సంపాదకీయం

పాకిస్తాన్‌కు ‘పాఠం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదుగురు ఉగ్రవాదులకు న్యాయస్థానం మరణ శిక్షను విధించడంతో న్యాయ ప్రక్రియ పాక్షికంగా పూర్తయింది. బీభత్స జిహాదీ కలాపాల సూత్రధారుడు మొహమ్మద్ రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉండడం న్యాయప్రక్రియ పూర్తికాకపోవడానికి నిదర్శనం. 2013 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిపి పద్దెనిమిది మందిని హత్య చేసి దాదాపు నూట ముప్పయి మందిని క్షతగాత్రులను చేసిన ఆరుగురు ప్రధాన హంతకులలో ఐదుగురు దోషులని నిరూపించడంలో జాతీయ నేర పరిశోధన సంస్థ-నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్‌ఐఏ వారు కృతకృత్యులు కావడం న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతోందన్నదానికి నిదర్శనం. ఈ బీభత్స ఘటనకంటే పూర్వం దేశంలో జరిగిన కొన్ని జిహాదీ నేరాలలో ఇంకా న్యాయ ప్రక్రియ పూర్తికాలేదు! అందువల్ల దిల్‌సుక్‌నగర్ బీభత్సకాండ జరిపిన జిహాదీ హంతకులకు నాలుగేళ్లు గడవక ముందే ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మరణ శిక్షలను విధించడం విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుండడానికి నిదర్శనం. దాదాపు నూట యాబయి మందికి పైగా సాక్షులను విచారించడం, ఐదు వందలకు పైగా దస్త్రాలను పరిశీలించడం బృహత్ న్యాయప్రక్రియ. ఇంత విస్తృతమైన దర్యాప్తును, విచారణను తక్కువ వ్యవధిలో పూర్తి చేయగలగడం అభినందనీయం. భయంకరమైన పేలుళ్లకు బలైపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు కొంత ఊరట కలిగిస్తున్న పరిణామం! నేరస్థులను శిక్షించినంత మాత్రాన నిష్కారణంగాప్రాణాలు కోల్పోయిన వారు బతికి తిరిగి రారు. వారి కుటుంబాలకు వారి మృతివల్ల కలిగిన నష్టం, కష్టం, భరించలేని వ్యధ, విషాదకరమైన జ్ఞాపకాలు తొలగిపోవు. కానీ ఇలా దుర్మార్గులైన దేశద్రోహులు శిక్షకు గురి అవుతుండడం దేశ ప్రజలందరికీ భద్రతా భావాన్ని పెంపొందిస్తున్న పరిణామం! పట్టుబడి విచారణకు గురి అయిన ఐదుగురు హంతకులు దోషులని గత పదమూడవ తేదీన ధ్రువీకరించిన ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి టి.శ్రీనివాసరావు, ఈ నేరస్థులందరికీ సోమవారం మరణ దండనను విధించడం దేశంలో ఇప్పటికీ విచ్చలవిడిగా సంచరిస్తున్న జిహాదీ హంతకులకు, వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి, సౌదీ అరేబియా వంటి దేశాలలోని సంపన్న దుర్మార్గులకు మరో హెచ్చరిక! సౌదీ అరేబియా తదితర ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక దేశాలలోని సంపన్నులు అంతర్జాతీయ జిహాదీలకు నిధులను సమకూర్చుతుండడం జగమెరిగిన సత్యం.
ఇండియన్ ముజాహిదీన్ అన్న పేరుతో చెలామణి అవుతున్న బీభత్స సంస్థ దిల్‌సుక్‌నగర్ పేలుళ్లను జరిపించడం పాకిస్తానీ షడ్యంత్రంలో భాగం. ఎందుకంటే ఇండియన్ ముజాహిదీన్, సిమి-స్టూడెంట్స్ ఇస్లామిక్ మువ్‌మెంట్ ఆఫ్ ఇండియా-వంటి మన దేశంలో పుట్టుకొచ్చిన సంస్థలను మాత్రమే కాక వివిధ దేశాలు కేంద్రంగా పనిచేస్తున్న అనేక ‘జిహాదీ’ ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్నది ‘ఐఎస్‌ఐ’ మాత్రమే. అంతర్జాతీయ జిహాదీ సమన్వయ వ్యవస్థగా ‘ఐఎస్‌ఐ’ ఏర్పడిన తరువాత గత ఇరవై ఏళ్లకు పైగా గడిచిపోయాయి. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగంగా చెలామణి అవుతున్న ఐఎస్‌ఐ-ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ నిజానికి మన దేశ వ్యతిరేక ‘బీభత్స సమన్వయ వ్యవస్థ’! ఆఫ్రికానుంచి తూర్పు ఆసియా దేశాల వరకు ‘ఐఎస్‌ఐ’ విషపుకోరలు విస్తరించి ఉన్నాయి. అందువల్ల బీభత్స కృత్యాలను ఏ జిహాదీ ముఠా జరుపుతున్నప్పటికీ ఆ ముఠాలను ఉసిగొల్పుతున్నది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇండియన్ ముజాహిదీన్ ముఠావారు దిల్‌సుక్‌నగర్‌లో పేలుళ్లు జరిపించడం పాకిస్తాన్ ప్రభుత్వ వ్యూహంలో భాగం. ఈ ముఠాలో ‘వకాస్’ అన్న మారు పేరు గల జియాఉర్ రెహమాన్ అన్న పాకిస్తానీ దుండగుడు కూడ ఉండడం పాకిస్తానీ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండకు మరో నిదర్శనం. ఈ జియాఉర్ రెహమాన్‌కు కూడ మిగిలిన దుండగులతోపాటు ప్రత్యేక న్యాయస్థానం మరణ శిక్షను విధించింది! యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, ఐజాద్ సరుూద్ షేక్ అనే దుండగులు మిగిలిన నేరస్థులు...
