సంపాదకీయం

ఆగ్నేయాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సైనిక దళాల ‘అమ్ములపొది’లో ఆగ్నేయాస్త్రం చేరింది. రక్షణ పటిమ విస్తరించింది. మన ప్రతిఘటన వ్యూహం మరింత పటిష్టంగా అమలు జరుగుతోంది. దురాక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుండడం సమాంతర పరిణామం. ఐదవ శ్రేణి ‘అగ్ని’ పరీక్ష విజయవంతం కావడం ఇది నాలుగవసారి. సోమవారం నాడు ఒరిస్సా సముద్రతీరం సమీపంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఐదవ శ్రేణి ‘అగ్ని’ దూసుకొని వెళ్లడంతో మన సుదూర లక్ష్యచ్ఛేదక రక్షణ పటిమ మరోసారి ధ్రువపడింది. ‘అగ్ని’ సుదూర లక్ష్యచ్ఛేదక ఖండాంతర క్షిపణి దూసుకొని వెళ్లిన సమయంలో చైనా వారి ఎఫ్‌సి- 31 ‘గేర్ ఫాల్కన్’ అనే ప్రచ్ఛన్న యుద్ధ విమానం- ‘సెల్ఫ్ ఫైటర్ జెట్’- వినువీధిలో విజయ విన్యాసాలను ప్రదర్శించడం దురాక్రమణ పటిమ మరింత విస్తరించిందనడానికి నిదర్శనం. రక్షణ రంగంలో చైనా దురాక్రమణకు, మన దేశం ప్రతిఘటనకు ‘ప్రతీకలు’గా మారడం అంతర్జాతీయ సమాజం తిలకిస్తున్న వర్తమాన దృశ్యం! తూర్పు ఆగ్నేయ, ఈశాన్య ఆసియా ప్రాంతాలలో విస్తరించి ఉన్న సముద్రజలాలలో చైనా అమలు జరుపుతున్న దురాక్రమణ వ్యూహం ప్రాంతీయ దేశాలకు వి స్మయం కలిగిస్తోంది. ఈ దేశాలలో అధికశాతం చైనా దురాక్రమణను ప్రతిఘటించడానికై మన దేశంతో జట్టుకట్టడానికి సిద్ధవౌతుండడం ‘అగ్ని’ పరీక్షకు నేపథ్యం. మనకు ఖండాతర లక్ష్యచ్ఛేదక క్షిపణి ఏర్పడడం ఇదే మొదటిసారి. ఈ ‘ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సయిల్’- ఐసిబిఎమ్- ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి వీలైన ఒకటిన్నర టన్నుల బరువైన అణ్వస్త్రాన్ని తీసుకొని వెళ్లగలదట! అందువల్ల ఇది ‘ఐసిబిఎమ్’- పూర్తిస్థాయి కాదని అంటున్నారు. దూర లక్ష్యచ్ఛేదక క్షిపణి- ‘ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సయిల్’- ఐఆర్‌బిఎం- గానే రక్షణశాస్తవ్రేత్తలు దీన్ని పరిగణిస్తున్నారు. కానీ ఒకటిన్నర టన్నుల కంటే తక్కువ బరువైన అణ్వాయుధాలను ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలకు ఈ ‘అగ్ని’- ఐదవ శ్రేణి క్షిపణి చేరవేయగలదట! అందువల్ల ఇది ‘సుదూర లక్ష్యచ్ఛేదక ఖండాంతర క్షిపణి’ స్థాయికి చెందినదేనన్నది మరో పరిగణన. ఏమైనప్పటికీ ‘నాలుగవ శ్రేణి’ అగ్ని క్షిపణి కంటె ఈ సరికొత్త క్షిపణి వెయ్యి కిలోమీటర్లు ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలగడం పెరిగిన పాటవానికి నిదర్శనం. నాలుగవ శ్రేణి అగ్ని క్షిపణి ప్రయోగం మొదటిసారి 2014 డిసెంబర్‌లో విజయవంతమైంది. రెండేళ్లలో మన శాస్తవ్రేత్తలు మరింత మెరుగైన ఈ ఐదవ ఆగ్నేయాస్త్రాన్ని రూపొందించడం అభినందనీయం.
