సంపాదకీయం

‘పండిత’ పునరావాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి హృదయ సీమలలో ఆనందపు చిరుజల్లు కురవనుందట.. వారు స్వదేశంలోనే శరణార్థులు, దశాబ్దులుగా నిర్వాసితులు, మతోన్మాద జిహాదీ నిశాచర పీడితులు, తల్లులు ‘శిబిరాల’లో పురుడు పోసుకున్నారు, పిల్లలు ఆకాశపు నీడలందు ఆటలాడుకుంటున్నారు. వారు విధి వంచితులు.. కశ్మీరీ పండితులు! యుగయుగాలుగా కశ్మీరీ లోయ ప్రాంతంలో పరిఢవిల్లిన ఈ హిందూ జన సముదాయంలో అత్యధికులు 1947వ, 1948వ సంవత్సరాలలో తరిమివేతకు గురి అయ్యారు. మిగిలిన వారు 1989వ, 1990 సంవత్సరాలలో ఇళ్లను, పల్లెలను, పశువులను, పొలాలను, ఆస్తులను, అస్తిత్వాన్ని వదిలిపెట్టి ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. ఈ హిందువులను మళ్లీ స్వస్థలానికి చేర్చే కార్యక్రమం ఇన్నాళ్లుగా ఇనే్నళ్లుగా ఎండమావిలోని ఎలనీరు వలె ఊరిస్తూనే ఉంది! కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలు విద్రోహపు ఊబిలో కూరుకుని పోయి ఉన్నాయి. ‘పండితుల’ స్వస్థల పునరాగమాన్ని సహించలేని దేశవిద్రోహులు, పాకిస్తాన్ తొత్తులు, బీభత్సకారులు, బీభత్స కారులను సమర్ధిస్తున్నవారు ఈ పునరావాస పథకానికి ఆటంకాలను కల్పిస్తూనే ఉన్నారు. ఈ ఆటంకాలు తొలగిపోగలవన్న ఆశలు ఇప్పుడు మళ్లీ చిగురిస్తున్నాయి. కశ్మీరీ పండితులు తిరిగి ‘లోయ’ ప్రాంతంలో నివసించడానికి వీలుగా వారికి గృహవాటికలను నిర్మించాలన్న ప్రధానమంత్రి పథకం వాస్తవ రూపం ధరించడానికి రంగం సిద్ధవౌతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ పునరావాసం గురించి ప్రస్తావించిన ప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగాను, ప్రత్యక్షంగాను వ్యతిరేకించడం చరిత్ర. జమ్మూ కశ్మీర్‌లోని ప్రధాన ప్రాంతీయ రాజకీయ పక్షాలు-నేషనల్ కాన్ఫరెన్స్-ఎన్‌సి-పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ-పిడిపి-రెండూ పండితుల పునరాగమనాన్ని హర్షించలేకపోవడం ఇందుకు కారణం! ఇప్పుడు పిడిపి ఈ వ్యతిరేకతను ఉపసంహరించుకోవడం కశ్మీర్ చరిత్రలో మరో విప్లవం. జమ్మూ కశ్మీర్‌లో భారతీయ జనతాపార్టీతో కలిసి పిడిపి ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పిడిపి అధినేత్రి. పిడిపిలో ఈ పరివర్తనకు కారణం భాజపా సాహచర్యం, భాజపా ప్రభావం.
కశ్మీర్‌లోయ ప్రాంతంలోని పది జిల్లాల్లో ఎనిమిది చోట్ల కశ్మీరీ పండితుల కోసం ఇళ్ల సముదాయాలను నిర్మించనున్నారట! ఈ ఎనిమిది ప్రాంగణాల కోసం కశ్మీర్ ప్రభుత్వం వంద ఎకరాల భూమిని గుర్తించి సేకరిస్తోందట! ఆధికారికంగా నమోదైన మూడు లక్షల మందికి పైగా పండితుల గృహవసతి కోసం ఈ స్థలం చాలదు. అయినప్పటికీ పథకం అమలు జరగడం, ఆరంభం కావడం హర్షణీయం. ‘అల్పారంభం క్షేమకరం’ అయినప్పటికీ పదిశాతం నిర్వాసితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి కూడ ఈ వంద ఎకరాల స్థలం సరిపోదు. దాదాపు అరవై రెండు వేల నిర్వాసిత పండిత కుటుంబాల వారు ఆధికారికంగా నమోదై ఉన్నారట! అరవై రెండు వేల కుటుంబాలలో దాదాపు మూడు లక్షల మంది సభ్యులున్నారు. వీరిలో నలబయి వేల కుటుంబాలవారు జమ్మూ ప్రాంతపు శరణార్థ శిబిరాలలోను గుడారాలలోను నివసిస్తున్నారట! ఇరవై వేల కుటుంబాల వారు దేశ రాజధాని ప్రాంగణంలో బతుకులను ఈడ్చుకొస్తున్నారు. మరో రెండు వేల కుటుంబాల కశ్మీరీ పండితులు దేశమంతటా చెల్లా చెదురై ఉన్నారట! నమోదు కాని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో? ఏమయినప్పటికీ ఎనిమిది చోట్ల సగటున పనె్నండున్నర ఎకరాలలో ఎన్ని ఇళ్లు నిర్మాణం కాగలవు? అంతస్థుల భవనాలు నిర్మించినప్పటికీ ఒక్కొక్క చోట వంద కుటుంబాలకు మాత్రమే గృహవసతి లభించే అవకాశం. మొత్తం ఎనిమిది వందలు లేదా వెయ్యి కుటుంబాలకు మాత్రమే ఆరంభ దశలో పునరావాసం కలిగే అవకాశం ఉంది. మరిన్ని వందల లేదా వేల ఎకరాల భూమిని సేకరించి పండితులకు పునరావాసం కల్పించవలసి ఉంది.