సంపాదకీయం

మాదక బీభత్సం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో శుక్రవారం మరో ఇద్దరు నైజీరియా దేశస్థులు పట్టుబడడం విస్తరించిపోతున్న ‘మాదక’ బీభత్స చర్యలకు సరికొత్త నిదర్శనం. అంతర్జాతీయ విమానాశ్రయాలు పెరుగుతున్న కొద్దీ అంతర్జాతీయ మాదక విక్రేతల సంఖ్య పెరుగుతుండడం సమాంతర పరిణామం! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ‘మాదకం మనుషులు’ తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో నైజీరియా పౌరులు పెద్దసంఖ్యలో ఎందుకు తిష్ఠవేసి ఉన్నారన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న. మాదక పదార్థాల దొంగ రవాణా చేస్తున్న విదేశీయులలో అత్యధికులు నైజీరియాకు చెందినవారు కావడం ఈ ప్రశ్నకు ప్రాతిపదిక! నైజీరియా ‘ముఠాల’వారు హైదరాబాద్‌లో మాత్రమే పట్టుబడడం లేదు. దేశమంతటా పట్టుబడుతున్నారు. గోవాలో వీరి అక్రమ కలాపాలు ఏళ్ల తరబడి సాగిపోతుండడం ధ్రువపడిన వాస్తవం. శుక్రవారం హైదరాబాద్‌లో పోలీసులు నిర్బంధించిన నైజీరియా దేశస్థుల వద్ద భారీ మొత్తంలో మూడు, నాలుగు రకాల మాదక పదార్థాలు లభించాయట! మాదక పదార్థాలను సేవిస్తున్న వారు భయంకరమైన వ్యాధులకు గురి అయి నశించిపోతున్నారు. ఇది వైయక్తిక వైపరీత్యం. ఇలా ‘మాదకం’ మరగిన వారు, విక్రయిస్తున్నవారు, సరఫరా చేస్తున్నవారు, ఉత్పత్తి చేస్తున్నవారు పైశాచిక స్వభావులుగా రూపొందుతుండడం సామాజిక వైపరీత్యం. ఈ పిశాచ జీవనులు భయంకరమైన వివిధ బీభత్స కృత్యాలకు పాలుపడుతున్నారు. ఇది మన దేశానికి, సమాజానికి విదేశీయుల నుంచి కలుగుతున్న అసలు ప్రమాదం.. మాదక పదార్థాల రవాణా కేవలం వైయక్తిక ఆరోగ్యానికి, నేరాలకు సంబంధించిన సమస్య కావడం గతం. ఈ మాదక బీభత్సం మన దేశాన్ని బద్దలు కొట్టడానికి పాకిస్తాన్ తదితర దేశాల ప్రేరణతో జరుగుతున్న జిహాదీ కలాపాలతో అనుసంధానం కావడం వర్తమానం! మాదక ద్రవ్యం ముఠాలు, ఎఱ్ఱ చందనం దొంగిలించి చైనాకు, ఇతర దేశాలకు తరలిస్తున్న తండాలు, నకిలీ ‘వినిమయ ద్రవ్యం’- కరెన్సీ నోట్లు- ముద్రించి చెలామణి చేస్తున్న బృందాలు, పులులను, ఏనుగులను ఇతర వన్యమృగాలను చంపి వాటి చర్మాలను, గోళ్లను, దంతాలను విదేశాలకు తరలిస్తున్న ముష్కర మూకలు, సముద్రపు దొంగలు- ఇలా అనేక రకాల నేరస్తులను, నికృష్ట స్వభావులను అనుసంధానం చేస్తున్న వ్యూహం విస్తృత జిహాదీ ఉగ్రవాదంలో భాగం. ఈ అనుసంధాన వ్యవస్థకు మూలం ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’- ఐఎస్‌ఐ-! పాకిస్తాన్ ప్రభుత్వ ‘గూఢచర్య విభాగం’గా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’ నిజానికి అంతర్జాతీయ జిహాదీ కలాపాలను నిర్దేశిస్తోంది, నియంత్రిస్తోంది, సమన్వయం చేస్తోంది. వివిధ రకాల నేరాలను సాగిస్తున్న ముఠాలను అనుసంధానం చేస్తోంది. ఇదీ విస్తృతమైన జిహాదీ.. సౌదీ అరేబియా ఈ జిహాదీకి సైద్ధాంతిక ఆర్థిక ప్రాతిపదిక. పాకిస్తాన్ ఆయుధ సరఫరాకు, శిక్షణ కలాపాలకు కేంద్ర స్థానం!