మన శాస్తవ్రేత్తలు సమీప లక్ష్యచ్ఛేదక క్షిపణులను, దూర లక్ష్యచ్ఛేదక క్షిపణులను ఇప్పటికే రూపొందించారు. ఇప్పుడు సుదూర లక్ష్యచ్ఛేదక క్షిపణి కూడా ఏర్పడింది. అయితే మన దేశానికి వ్యతిరేకంగా దురాక్రమణ వ్యూహాన్ని కొనసాగిస్తున్న చైనా సకలవిధ ఆయుధ, యుద్ధ వాహక సామగ్రి విషయంలో మనకంటే అగ్రగామిగా ఉంది. ‘అగ్ని’ పరీక్షలకు ఇదీ నేపథ్యం. మనదేశానికి ఉత్తరపు సరిహద్దు వెంబడి ‘ప్రచ్ఛన్నయుద్ధ విమానాల’ - సెల్ఫ్ ఫైటర్ జెట్స్-ను చైనా అనేక ఏళ్లుగా మోహరిస్తోంది. ఈ ‘దొంగదెబ్బ తీయగల’ విమానాలు ఏ దేశానికైనా- కేవలం పొరుగు దేశాలపై దాడి చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సుదూర ప్రాంతాలలోని దేశాలపై దాడి చేయడానికి ఇవి పనికిరావు. తక్కువ ఎత్తులో దూసుకుని వచ్చే ఈ సెల్ఫ్ ఫైటర్ విమానాలు శత్రుదేశాల రాడార్ - నిఘా- వ్యవస్థకు అందకుండా దొంగదెబ్బ తీసి వెనక్కి పారిపోగలవు. అందువల్ల సెల్ఫ్ ఫైటర్స్‌ను కేవలం మనదేశంపై దాడికి మాత్రమే చైనా ఉపయోగించగలదు. తైవాన్, దక్షిణ కొరియా వంటి సరిహద్దు దేశాల జోలికి చైనా ఇప్పుడప్పుడే వెళ్లదు. అందువల్ల ‘అగ్ని’ పరీక్ష జరిగిన రోజుననే చైనా ‘గేర్ ఫాల్కన్’ రకం దొంగ విమానాన్ని ఆవిష్కరించడం మనకు మరో హెచ్చరిక వంటిది. అమెరికా వారి ‘ఎఫ్ 35’ అన్న ‘దొంగ విమానం’ స్థాయికి దీటుగా చైనా ఈ ఎఫ్‌సి-31 రకం విమానాలను రూపొందించిందట. ఈ విమానాలను తాము ఉపయోగించడం మాత్రమే గాక చైనావారు వీటిని పాకిస్తాన్‌కు సైతం చేరవేసే ప్రమాదం లేకపోలేదు. తమ దేశానికి తూర్పుగా, జపాన్‌కు దక్షిణంగా ఉన్న సముద్ర ప్రాంతంలో చైనా ‘గగన రక్షణ’ వలయాన్ని ఏర్పాటు చేసి ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ ‘వలయాన్ని’ గుర్తించడం లేదు. తమ అనుమతి లేకుండా ఈ రక్షణ వలయంలోకి ఇతర దేశాల విమానాలు ప్రవేశించరాదన్న చైనా ఆజ్ఞను అన్ని ఇతర దేశాలు ధిక్కరిస్తుండటం నడుస్తున్న కథ...
