ఉత్తరాయణం

ద్వంద్వ ప్రమాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా గురుకులాలుగా మారుస్తామని ఎపి సర్కారు పలుసార్లు ప్రకటించింది. బడుగువర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది. ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 100 హాస్టల్ సంక్షేమాధికారుల, గిరిజన సహాయ సంక్షేమాధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం విడ్డూరం. సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యామ్నాయంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో? ఈ ద్వంద్వ ప్రమాణాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
పొరుగింటి పుల్లకూర..
మనకొక నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఉన్నాడు. ఆయనకు ఇతర కుహనా మేధావుల్లాగానే భారతీయ సంప్రదాయాలు నచ్చవు. భారతీయం అయిన ప్రతి దాన్ని విమర్శిస్తాడు. ప్రధానిగా మోదీ పనికిరాడని సేన్ తన అమూల్య అభిప్రాయం వెల్లడించినా ప్రజలు మోదీనే ఎన్నుకున్నారు. ఇప్పుడు నోట్లరద్దు మూర్ఖపుచర్య అని సేన్ అంటున్నాడు. అయితే, ఫ్రాన్స్‌కి చెందిన నోబెల్ గ్రహీత జీన్‌టిరోల్ నోట్లరద్దు అవినీతిపై ఆయుధం అని అభివర్ణించారు. ఫ్రాన్స్ మేధావికి మన పుల్లకూర, మన సేన్‌గారికి విదేశీ పుల్లకూర రుచి!
- సత్య, కరప
ఖాళీలను భర్తీ చేయరా?
తెలంగాణలో జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టులు 12 ఉన్నాయి. వాటిలో 10 కోర్టుల్లో ఫోరం అధ్యక్షుడితో పాటు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా 90రోజుల్లో పరిష్కారం కావాల్సిన కేసులు ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 4,000 కేసుల్లో 70 శాతం వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో వినియోగదారుల పరిరక్షణ కమిటీలు, ధరల నియంత్రణ సలహా కమిటీలను నియమించాలి. వినియోగదారుల ఫోరం అధ్యక్ష, సభ్యుల పదవులను వెంటనే భర్తీ చేసి వినియోగదారులకు మేలు చేయాలి.
- సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట
ఆ బాధ్యత ఇ.సి.దే
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఎన్నికల సంఘానికి బాధ్యత మరింతగా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కులమతాల ఆధారంగా వోట్లు అభ్యర్థించరాదన్న కోర్టు తీర్పును ఎన్నికల సంఘం (ఇ.సి) కఠినంగా అమలు చేయాలి. కులమతాలను నిత్యం ప్రస్తావించే నేతలు వౌనంగా ఉండగలరా? మైనారిటీ పదాన్ని నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి? కోర్టు తీర్పును ఉల్లంఘిస్తే అభ్యర్థులు అనర్హులవుతారు. అయినా, మన నేతాశ్రీలు దొడ్డిదారి మార్గాలు పడతారు. ఎన్నికల సంఘం సుప్రీం తీర్పును కఠినంగా అమలు చేస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం