సంపాదకీయం

‘డిజిటల్’ ప్రహేళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యవారిని చేయబోతే కోతిగా మారిందన్న సామెత ఎంతవరకు అన్వయం అవుతోందన్నది జనమానస క్షేత్రంలో అంకురిస్తున్న అనుమానం. అయ్యవారిని చేయాలన్న సంకల్పం మంచిదే. కానీ శిల్పం కోతిగా మారకుండా నిరోధించడం కూడా ‘ఆర్థిక రూపశిల్పుల’ కర్తవ్యం. నల్లధనాన్ని నిరోధించడానికి, నకిలీ ధనాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వారు పెద్దనోట్లను రద్దు చేయడంలోని ఔచిత్యాన్ని మతిమంతులెవ్వరూ కాదనలేరు. జనం ఇబ్బందులకు గురి అయినప్పటికీ ఈ చర్యను మెచ్చుకున్నారు. యాబయి రోజుల గడువు పూర్తికాక మునుపే ప్రభుత్వం ‘కాష్‌లెస్ ఎకానమీ’- నగదు రహిత ఆర్థిక వ్యవస్థ-గురించి జనాన్ని ఊదరగొట్టడం మొదలుపెట్టింది! ‘నగదు’ లేని ఆర్థిక వ్యవస్థ అనాదిగా లేదు, భవిష్యత్తులో ఉండబోదు. ‘పేపర్‌లెస్’-కాగితం లేని- విద్యా వ్యవస్థను నిర్మించడం ఎంత సులభమో, ‘కాష్‌లెస్ ఎకానమీ’ని నిర్మించడం అంతే అసాధ్యం! ‘అదేమయ్యా పూర్వకాలంలో మన దే శంలో వస్తు వినిమయ ఆర్థిక వ్యవస్థ ఉండేది కదా!’ అని కొందరు అడగవచ్చు! కానీ ఈ ‘వస్తు వినిమయ పద్ధతి’-బార్టర్ ఎకానమీ-తో సమాంతరం గా నాణెములు, బంగారం నాణెములు, వెండి నాణెములు, రాగి డబ్బులు అనాదిగా ఉండడం చరిత్ర! మహాభారత యుద్ధం సమయంలోను అంతకు పూ ర్వం కూడా వేలాది ఏళ్లుగా నాణెములు చెలామణిలో ఉన్నాయి. కానీ వ స్తువుల విలువ ‘నాణెం’తో పోల్చినప్పుడు చాలా త క్కువగా ఉండేవి. అతి పెద్ద ప్రమాణంలో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు మా త్రమే ‘వెండి నాణెం’ అవసరం అయ్యేది. సామాన్య సంసారులకు బంగారు నాణెమును చూసే అవకాశం కూడా ఉండేది కాదు. బ్రిటన్ దురాక్రమణ నెలకొన్న తరువాత కూడా క్రీస్తుశకం పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దంలో బస్తా-క్వింటాలు-కందుల ధర రెండు రూపాయలు. పుట్టెడు ధాన్యం ఎనిమిది రూపాయలకు రైతులు విక్రయించారు. అందువల్ల స్వయం స మృద్ధ గ్రామ వ్యవస్థలో ‘కాష్’-నగదు-ప్రయోజనం అవసరం లేదు. తినడానికి, కట్టుకోవడానికి, నివసించడానికి అవసరమైన వౌలిక సదుపాయాలన్నీ వస్తు వినిమయం ద్వారా జరిగిన సమాజం అది! ‘దాన్ని’ విదేశీయ ‘పాలన‘ ధ్వంసం చేసింది. విదేశీయ దురాక్రమణ ముగిసిన తరువాత యాబయి ఏళ్లు గడవక పూర్వమే ‘ప్రపంచీకరణ’ పేరుతో మనదేశంలో విదేశీయుల పెత్తనం మళ్లీ ఆరంభమైపోయింది! ఈ ‘కాష్‌లెస్ ఎకానమీ’ అన్నది ఈ ప్రపంచీకరణ పదజాలంలో ఒక భాగం! ‘డిజిటల్ ఎకానమీ’, ‘ఆన్‌లైన్ ఎకానమీ‘, ‘డెబిట్ కార్డులు’, ‘క్రెడిట్ కార్డులు’ ‘చెక్కు’లు- వీటి విస్తరణ వల్ల నోట్ల-వినిమయద్రవ్యం భౌతిక రూపాలు నోట్లు-అవసరం తగ్గింది. కానీ ఎంతమందికి తగ్గింది?
