప్రధానంగా మన దేశపు వన్యప్రాణి. బ్రిటన్ దురాక్రమణ కాలంలో వేలాది కృష్ణమృగాలు- నల్లని చారలుండే కొమ్ముల జింకలు హతమయ్యాయి! బ్రిటన్ ముక్త భారతంలో ఈ జింకల రక్షణకు ‘హరిత వాటిక’లు ఏర్పడ్డాయి. కానీ, ఈ ‘రిజర్వు ఫారెస్ట్’లలోని మానవమృగాలు చొరబడి ‘కృష్ణమృగాల’ను భోంచేస్తున్నాయి. సినిమా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు నెమళ్లను, నల్లజింకలను వేటాడుతున్నారు! వేలాది తాబేళ్లు, వందల తిమింగలాల కళేబరాలు తరచూ ఒడ్డుకు కొట్టుకొని వస్తున్నాయి. అన్ని దేశాల సముద్ర తీరాలలో ఇవే దృశ్యాలు.. ఇది జల కాలుష్యం! కృష్ణజింకలను చం పడం ఘరానాల హృదయ కాలుష్యం..