అల్ ఖాయిదా బీభత్సకారులు సైతం దక్షిణ భారతంలోకి విస్తరించిపోయారన్నది సమాచారం. ఇది మరింత ఆందోళన కలిగించ వలసిన అంశం. పట్టుబడుతున్న నైజీరియన్లు మొత్తం ‘మాదక’ విక్రేతలలో కొందరు మాత్రమే. ఈ మొత్తం మాదక విక్రేతలు విస్తృత జిహాదీ బీభత్సకాండను, రక్తపాతాన్ని సృష్టించడానికి యత్నిస్తున్న ‘నిద్రాణ’- స్లీపర్-, క్రియాశీల- యాక్టివ్- విభాగాల హంతకులలో కొందరు మాత్రమే! ‘ఐఎస్‌ఐ’ వారు జిహాదీలను, ఈశాన్యంలోని ‘మతం మార్పిడి’ ముఠాల తీవ్రవాదులను, మావోయిస్టులను, ‘ఎల్‌టిటిఇ’ ఉగ్రవాదులను, ‘ఖలిస్తాన్’ విద్రోహులను సమీకృతం చేస్తోందన్నది దశాబ్దికి పూర్వం ప్రచారమైన సమాచారం. ఇప్పుడు ఇతర రకాల సామాజిక ఆర్థిక నేరస్థులను సైతం ‘ఐఎస్‌ఐ’ ఏకసూత్ర బద్ధం చేస్తోంది. మరింత భయంకరమైన బీభత్స కృత్యాలను నిర్వహించడానికి ‘ఐఎస్‌ఐ’ అమలు జరుపుతున్న వ్యూహానికి- ‘మాదకం’ ముఠాలు, ఎఱ్ఱ చందనం, పులిచర్మాలను, గోళ్లను దొంగిలిస్తున్న చైనా తండాలు ముసుగు మాత్రమే. హత్యలు చేసేవారు జేబుదొంగలుగా నటించి ‘నిఘా’ దృష్టిని మళ్లించినట్టుగా ఈ నైజీరియా పౌరులు- (వీరిని పౌరులని, వ్యక్తులని పిలవడం కూడా వైపరీత్యం) ప్రచ్ఛన్న ఉగ్రవాదులై ఉండవచ్చు. కొందరు నకిలీ డబ్బును, నల్లడబ్బును కూడా చెలామణి చేస్తున్నారు. ఇతరేతర ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.
ఇద్దరు నైజీరియా దుండగులు మన దేశంలోని నాగాలాండ్‌కు చెందిన ఛాంగ్‌ఖుమ్లా అన్న నేరస్థురాలు కలసి హైదరాబాద్ ఎల్‌బి నగర్ ప్రాంతంలోని ఒక మహిళ నుంచి మూడున్నర లక్షల రూపాయలను దోచారు. మరో మూడున్నర లక్షలను ఆమె నుంచి గుంజుకునే ప్రయత్నంలో పట్టుబడ్డారు. సైమన్ ఎబూకా ఉమేబీ, వోకాంక్‌టో కెనె్నత్ ఛిగ్బో అనే ఇద్దరు నైజీరియా తస్కరులు ఛాంగ్ ఖుమ్లా కలసి ముఠాగా ఏర్పడ్డారు. ‘అమెరికాలోని ప్రదీప్ బెంజిమన్ అనే నీ మిత్రుడు నీకు ఐదు లక్షల డాలర్ల చెక్కును పంపించాడు! అది బహుమతి! ఈ బహుమతి కావాలంటే మూడున్నర లక్షల రూపాయలను బ్యాంకులో మా అకౌంట్‌లో జమచేయాలి’ అని కేంద్ర ప్రభుత్వ విదేశీయ వాణిజ్య శుల్క విభాగం- కస్టమ్స్ డిపార్ట్‌మెంట్- అధికారిణిగా నటించిన ఛాంగ్ ఈ ఎల్‌బి నగర్ మహిళకు చెప్పిందట! అమెరికాలోని ఈ ‘నకిలీ మిత్రుడు’ ఫేస్‌బుక్ ద్వారా ఎల్‌బి నగర్ మహిళకు పరిచయమయ్యాడు! మూడున్నర లక్షల ‘కస్టమ్స్’ శుల్కం చెల్లించినట్టయితే దాదాపు మూడున్నర కోట్ల రూపాయల ‘చెక్కు’, విలువైన వస్తువులు పొందవచ్చన్న దురాశతో ఈ ఎల్‌బి నగర్ మహిళ బ్యాంక్‌లో ఆ సొమ్మును జమచేసింది. కానీ మళ్లీ ‘సుంకం’ పేరుతో సొమ్ము కోరేసరికి ఆమెకు అనుమానం వచ్చింది. నేరస్థులు పోలీసులకు పట్టుబడడం తర్వాతి కథ. కానీ, తెలంగాణ నుంచి నాగాలాండ్ వరకూ, నైజీరియా, అమెరికాల వరకూ ఈ ‘నైజీరియా నేరస్థులు’ వల బిగించగలగడమే విస్మయం కలిగిస్తున్న వ్యవహారం! నైజీరియా దుండగులు దేశమంతటా విస్తరించి పోవడం గురించి విస్తృత నిఘా కొనసాగవలసిన అనివార్యత ఏర్పడింది.
రక్షణమంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా దేశంలోకి చొరబడిన అనేకమంది నైజీరియా వాసులు, ఇతర ఆఫ్రికా వాసులు పట్టుబడ్డారు. గోవా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం మొదలైన తర్వాత నైజీరియా నేరస్థులు హైదరాబాద్ సహా ఇతర చోట్ల పట్టుబడడం మొదలైంది. గోవా సురక్షితం కాదని భావించడం వల్ల మాత్రమే నైజీరియా నేరస్థులు ఇతర చోట్లకు తరలివస్తున్నారా? లేక పథకం ప్రకారం అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తున్నారా?? దీని గురించి దర్యాప్తు జరగాలి. ఆఫ్రికాలోని అధిక శాతం దేశాలతో మనకు సత్సంబంధాలున్నాయి. వేలాది ఆఫ్రికా విద్యార్థులు మన దేశంలో ఉన్నారు. కానీ- ఈ సక్రమ ప్రవేశం ముసుగులో చొరబాటుదారులు కూడా వస్తున్నారు. గత మే నెలలో ఆఫ్రికన్లపై దిల్లీలో దాడులు జరిగాయన్న ఆరోపణలకు ఇదీ నేపథ్యం.. అందువల్ల నైజీరియన్ల ప్రవేశాన్ని ‘నిఘా’ గమనించాలి.