ఇండియన్ ముజాహిదీన్, ‘సిమి’ వంటి ముఠాలలోని ముష్కరులు ఈ దేశంలో పుట్టిపెరిగి మాతృభూమిని ముక్కలు చెక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న దేశద్రోహులు, ఉన్న ఇంటికి నిప్పుపెడుతున్నవారు! ఈ ముఠాలు కేరళనుంచి కశ్మీర్ వరకు, గుజరాత్‌నుంచి అస్సాం వరకు విస్తరించి పోయి ఉండడం వాటికి గల వనరులకూ, వాటిలోగల దుండగుల సంఖ్యకూ కొలమానం. భత్కల్ దుండగులు కర్నాటకలో పుట్టి పెరిగినవారు. దిల్‌సుక్‌నగర్ పేలుళ్ల తరువాత అనేక నెలలపాటు వారు దేశంలోనే పట్టుబడకుండా ఉండగలగడం వారికి గల ‘స్థానిక’ సమర్ధనకు, సహకారానికి నిదర్శనం. రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌లోకి జారుకోగలగడం కూడ ‘ఐఎస్‌ఐ’ మన దేశంలో నిర్మించిన బీభత్స వ్యవస్థకు ప్రత్యక్ష సాక్ష్యం! యాసిన్ భత్కల్ కూడ నేపాల్‌లోకి జారుకొనడానికి చేసిన యత్నం విఫలం కావడం వేరే సంగతి. పాకిస్తానీ దుండగుడైన ‘వకాస్’ దిల్‌సుక్‌నగర్ పేలుళ్ల తర్వాత దాదాపు పదునాలుగు నెలలపాటు మన దేశంలోనే ఉండిపోవడం ‘స్థానిక’ విద్రోహుల మద్దతుపై వాడికి గల విశ్వాసానికి నిదర్శనం! అందువల్ల ఐదుగురు దుండగులకు మరణ శిక్ష అమలు జరిగినంత మాత్రాన భద్రత బలపడదు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ యంత్రాంగాన్ని సమూలంగా నిర్మూలించే వరకు భద్రత భంగపడుతూనే ఉంటుంది! మన దేశంలో 1947నుంచి కూడ పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద కలాపాలను జరిపిస్తునే ఉంది! ఈ బీభత్స కాండతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులు దశాబ్దులుగా బుకాయిస్తున్నారు! ఈ బుకాయింపులో భాగంగానే ‘ఐఎస్‌ఐ’ వారు ఇండియన్ ముజాహిదీన్ ఏర్పాటు చేసారు. ‘లష్కర్ ఎ తయ్యబా’, ‘జమాత్ ఉద్ దావా’ వంటి ముఠాలు పాకిస్తాన్‌లోనుండి మనదేశంలోకి దశాబ్దులుగా ఉగ్రవాదులను ఉసిగొల్పాయి. దీనివల్ల పాకిస్తాన్ ‘బీభత్సకారుల తయారీ కేంద్రం’ అన్నది ప్రపంచ దేశాలు గుర్తించిన వాస్తవం! కానీ ‘ఇండియన్ ముజాహిదీన్’ పేరుతో జరిగే హత్యాకాండలో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ప్రపంచ దేశాలను నమ్మించవచ్చు!
‘ఇండియన్ ముజాహిదీన్’ భారత్‌లోనే పుట్టింది. ఆ ముఠాలోని ఉగ్రవాదులు భారతీయులు, అందువల్ల మా దేశానికి భారత్‌లో జరుగుతున్న బీభత్సకాండతో సంబంధం లేదు, ఇదంతా భారతదేశపు అంతర్గత వ్యవహారం -అని బుకాయించడానికి వీలుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ‘ముఠా’ను ఏర్పాటు చేసింది. కానీ ఇండియన్ ముజాహిదీన్‌ను నడిపిస్తున్నది పాకిస్తానీలే! దిల్‌సుక్‌నగర్ పేలుళ్లను ‘వకాస్’ జరపడం, రియాజ్ పాకిస్తాన్‌కు పారిపోవడం అదనపుసాక్ష్యాలు మాత్రమే! పాకిస్తాన్‌ను ‘బీభత్స వ్యవస్థ’-‘టెర్రరిస్ట్ రిజీమ్’గా ఐక్యరాజ్యసమితిలో ప్రకటింపచేయడానికి ఇవి సాక్ష్యాలు....