సంపాదకీయం

‘ప్రణవ’ విభేదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నతుడు సలహాలను స్వీకరించాలి. సలహాలను ఇవ్వడం సంప్రదాయం కాదు. స్వీకరించిన సలహాలను సమీక్షించి, ఆదేశాలను ఇవ్వడం సర్వోన్నతుని విధి. ఆదేశాలను ఇతరులు పాటించి తీరాలి. మన రాజ్యాంగ వ్యవస్థలో రాష్టప్రతి సర్వోన్నతుడు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన వ్యవహారంపై, సంబంధిత పరిణామాలపై రాష్టప్రతి ప్రణవ్ కుమార్ ముఖర్జీ ఆదేశాలనివ్వడం లేదు. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, సలహాలనిస్తున్నారు. దీని వల్ల ‘రాజ్యాంగ’ గందరగోళం ఏర్పడిపోయింది! నవంబర్ ఎనిమిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడం వల్ల నిరుపేదలకు ఎదురౌతున్న కడగండ్ల గురించి ప్రభుత్వ అధినేత స్వయంగా ఆందోళన చెందడం ఆశ్చర్యకరం. నిజంగా నిరుపేదలు భరించరాని ఇడుముల పాలయి ఉన్నట్టయితే నిరోధక చర్యలను తీసుకొనవలసిందిగా ప్రధానమంత్రిని రాష్టప్రతి ఆదేశించాలి. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ విషయంలో నిరోధక చర్యలు ఎలా తీ సుకోగలరు? పరిష్కారం ఎలా కనుగొనగలరు? చె లామణి కావలసిన ‘నోట్ల’ పరిమాణాన్ని సంఖ్యను పెంచడం మాత్రమే పరిష్కారం. ఈ పరిష్కారాన్ని అమలు జరపాలని, వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రివర్గానికి రాష్టమ్రతి సందేశాన్ని పంపి ఉండవచ్చు. అలాంటి సందేశం గురించి ప్రచారం జరగనక్కరలేదు. అది ప్రభుత్వ అంతర్గత వ్యవహారం. నోట్లరద్దుకు ముందు, నోట్ల రద్దు తర్వాత మంత్రివర్గానికీ, రాష్టప్రతికీ మధ్య సమాచార వినిమయం జరిగిందా? లేదా? అన్నది అంతర్గత వ్యవహారం. ఏమైనప్పటికీ పెద్దనోట్లను రద్దు చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రాష్టప్రతిది. అందువల్లనే పార్లమెంటులో చేసే ప్రసంగాల సమయంలో రాష్టప్రతి కేంద్ర ప్రభుత్వాన్ని ‘నా ప్రభుత్వం’ అని, కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను తన నిర్ణయాలని అభివర్ణించడం రాజ్యాంగ సంప్రదాయం. అందువల్ల పెద్దనోట్లను రద్దు చేయాలనే నిర్ణయం రాజ్యాంగం ప్రకారం రాష్టప్రతి నిర్ణయం. కానీ గవర్నర్ల సమావేశంలో రాష్టప్రతి ప్రసంగంలో ఈ నిర్ణయంతో తనకేమీ సంబంధం లేదన్న ‘్ధ్వని’ ప్రస్ఫుటించింది. ఎవరి మీదనో ఆరోపిస్తున్న ‘్ధ్వని’ స్ఫురించింది. తక్షణం ఉపశమనం కల్పించడం అనివార్యమైతే రాష్టప్రతి ఆ చర్యలను ఆదేశించవచ్చు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉపశమన చర్యలు తీసుకోజాలరు. ఈ సంగతి ఆర్థిక, రాజ్యాంగ శాస్త్ర కోవిదుడైన ప్రణవ్ ముఖర్జీకి బాగా తెలుసు.
మనది పార్లమెంటరీ రాజ్యాంగ వ్యవస్థ. అందువల్ల పరిపాలన రాష్టప్రతి పేరు మీదుగా జరుగుతున్నప్పటికీ వాస్తవంగా పరిశీలిస్తున్నది లోక్‌సభకు బాధ్యత వహిస్తున్న మంత్రివర్గం. అందువల్ల గవర్నర్ల, లెఫ్టినెంట్ గవర్నర్ల దృశ్య శ్రవణ మాధ్యమ సదస్సులో రాష్టప్రతి ప్రసంగ ధోరణిలో కేంద్ర మంత్రివర్గాన్ని రాష్టప్రతి విమర్శించినాడేమోనన్న అనుమానం కలగడం అతార్కికం కాదు. ఇలాంటి అనుమానం కలుగని రీతిలో రాష్టప్రతి ప్రసంగించి ఉండాలి. విభేదాలు ఉన్నట్టు తనకు, మంత్రివర్గానికీ మధ్య నిర్ణయ సయోధ్య లేదన్నట్టు ప్రసంగంలో ధ్వనింప చేయడం వల్ల రాష్టప్రతి కొత్తగా సాధించగలిగినదీ, సవరించగలిగినదీ కూడా ఏమీ లేదు. ప్రధానికీ, రాష్టప్రతికీ మధ్య రాష్టప్రతికి సలహాలనివ్వడానికి రాజ్యాంగం వ్యవస్థీకరించిన మంత్రివర్గానికీ రాష్టప్రతికీ మధ్య విభేదాలున్నట్టు ప్రచారం కావడం ఎవరికి మేలు? అధ్యక్ష ప్రజాస్వామ్యంలో వలె రాష్టప్రతి క్రియాశీలక ప్రభుత్వ అధినేత కాదు. లాంఛన ప్రాయమైన అధినేత.. రాష్టప్రతి రాజ్యాంగంలోని డెబ్బయి ఐదవ అధికరణం ప్రకారం నియుక్తి చేసే ప్రధానమంత్రి ప్రభుత్వానికి క్రియాశీల అధినేత. ఈ క్రియాశీల అధినేత రాష్టప్రతి పట్ల వహించే బాధ్యత కంటె పార్లమెంటుకు వహించవలసిన బాధ్యత మరింత ప్రాధాన్యవంతమైనది, రాజ్యాంగ పరంగా వౌలికమైనది. అధ్యక్ష ప్రజాస్వామ్యంలో దేశాధినేత, ప్రభుత్వాధినేత ఒక్కరే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా దేశాధినేత ప్రభుత్వాధినేత అయినప్పటికీ ‘ప్రభుత్వాధిపత్యం’ దేశాధినేతకు కేవలం లాంఛన ప్రాయం. ఇది ప్రణవ్ ముఖర్జీకి తెలియని వ్యవహారం కాదు. ఈ రాజ్యాంగ పరిధిలోకి లోబడిన రాష్టప్రతి మంత్రివర్గ నిర్ణయాలను తనవిగానే స్వీకరించడం వాటిని బహిరంగంగా వ్యతిరేకించ పోవడం, విమర్శించక పోవడం సంప్రదాయం. రాజ్యాంగ విజ్ఞాన ధురీణుడైన ప్రణవ్ ముఖర్జీ ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించాడని చెప్పడం దుస్సాహసం కాగలదు. కానీ ‘ఉల్లంఘించినట్టు’ గవర్నర్ల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ధ్వనింపచేసింది!