నిజానికా ‘నల్లడబ్బు’ చెలామణి చేయగలిగిన వారికి, చేయడం అనివార్యమైన వారికి మాత్రమే ఈ ‘డిజిటల్’ వ్యవస్థ ఎక్కువగా ఉపయోగపడింది. బ్యాంకులు, ఎటిఎమ్‌లు కూడ లేని గ్రామాలలో ‘ఆన్‌లైన్‌‘ లావాదేవీలను నిర్లక్ష్యరాస్యులు, అర్ధ అక్షరాస్యులు స్వయంగా నిర్వహించుకోవడం ఎప్పటికి సాధ్యం? ‘నల్లధనం’ నిర్మూలన విషయంలో ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. పండుగ చేసుకొనడానికి, పెళ్లి చేసుకొనడానికి, ఇతరేతర ఆనందకరమైన శుభకార్యాలు చేసుకొనడానికి సైతం ఎంతో కొంత శ్రమ అవసరం. తెల్లవారు జామున ముహుర్తం ఉందంటే రాత్రంగా పెళ్లి నిర్వాహకులు, బంధుమిత్రులు నిద్రపోరు! అందువల్ల మహా ఉద్యమంగా నల్లధనం వ్యతిరేకత పెల్లుబికినప్పుడు ‘బ్యాంకు’ల ముందు, ఎటిఎమ్‌ల ముందు బారులు తీరి గంటల తరబడి నిలబడడాన్ని జనం నిరసించలేదు! కానీ ఉద్యమం, సంఘర్షణ తాత్కాలికం మాత్రమే! ఉద్యమం శాశ్వతం అయితే జనం సహించలేరు! ప్రశాంత జీవనం శాశ్వతం! పుణ్యం కోసం ఒకరోజు ఉపవాసం ఉండవచ్చు.. ప్రతిరోజూ ఉపవాసం ఉండలేరు! కేంద్ర ప్రభుత్వం వారు వాగ్దానం చేసినట్టుగా యాబయిరోజులు గడువు ముగిసేలోగా ‘కరెన్సీ’ కష్టాలను తీర్చే దిశగా చర్యలను తీసుకోవాలి! కొత్తనోట్లను ముద్రించి తగినన్ని చెలామణిలోకి తేవడం ఇందుకు ఏకైక మార్గం! కానీ ఈ సంగతిని మధ్యలో వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వం వారు ‘కరెన్సీ నోట్ల’తో అవసరమే లేని ‘డిజిటల్’ ఎకానమీ పాటను ప్రారంభించారు, ప్రపంచీకరణ రాగంతో.. ‘అభావ విరక్తి‘కి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు!