వియత్నాంకు తూర్పుగాను, చైనాకు దక్షిణంగాను ఉన్న సముద్ర ప్రాంత దేశాలు కూడా చైనా దౌర్జన్యకాండను నిరోధించడానికి కృతనిశ్చయంతో ఉ న్నాయి. ఈ సముద్ర ప్రాంతంలోని అనేక ని ర్జన, జనావాస ద్వీపాల విషయంలో చైనాకు, ఈ ప్రాంత దేశాల మధ్య కొనసాగుతున్న వివాదం ఇటీవలి కాలంలో ఉద్ధృతమైంది. ఈ దేశాలన్నీ ‘ఆసియాన్’ - ఆగ్నేయాసియా దేశాల కూటమి-లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ‘ఆసియాన్’లో మన బంధం బలపడటానికి, మన తూర్పుదిశగా కార్యాచరణ-‘యాక్ట్ ఈస్ట్’- విధానానికి ఈ చైనా దౌత్య, వ్యూహాత్మక దౌర్జన్యకాండ ప్రధాన ప్రాతిపదిక. వియత్నాం సముద్ర జలాలలో వియత్నాం ప్రభుత్వం అనుమతితో మన ఓఎన్‌జిసి- ఇంధన తైలం, ఇంధన వాయు సంస్థ- అనే్వషణలను జరపడాన్ని సైతం చైనా అడ్డుకుంటోంది. నేపాల్‌తో కలసి చరిత్రలో మొదటిసారి చైనావారు సంయుక్త సైనిక విన్యాసాలను జరుపబోతున్నట్లు ప్రచారమవుతోంది. అందువల్ల చైనా ప్రభుత్వం మనదేశానికి వ్యతిరేకంగా అమలు జరుపుతున్న దురాక్రమణ వ్యూహం ఉభయదేశాల సరిహద్దులకు మాత్రమే పరిమితమైలేదు. తూర్పు ఆసియా అంతటా ఉద్రిక్తతలను సృష్టించడానికి చైనా యత్నిస్తోంది. దీన్ని నిరోధించడానికి మనదేశం ప్రయత్నించడం అనివార్యమైన పరిణామక్రమం. సుదూర లక్ష్యచ్ఛేదక క్షిపణులను మరిన్నింటిని మనం సమకూర్చుకోవలసిన అవసరం, అనివార్యం ఇలా ఏర్పడుతున్నాయి. దురాక్రమణ మన జాతీయ స్వభావం కాదు. ఇప్పుడూ కాదు, చరిత్రలో ఏనాడూ కాదు. కానీ దురాక్రమణను నిరోధించడం మనకు అనివార్యం. 1962నాటి చైనీయ దురాక్రమణను మనం నిరోధించలేకపోయాం. ఇలాంటి ఘటన పునరావృత్తం కారాదు. అందుకు ఎప్పటికైనా చైనాకు దీటుగా మన రక్షణ సామర్థ్యం విస్తరించాలి.
ఇప్పటికి మాత్రం ఆయుధాల విషయంలో, రక్షణ సాధన సంపత్తి విషయంలో మనం చైనాకంటే వెనుకబడి ఉండటం కాదనలేని కఠోర వాస్తవం. మనం 5వేల కిలోమీటర్ల దూరం దూసుకువెళ్లే ‘రక్షణాగ్ని’ని ఇప్పటికి వెలిగించగలిగాం. కానీ చైనా ఇదివరకే పదునాలుగువేల కిలోమీటర్లు దూసుకువెళ్లగల సుదూర లక్ష్యచ్ఛేదక ఖండాంతర క్షిపణిని నిర్మించింది. ఈ ‘డాంగ్ ఫింగ్’ అమెరికా తీరంలో లక్ష్యాలను సైతం ఛేదించగలదట. ప్రధానంగా మన వార్షిక రక్షణ వ్యయం కనీసం రెట్టింపుకావాలి. చైనా ఆధికారికంగా మనకంటే మూడున్నర రెట్లు సైన్యం కోసం ఖర్చు చేస్తోంది. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఖర్చు పెడుతోందట..!