పెద్దనోట్ల రద్దు వల్ల నిరుపేదలు భరింపరాని, సహింపలేని అష్టకష్టాలకు గురి అవుతున్నారన్నది ప్రతిపక్షాలలో కొన్ని చేస్తున్న ప్రచారం. వాస్తవ జీవనంలో గ్రామాలలో కాని నగరాలలో కాని నిరుపేదలు ఇలా ‘హాహాకారాలు’ చేస్తున్న అనుభవాలు దృశ్యమానం కావడం లేదు. నోట్లరద్దు వల్ల తాము ఆకలితో అల్లాడిపోతున్నామని నిరుపేదలు చెప్పడం లేదు. అసలు నోట్లరద్దు ఆర్భాటపు స్పృహ వారిలో ఎక్కువగా లేదు. నిరుపేదల వద్ద ఉండిన పెద్దనోట్లను వారు బ్యాంకులలో జమ కట్టారు. ప్రత్యామ్నాయంగా కొత్తనోట్లను ‘పరిమితి’కి లోబడి తీసుకున్నారు. నెలకు తొంబయి ఆరువేల రూపాయలు- వారానికి ఇరవై నాలుగు వేల చొప్పున - కంటె ఎక్కువ ఏ నిరుపేదకు అవసరం? అవసరమైనవారు నిరుపేదలు కాజాలరు. రెండు లక్షల రూపాయల వరకూ బ్యాంకులలో జరిగిన ‘జమ’-డిపాజిట్-లపై ఎలాంటి విచారణలు, దర్యాప్తులు లేవు. నిరుపేదలు రెండున్నర లక్షల రూపాయల కంటె ఎక్కువ విలువైన ‘పాత’ రద్దయిన నోట్లను బ్యాంకులలో జమ చేశారా? ఎవరికి బాధ? బాధంతా ఎక్కువ మొత్తాలలో జమ చేసిన సంపన్నులది మాత్రమే. నల్లడబ్బును నిరుపేదలకిచ్చి ‘బినామీ’గా జమ చేయించిన వారికి కూడా ఆందోళన కొనసాగుతూ ఉండవచ్చు. ఈ సంపన్నుల బాధ సామాన్యుల బాధ కాజాలదు. ‘డిజిటల్ ఎకానమీ’, ‘క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్’- నగదు రహితంగా లావాదేవులు- వంటి విచిత్ర ప్రహేళికలను నోట్లరద్దుతో ముడి పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంత గందరగోళాన్ని సృష్టించింది. ఈ ‘డిజిటల్’ అయోమయాన్ని అంతం చేయమని, నగదు చెలామణిని పెంచమని రాష్టప్రతి కేంద్రమంత్రివర్గాన్ని కోరవచ్చు. అది కూడ అంతర్గత సమాచార వినిమయం ద్వారా మాత్రమే జరగాలి. బహిరంగ వేదికలపై ప్రసంగం ద్వారా కాదు.
ప్రణవ్ ముఖర్జీ ఇలా ‘క్రియాశీలక’ వివాదగ్రస్తం కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడ ఆయన ‘క్రియాశీలత్వం’ ప్రకటించారు. న్యాయవ్యవస్థ మితిమీరిన క్రియాశీలత్వం ప్రదర్శిస్తోందని ప్రణవ్ గత ఏప్రిల్ పదహారవ తేదీన భోపాల్‌లో జరిగిన న్యాయ సదస్సులో ఆరోపించాడు. ఈ మితిమీరిన క్రియాశీలత మంత్రివర్గాల- ఎగ్జిక్యూటివ్- పరిధిలోకి చొరబడుతోందని ఆయన వ్యాఖ్యానించాడు. కేంద్ర మంత్రివర్గానికి, సర్వోన్నత న్యాయస్థానానికి మధ్య ఈ ‘అధికార పరిధి’ వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. కానీ రాష్టప్రతి ఈ వివాదంలో ‘న్యాయనిర్ణేత’.. ఒక పక్షం వైపున వాదం వినిపించరాదు.