సంపాదకీయం

బలిగొన్న ‘పట్టా’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికటించిన విధికి ఇది మరో విషాద సాక్ష్యం.. ఇది ప్రాకృతిక బీభత్సం కాదు, మానవ మహాపరాధం కాదు! అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బిహార్ రాజధాని పాట్నాకు వెళుతున్న రైలు ప్రయాణీకులలో 143 మంది అకాల మృత్యువునకు ఆహుతి అయిపోయారు. కాళమృత్యు కరాళ దంష్టల్రు కరకరమని నమిలిన చప్పుళ్లు దేశవ్యాప్తంగా జన హృదయ సీమలలో ప్రకంపనాలను సృష్టిస్తున్నాయి, గుండెలను పిండి చేస్తున్నాయి. తలలు తెగబడి ధరణి దిగబడినవారి బతుకులు ఇలా అకాల గర్భంలో కలసిపోవడం భయంకర స్మృతిగా మారి అనేక రోజులపాటు కదులుతూనే ఉంటుంది! రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఈ భయంకర విషాదం కేవలం స్మృతిగా మిగలదు, దుర్భర వ్యథాభరిత జీవన వాస్తవంగా వ్యవస్థీకృతవౌతోంది. సతులను కోల్పోయిన పతులు, పతులను కోల్పోయిన సతులు, తనయులను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన పి ల్లలు... ఇది కేవలం ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ దేహ త్ జిల్లాలోని ఫుక్రయోన, మాలసా మధ్య రైలు పట్టాల నుంచి పడిపోయిన దుర్ఘటనా స్థలికి సం బంధించిన విల యం కాదు, వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మృత ప్రయాణీకుల కుటుంబాలను అనేక ఏళ్లపాటు కుంగదీయనున్న భయంకరమైన జీవన వాస్తవం. రాష్టప్రతి విలపించాడు, ప్రధానమంత్రి శోకగ్రస్తుడయ్యాడు. రైల్వేమంత్రి విచారణ జరిపిస్తున్నాడు! మృతుల కుటుంబాలకు, వందలాది క్షతగాత్రులకు ప్రభుత్వం డబ్బు రూపంలో పరిహారం చెల్లిస్తోంది, దేశవ్యాప్తంగా సహానుభూతి పెల్లుబుకుతోంది. దుర్ఘటనా స్థలికి సమీప గ్రామాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా సహాయ కార్యక్రమాలను సాగిస్తున్నాయి. కానీ, నిద్ర దీర్ఘనిద్రగా మారిన అభాగ్యుల పార్ధివ శరీరాలకు ప్రాణం పోయడం అసాధ్యం! విధి విధానం ఇలా ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. కేవలం తొమ్మిది నిముషాలకు ముందు సబర్మతి ఎక్స్‌ప్రెస్ అదే పట్టాలపై దుర్ఘటనా స్థలిని సురక్షితంగా దాటి వెళ్లింది! సబర్మతి ఎక్స్‌ప్రెస్ చోదక సిబ్బందికి ఎలాంటి అవరోధం కలగలేదు. అనుమానం రాలేదు. తొమ్మిది నిముషాలకు ముందు సురక్షితంగా ఉండిన ఆ ఇనుపదారి తొమ్మిది నిముషాల తరువాత మృత్యుగహ్వరంగా ఎలా మారింది? రైలు వేగానికి, బరువుకు భరించలేని పట్టాలు ఎందుకని పగిలిపోయాయి? పట్టాలు భరించలేనందువల్లనే రైలు దూరంగా విసురుకుని పోయిందన్నది జరుగుతున్న ప్రచారం. కానీ పట్టాలు ఎలాంటి వైపరీత్యానికి, విద్రోహ చర్యకు కాని గురి కాలేదన్నది ప్రాథమిక సమాచారం! అందువల్ల సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు సురక్షితంగా పయనించిన చోట కేవలం తొమ్మిది నిముషాలలోనే ఇండోర్-పాట్నా రైలు పడిపోవడం విధి ఆడిన విషాద నాటకం మాత్రమేనని భావించడం శోకతప్త హృదయాల తక్షణ ప్రతిస్పందన..
