సంపాదకీయం

ప్రతిఘటన పటిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా ప్రభుత్వ వ్యూహాత్మక దురాక్రమణ పట్ల నిర్లిప్తత వహించే విధానాన్ని మన ప్రభుత్వం విడనాడింది. దశాబ్దుల తరబడి నెలకొన్న ఈ నిర్లిప్తత ఇటీవలి కాలంలో తొలగిపోవడం మన రక్షణ విధానంలో వచ్చిన విప్లవాత్మక పరివర్తనకు నిదర్శనం. మన ప్రతిఘటన పటిమ భౌతికంగాను వ్యూహాత్మకంగాను పెరుగుతున్న కొద్దీ చైనా దురాక్రమణపుకోరలు మరింత పదునెక్కుతుండడం సమాంతర పరిణామం. మన రక్షణ దళాలు రాఫిల్ యుద్ధ వినానాలను సమకూర్చుకోవడం, వీటిని ప్రధానంగా చైనా సరిహద్దు సమీపంలోని వైమానిక స్థావరాలలో నెలకొల్పడం చైనా దురాక్రమణ వ్యూహానికి విరుగుడు. ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అణ్వస్త్రాలను సంధించగల ‘అగ్ని ఐదవ శ్రేణి’ క్షిపణులు మన సైనిక దళాలకు లభిస్తుండడం మన ప్రతిఘటన పటిమ పెరిగిందనడానికి మరో నిదర్శనం. కానీ, చైనా తన ఆయుధ సంపత్తిని యుద్ధ వాహనాలను మరింతగా పెంచుకుంటోంది! చైనా మూడవ విమాన వాహక యుద్ధనౌకను నిర్మిస్తుండడం ఇందుకు తార్కాణం. ఫ్రాన్స్ వద్ద మనం అరవై వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొ నుగోలు చేస్తున్న ము ప్పయి ఆరు రాఫిల్ యుద్ధ విమానాలు మనకు లభించేనాటికి చైనా వారి మూ డవ విమాన వాహక యు ద్ధనౌక త యారీ పూర్తయిపోతుంది. చైనా నౌకాదళంలో ప్రస్తుతం ఒక విమాన వాహక యుద్ధనౌక మాత్రమే ఉంది. రెండవదాన్ని చైనా నిర్మిస్తోంది. నిర్మాణం దాదాపు పూర్తయిపోయిందట! మూడు విమాన వాహక యుద్ధ నౌకలు చైనాకు ఎందుకు? రక్షణ కోసం అయినట్టయితే ఒకటి చాలు. ఎందుకంటే చైనాకు సముద్రం ఒకే వైపున వుంది. ఈ తూర్పు సముద్రంలో లియా ఓనింగ్ అన్న విమాన వాహక యుద్ధనౌక ఇది వరకే తిష్ఠ వేసింది. అందువల్ల మిగిలిన రెండు నౌకలూ ఎందుకోసం చైనా సమకూర్చుకుంటోంది! చైనాకు దక్షిణంగా వియత్నాంకు తూర్పుగా విస్తరించి ఉన్న సముద్రంలో తన భౌతిక ఆధిపత్యాన్ని ప్రతిష్ఠించుకొనడానికి చైనా గత కొన్ని ఏళ్లుగా యత్నిస్తోంది! ఈ ప్రాంతంలోని వందలాది ఆవాస, నిర్జన దీవులన్నింటినీ ఆక్రమించుకుని మొత్తం ఈ సముద్ర ప్రాంతాన్ని తన నౌకాదళ స్థావరంగా మార్చుకోవాలన్నది చైనా వ్యూహం! ఈ దీవులు వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు చెందినవి. ఈ దీవుల విషయమై ఆరు ఆగ్నేయ, ఆసియా దేశాలతో చైనాకు వివాదం కొనసాగుతోంది..
అందువల్ల ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం యుద్ధ విమాన వాహక నౌకలను చైనా ఎక్కువ సంఖ్యలో సమకూర్చుకొంటోందన్న ప్రచారం అర్థం లేనిది. ఎందుకంటే ఈ ప్రాంతంలో యుద్ధానికి విమాన వాహక నౌకలు అవసరం లేదు. ఇదంతా చైనాకు సమీప ప్రాంతం. భూభాగం నుంచి బయలుదేరిన విమానాలు దాడులు చేసి తిరిగి స్థావరాలకు చేరవచ్చు! చైనాకు తూర్పుగాను, జపాన్‌కు దక్షిణంగాను ఉన్న అంతర్జాతీయ సముద్ర జలాలను సైతం చైనా కల్లోలితం చేస్తోంది. ఈ జలాలు తమ సార్వభౌమ జలాలుగా ప్రకటించడం ద్వారా చైనా ప్రభుత్వం కొత్త వివాదానికి తెర లేపింది. ఈ ప్రాంత గగన తలాన్ని స్వీయ రక్షణ మండలంగా చైనా ప్రకటించింది. ఈ గగనంలోకి తమ అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ప్రవేశించరాదన్న నిబంధనను దాదాపు అన్ని ఇరుగు పొరుగు దేశాలు ఉల్లంఘిస్తున్నాయి. రెండేళ్లకు పైగా ఈ వివాదం నడుస్తోంది. కానీ ఈ ప్రాంతం కూడ జపాన్, తైవాన్, కొరియా, చైనాల మధ్య నెలకొన్న ఇరుకైన సముద్ర ప్రాంతం! అందువల్ల నౌకలలో నుండి యుద్ధ విమానాలు పైకెగిరి దూరప్రాంతాలకు వెళ్లి దాడులు జరిపి తిరిగి నౌకలలోకి రావలసిన అనివార్యం లేదు! నిజానికి చైనాకు మూడు యుద్ధ విమాన వాహక నౌకలు ఉండబోతున్నాయన్న వార్త వినగానే మన దేశాన్ని మూడు సముద్రాల వైపనుంచి దిగ్బంధించడానికి చైనా చేస్తున్న ప్రయత్నం గుర్తుకు రాక మానదు. మూడు యుద్ధ విమాన వాహక నౌకలను మన దేశం చుట్టూ ఉన్న సముద్రాలలో చైనా మోహరించకపోవచ్చు! కానీ చైనా యుద్ధనౌకలు మన దేశానికి మూడు వైపులా గస్తీ తిరుగుతుండడం దశాబ్దిగా నడుస్తున్న ప్రహసనం..
