సబ్ ఫీచర్

గాడి తప్పిన విద్యా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులకు చక్కని విద్యాబోధన చేసేవారికి, చేయించే వారికి రక్షణ లేదా? సమయపాలన పాటించని టీచర్లకు ఆబ్సెంట్ వేస్తే, దారితప్పిన టీచర్లను దారిలోకి తెస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పీజీ హెడ్మాస్టర్లకు, మండల విద్యాధికారులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు వేధింపులు, సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు తప్పటం లేదు. ఉపాధ్యాయ సంఘ నాయకులు డ్యూటీ ఎగ్గొట్టి, అంకితభావంతో పనిచేస్తూ, చక్కని విద్యాబోధన చేస్తున్న, చేయిస్తున్న వారి మీద కక్ష్యకట్టి తీవ్రంగా వేధిస్తున్నారు. వృత్తికే అంకితమై రియల్ ఎస్టేట్, సైడ్ వ్యాపారాలు చేయకుండా బోధన చేసే వారిని ప్రోత్సహించవలసింది పోయి వేధింపులు పెరుగుతున్నాయి. పాఠాలు చెప్పటమంటే కొందరికి మహా చిరాకు. బడి/కాలేజీలకు వచ్చి, క్లాసుకు వెళ్లి పాఠం చెప్పకుండా ‘బైట’పడేవారెందరో? కనీసం పరీక్ష పేపర్లు దిద్దని వారెందరినో కరీంనగర్ జిల్లాలో వేటు వేశారు. పాఠ్య ప్రణాళిక రాయాలని, క్రమం తప్పకుండా క్లాసు చెప్పాలనే హెడ్ మాస్టర్ అంటే టీచర్లకు గిట్టదు. సిలబస్ పూర్తిచేయని టీచర్లపై కఠినంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలే ఉన్నాయి.
మంచి పనిచేసే వారిని కాపాడేవారు తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఇలాగైతే సర్కారు బడులు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాయా! బంగారు తెలంగాణ సాధిస్తాయా! బడి ఎగ్గొట్టే టీచర్ల, సంఘ నేతలు కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగాలు వెలగబెడుతుండగా నిజాయితీ పరులకు మాత్రం మారు మూల గ్రామాల్లో పోస్టింగ్‌లు. వీరికి సైడ్ బిజినెస్ లేదు. పాఠాలు చెప్పటం తప్ప ప్రైవేట్ ఆదాయం లేదు. మంచి చేస్తే చెడు ఎదురైందట. ఇలాగైతే, పిజిహెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోవాలా! సింప్లీ సిట్టింగ్, మంత్లీ గెటింగ్ ఒకే చేయాలా. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు? యూనియన్‌లు పెట్టి చదువును మంటకలుపుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొన్ని నెలల క్రితం తన ఆవేశాన్ని వెళ్ళగ్రక్కారు. ఒక్క టీచర్ యూనియన్ చాలదా! అన్నారు. సంఘాలను కట్టడి చేస్తామని ప్రకటన ఇచ్చారు. ఒక్క తెలంగాణలోనే 40 ఉపాధ్యాయ సంఘాలు అవసరమా! వారికి క్యాజువల్ లీవులు, అదర్ డ్యూటీ (ఓడి)లు అవసరమా! వందల సంఖ్యలో ఉన్న వీరిని పాలకులు నియంత్రించలేరా? హైటెక్ యుగంలో జీవోలు క్షణాల్లోనే వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. బడులు ఎగ్గొట్టి సంఘ నేతలమం టూ తిరగటం అవసరమా? ప్రభుత్వాలు సంఘ నేతల మీద ‘మెతకదనం’ ఎందుకో? తెలంగాణ, ఆంధ్రలలో టీచర్ సంఘ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక టీచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, 15 రోజులకు ఓసారి వచ్చి సంతకాలు చేసుకుంటున్న విషయం బయట పడింది. ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితి. తమ బండారాన్ని టీచర్ యూనియన్లు ఎక్కడ బయట పెడతాయోనని, అవినీతి విద్యాశాఖ అధికారులు, సరైన చర్యలు తీసుకోవటానికి జంకుతున్నారు. తప్పుచేసిన వారికి శిక్ష వేయటం లేదు. బడికి రాని వారికి నెలనెల ఠంచన్‌గా జీతం ఇస్తున్నారు.
కొన్ని నెలల క్రితం కరీంనగర్ జిల్లాలో అప్పటి డి.ఇ.ఓ. అవినీతిని ఒకరు బయటపెట్టారు. కాని ఆ అధికారి 20 టీచర్ యూనియన్లను మచ్చిక చేసుకున్నాడు. 20 లెటర్ ప్యాడ్ తీసుకొని, తనకు అనుకూలంగా టైప్ చేయించుకున్నాడు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ అధికారులు ఈ వ్యవహారం, 20 సంఘాల లేఖలు చూసి, ముక్కున వేలు పెట్టుకున్నారు. అవినీతి అడ్డగోలుగా సాగుతున్నా అడ్డుకట్టవేసేవారు లేరు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో ఒక బడి ఉంది. ఇక్కడి టీచర్ సిరిసిల్లలో, కరీనగర్, సిద్దిపేట నుంచి రాకపోకలు సాగిస్తాడు. ఈ హైస్కూలు హెడ్‌మాస్టర్ ఇక్కడే ఊరిలో కిరాయికి ఉంటోంది. బడి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. కాని మేడమ్ 15 నిమిషాల ముందే బడికివస్తారు. బడికి సకాలంలో రాని టీచర్లకు సిఎల్ వేసేవారు. దానితో టీచర్ సంఘాలు గొడవ చేశాయ. హెడ్‌మాస్టర్‌పై తప్పుడు పిటిషన్లు పెట్టారు. డిఇఓ వెంటనే యూనియన్ల ఒత్తిడికి తలఒగ్గారు. ఇంకేం! బడికి అధికారులు వచ్చి హెచ్.ఎం. మీద విచారణ చేశారు. కాని ముస్తాబాద్ ప్రజలు ఐకమత్యంగా తమకు హెచ్‌ఎం కావాలంటూ నినాదాలు చేసి విచారణ అధికారులను త్రిప్పి పంపారు. ఎన్.టి.ఆర్, చంద్రబాబు ప్రభుత్వాలను కూలగొట్టామని, ఇప్పటి ప్రభుత్వం మాకో లెక్క అని సంఘ నేతలు ధీమాగా ఉన్నారు. గాడితప్పిన విద్యావ్యవస్థను చికిత్సచేయాల్సిన బాధ్యత కె.సి.ఆర్, చంద్రబాబునాయుడు, మేధావులు విద్యావేత్తలపై వుంది.

- రావుల రాజేశం