ఈ విషాదం క్షతగాత్రులను, ప్రమాదం నుంచి బయటపడిన వారిని మరింతగా అలముకొని ఉంది, అనేక మంది బాలబాలికలు సురక్షితంగా బయటపడినారు. కానీ వారంతా భయంకరమైన విభ్రాంతికి గురి అయి ఉన్నారు! తమ ఆందోళనను, ఆవేదనను వ్యక్తం చేయడానికి సైతం అశక్తులై ఉన్నారు. జరిగినదేమిటన్నది, జరుగుతున్న దేమిటన్నది అర్థం కాని ఈ పిల్లలు నోటమాట రాక నిశ్చలంగా పడి ఉన్న దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. తమ తల్లిదండ్రుల పేర్లు కాని, తమ వెంట వచ్చిన కుటుంబ సభ్యుల పేర్లు కాని సరిగా చెప్పలేకపోతున్న ఈ బుడతల భవిష్యత్తు ఏమిటన్నది సమాధానం దొరకని సమస్య! ఊహ తెలిసిన బాలికలు బాలురు యువతీ యువకులు కనబడని తమవారి కోసం వెదకడానికి సైతం భయపడుతున్నారట, హడలిపోతున్నారట! కనపడని తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలన్నది వారి ఆకాంక్ష, ఉన్నారన్నది వారి విశ్వాసం! అందువల్ల వెదికితే ఏమి దుర్వార్తలు బయటపడతాయో ఏమోనన్న భయం వారిని ఆవహించి ఉంది! కానీ ఇదంతా కొన్ని గంటల వరకు మాత్రమే కొనసాగిన సందిగ్ధ స్థితి.. ఈ స్థితి నుండి బయటపడిన ఈ పిల్లలకు వాస్తవాలు తెలిశాయి, తెలుస్తున్నాయి. కొందరి బంధువులు, తల్లిదండ్రులు సురక్షితంగా ఉన్నారు, మరి కొందరు కర్ణ కఠోరమైన ఘోరమైన వార్తలు వినవలసి వచ్చింది! విషాద దృశ్యాలను తిలకించవలసి వస్తోంది! రైళ్ల చరిత్రలో అనేక ప్రమాదాలు జరిగిపోయాయి, కానీ ప్రతి ప్రమాద స్థలిలోను ఈ దుర్భర విషాదం పునరావృత్తికి గురి అవుతునే ఉంది! వేగం పెరుగుతోంది.. భద్రత తరుగుతోంది! ప్రయాణీకుల సంఖ్య పెరిగింది, ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది!
మన భద్రతకు అంతర్గతంగాను, సరిహద్దుల వెలుపల నుండి కూడా ప్ర మాదం కొనసాగుతుండడం అప్రమత్తతను మరింత అనివార్యం చేస్తున్న కఠోర సత్యం! మన భద్రతను భగ్నం చేయడానికి ని రంతరం మాటు వే సిన వివిధ విరూపాల ఉగ్రవాదులు, సాయుధ తీ వ్రవాదులు విదేశీ ప్రేరితులు.. ప్రచ్ఛన్న యుద్ధం ద్వారా మనదేశాన్ని బద్దలు కొట్టడానికి కుట్రలు చేస్తున్న విద్రోహులు బీభత్సకారులు! ఈ విదేశాల వ్యూహాలు, విదేశాలకు తొత్తులుగా మనదేశంలో ఉన్నవారి కార్యక్రమాలు అనూహ్యంగా ఉంటున్నాయన్నది ధ్రువపడిన వాస్తవం! తోడేళ్లు ఊహించని రీతిలో ఊహించని చోట దూకుతాయట, ఉగ్రవాదులు కూడా అంతే! అందువల్ల ఇం డోర్-పాట్నా రైలు ప్రమాదానికి ఉగ్రవాదుల నిగూఢ వ్యూహం ఏదైనా దోహదం చేసిందా? అన్న అనుమానం అంకురించడం అసహజం కాదు. ప్రమాదం తొలివార్తలు వెలువడిన వెంటనే ఇలాంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత సమసిపోయాయి. సందేహాలు సమసిపోయినంత మాత్రాన దర్యాప్తు బృందాలవారు ఈ సందేహాలను విస్మరించడానికి వీలు లేదు! తొమ్మిది నిముషాల ముందు ఆ ఇనుప దారిగుండా సబర్మతి రైలు సురక్షితంగా వెళ్లింది కాబట్టి ఆ కొద్ది సమయంలో పట్టాలను తనిఖీ చేసే సిబ్బంది దుర్ఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలించి ఉండరు, పరిశీలించే అవకాశం లేదు. దుర్ఘటన స్థలాన్ని సబర్మతి వెళ్లిన తరువాత పాట్నా రైలు వచ్చేలోగా పరిశీలించినట్టు రైల్వే అధికారులు చెప్పడం లేదు! అందువల్ల ఈ తొమ్మిది నిముషాల సమయంలో విద్రోహులు రంగప్రవేశం చేశారా? అన్న సందేహం ప్రాతిపదికగా దర్యాప్తు జరపడం తప్పుకాదు.. గతంలో వరంగల్లు సమీపంలో జరిగిన రైలు ప్రమాదం ఒక ఉదాహరణ మాత్రమే! ఈ ప్రమాదానికి తీవ్రవాదుల విద్రోహ చర్య కారణమని చాలా ఆలస్యంగా బయటపడింది!
ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో రూబీ గుప్త అనే ఇరవై ఏళ్ల యువతికి కుడి చేయి విరిగిందట! ఆమెకు డిసెంబర్ ఒకటవ తేదీన పెళ్లి జరుగవలసి ఉంది! కానీ ఇంతకంటే విషాదం- ప్రమాదం తరువాత ఆమె తండ్రి కనిపించకపోవడం.. ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు, తండ్రితోపాటు ఆమె ఇండోర్ నుంచి బిహార్‌లోని తమ పల్లెటూరికి బయలుదేరింది! రాత్రి పడుకునే వరకూ వారందరు పెళ్లి గురించి ఆనందంగా చర్చించుకున్నారు.. అంతలోనే విషాదం..