తమ దేశానికి దూరంగా ఉన్న దేశాలపై యుద్ధాలను చేయడం కోసమే గతంలో అమెరికా వంటి దేశాలు విమాన వాహక యుద్ధ నౌకలను ఉపయోగించాయి. ఇరాక్‌పై జరిపిన రెండు యుద్ధాలలోను అమెరికా వీటిని ఉపయోగించింది! చైనా ఇప్పటికే వాణిజ్య సామ్రాజ్యవాద దేశంగా ఎదిగింది. మన దేశం నుండి సగటున సాలీన రెండు లక్షల కోట్ల రూపాయల విదేశీ వినిమయ ద్రవ్యం-్ఫరిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- చైనాకు తరలిపోతుండడం ఈ వాణిజ్య సామ్రాజ్యవాదంలో భాగం. మనం చైనాకు విక్రయిస్తున్న వస్తువుల విలువ కంటె మనం చైనా నుండి కొంటున్న వస్తువుల విలువ సా లీన దాదాపురెండు లక్షల కోట్లు ఎక్కువ. ఇది మన వాణిజ్యంలో లోటు! చైనా మన దేశానికి వాణిజ్యంలో ప్ర ధాన భాగస్వామి. ఒక దేశానికి ఆ దేశాన్ని గ తంలో దురాక్రమించిన శత్రుదేశం అతి పెద్ద వా ణిజ్య భాగస్వామి కా వడం ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య కూడ లేని సంబంధం. ఈ వాణిజ్యం చైనా మన దేశానికి వ్యతిరేకంగా జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణ! మనం చైనాకు ఇలా ఏటా అప్పగిస్తున్న విదేశీయ వినిమయ ద్రవ్యం విలువ మన రక్షణ బడ్జెట్‌తో దాదాపు సమానం. చైనా ఆధికారికంగా ఇప్పటికే మనకంటె దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా సైనిక వ్యయం చేస్తోంది! ఇంకా పెంచుకొనడానికి ప్రయత్నిస్తోంది. ఇలా మన ప్రభుత్వం వాణిజ్యం లోటు రూపంలో చైనాకు భారీ మొత్తాన్ని అర్పిస్తుండడం మన ఇంటి గోడలను తవ్వదలచుకున్న వారి చేతులకు మనమే గునపాలను అప్పగించినట్టు అవుతోంది! చైనాతో మన వాణిజ్యాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్టయితే ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఆ సొమ్మును మనం చైనాను ప్రతిఘటించే రక్షణ కలాపాలకు ఉపయోగించవచ్చు...
ఏమయినప్పటికీ వాణిజ్య సామ్రాజ్య శక్తిగా ఎదిగిన చైనా రాజకీయ సామ్రాజ్యవాదాన్ని కూడ కొనసాగిస్తోంది! ఈ కొనసాగింపులో భాగంగానే దూర దూర ప్రాంతాలలో నెలకొల్పడానికి వీలుగా విమాన వాహక యుద్ధ నౌకల సంఖ్యను పెంచుతోంది. ‘మాల్‌దీవుల’ కేంద్రంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకా యుద్ధ పటిమను ప్రదర్శించడానికి చైనా ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అందువల్ల విమాన వాహక యుద్ధ నౌకను ‘మాల్‌దీవుల’ ప్రాంతానికి తరలించి నెలకొల్పడం చైనా దీర్ఘకాల వ్యూహం. ప్రపంచ రాజకీయ సామ్రాజ్య ఆధిపత్యం కోసం చైనా అమెరికాతో తలపడనున్నదన్న ప్రచారం కూడ జరుగుతోంది. కానీ ఈ వ్యూహంలో భాగంగా కూడ చైనా దురాక్రమణ గురి ప్రధానంగా మన దేశం మీదనే! ‘మాల్‌దీవులు’ మన ‘లక్షద్వీపాల’కు సమీపంలో నెలకొని ఉండడం తెలిసిందే. మనకు కూడ విక్రమాదిత్య, విక్రాంత్ అన్న విమాన వాహక యుద్ధనౌకలున్నాయి. మనం కూడ మూడవ దాన్ని సమకూర్చుకోవద్దా?