కరెన్సీ నోట్లు తగినన్ని లేవు కాబట్టి ‘కాష్‌లెస్ ఎకానమీ’ ప్రచారం మొదలుపెట్టడం నేల విడిచి సాము చేయడం! భోజన పదార్ధాలు నిండుకున్నాయి కాబట్టి ఉపవాసం చేయడం వల్ల కలిగే ఫలితాలను ప్ర చారం చేసినట్టు ఉందన్న వ్యాఖ్యలు అతార్కికం కాదు! ‘ఆన్‌లైన్’ లావాదేవీలు, ‘కార్డ్ స్వైపింగ్’లు, చెక్కుల ద్వారా చెల్లింపులు పెరగడం వల్ల నల్లధనం తగ్గడం నిజమే కావచ్చు! కానీ ఇదంతా స్వచ్ఛందంగా జరగాలి అంతేకానీ కరెన్సీ నోట్ల కొరత ఏర్పడింది కాబట్టి తక్షణం అందరూ డిజిటల్ విన్యాస క్రీడా ప్రదర్శనలకు పూనుకోవాలని చె ప్పడం విచిత్రమైన వ్యవహారం. ‘డిజిటల్ ఎకానమీ’, ‘కాష్‌లెస్ ఎకానమీ’ ప్రయోగాలు దీర్ఘకాల కార్యక్రమాలు! తక్షణ సమస్య నోట్ల కొరత.. అందువల్ల నోట్ల కొరత తీరేవరకు ప్ర భుత్వం వారు జనానికి అంతుపట్టని ‘డిజిటల్‌‘ ఎకానమీ ఆర్భాటాన్ని ఆవిష్కరించకుండా ఉండవలసింది! డిజిటల్ ఎకానమీ ఏమిటన్నది సాంకేతిక పరిజ్ఞాన రంగంతో సంబంధం లేని అధిక విద్యా వంతులకే అంతుపట్టడం లేదు! ‘చెప్పేవాడికి అర్థమై వినేవాడికి అర్థం కానిది వ్యవహారం, చెప్పేవాడికి వినేవాడికి కూడ అర్థం కానిది వేదాంతం...’ అని గతంలో ఒక మహాకవి చెప్పాడట! ఈ ‘డిజిటల్’ ఎకానమీ కేంద్ర ప్రభుత్వం వారు జనానికి అర్థం కాకుండా ఉండడానికి వీలుగా ప్రయోగిస్తున్న ‘వ్యవహారమా!’ లేక వారికి కూడా అంతుపట్టని ‘వేదాంతమా?’ ఆన్‌లైన్ నగదు బదిలీని బ్యాంకులలో ఖాతాలున్న వారందరూ చేసికొనలేరు. ముందుగా ‘ఆన్‌లైన్’ ప్రక్రియను నమోదు చేసుకోవాలి! లావాదేవీలు, అకౌంటు నంబర్లు, పాస్‌వర్డ్ నంబర్లు రహస్యంగా ఉంచుకోవాలని బ్యాంకుల నిర్వాహకులే పదే పదే సలహాలు ఇస్తున్నారు. అందువల్ల ప్రతి ఖాతాదారునికి ‘ఇంటర్నెట్’, ‘కంప్యూటర్ సిస్టమ్’లను నిర్వహించే పరిజ్ఞానం ఉండాలి. కనీసం కుటుంబంలో ఒకరికైనా ఈ పరిజ్ఞానం ఉండి తీరాలి! ‘కంప్యూటర్ సిస్టమ్’ కాని, ‘లావణ్య వాణి’-స్మార్ట్ ఫోన్- కానీ ఉండి తీరాలి. వాటికి అంతర్జాలం- ఇంటర్నెట్‌తో అనుసంధానం జరిగి ఉండాలి! లేకపోతే ఖాతాదారుడు ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి తీరాలి! ఇంటినుంచి కానీ తానున్న చోటునుంచి కానీ స్మార్ట్ ఫోన్ లేదా సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం దేశంలోని నూట పాతిక కోట్లమందిలో ఎందరికి సాధ్యం? అలా కానప్పుడు బ్యాంకుకు వెళ్లినా కంప్యూటర్ కేంద్రానికి వెళ్లినా శ్రమ ఒక్కటే!
వెంటనే స్ఫురిస్తున్న వాస్తవం ఏమిటంటే ‘డిజిటల్’ వ్యవస్థలో ప్రతి కుటుంబంలోను కంప్యూటర్ సిస్టమ్ కాని, స్మార్ట్ ఫోన్ కాని ఉండాలి! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన దేశంలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి బోలెడంత అవకాశం! ప్రపంచీకరణ వల ఎలా బిగిసిపోతున్నది మన దేశంలోని ప్రభుత్వాలకు, ప్రజలకు ధ్యాస లేని మహా విషయం.. మన నోటు అమెరికా మాటు, మన నోట ఐరోపా మాట..