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలో భారతీయ జనతాపార్టీ 2014 మే ఇరవై ఆరున కేంద్ర ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన తరువాత కశ్మీరీ హిందువుల పునరావాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారట! అప్పుడు జమ్మూ కశ్మీర్‌లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వారు భూమిని సేకరించలేదు. ఆ తరువాత ఏర్పడిన భాజపా-పిడిపి ప్రభుత్వం కూడ భూమి సేకరణకు శ్రద్ధ వహించలేదు. రెండేళ్ల తరువాత ఇప్పుడు వందల ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. తగినంత భూమిని ఎప్పుడు సేకరిస్తారో మరి? జిహాదీల దురాగతాలకు బలై లోయ ప్రాంతాన్ని వదిలి వెళ్లినవారు లోయకు తిరిగి రావడానికి వీలుగా పట్టణ వాటికలను నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన. కనీసం నాలుగైదు వేల కుటుంబాల హిందువులు ఒకే చోట నివసించడం వల్ల భద్రతా భావం పెరుగుతుంది, పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదుల ప్రమాదానికి ప్రతిఘటన ఏర్పడుతుం ది. కానీ ఇలా పట్టణ వాటికలను ని ర్మించే కార్యక్రమాన్ని హు రియత్ వంటి పాకిస్తాన్ అనుకూల ముఠాలు వ్యతిరేకిస్తున్నాయి. జిహాదీ బీభత్సకారులను సమర్ధిస్తున్న విద్రోహులు వ్యతిరేకిస్తున్నారు, పిడిపి వంటి కశ్మీర్ రాజకీయ పక్షాలు సైతం పండితులకు పట్టణ వాటికలను నిర్మించరాదని బహిరంగంగానే ప్రకటించాయి. నిర్వాసితులైన పండితులు కశ్మీర్ లోయ ప్రాంతానికి తిరిగి రావడం వీరికి ఇష్టం లేదు. ఇప్పుడు భాజపా కశ్మీర్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఎనిమిది చోట్ల గృహవాటికలను నిర్మించే పథకానికి కదలిక ఏర్పడింది! కేంద్ర ప్రభుత్వం కూడ పండితుల ఇళ్లకోసం మరింత భారీగా నిధులను విడుదల చేయాలి. 2015 నవంబర్‌లో కేంద్రం కశ్మీర్ ప్రగతి కోసం ఎనబయి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. కానీ పండితుల పునరావాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇంతవరకు కేటాయించారట! ఎన్ని ఇళ్లు నిర్మించగలరు? ఆరు వేల మంది పండితులకు కశ్మీర్‌లోయ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పిస్తారట! ఇది ప్రధానమంత్రి ప్రత్యామ్నాయ ఉపాధి పథకం. ఇప్పుడు పదిహేడు వందల మందిని మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేశారట! మిగిలిన వేల కుటుంబాలు లోయలో ఉపాధి పొందడం ఎప్పటికో?
కశ్మీరీ పండితుల జీవన ప్రస్థానం దశాబ్దులుగా భయంకర విషాదగ్రస్తం! క్రీస్తుశకం పదునాలుగు శతాబ్ది వరకు కశ్మీర్ లోయ ప్రాంతంలోని ప్రజలు మొత్తం హిందువులే! మొత్తం లోయ ప్రాంతంలో కేవలం ఐదు వందల హిందూ కుటుంబాలు మిగిలి ఉండినట్టు పదిహేను ఏళ్ల క్రితం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు కారణం శతాబ్దుల తరబడి జిహాదీ మతోన్మాదులు సాగించిన మారణకాండ! జిహాదీలు హిందువులను సామూహికంగా హత్య చేశారు, మతం మార్చారు, మహిళలపై ఘోరమైన లైంగిక అత్యాచారాలు జరిపారు, హిందువులను తరిమివేశారు. ఫలితంగా 1947 నాటికి లోయ మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య ఇరవై శాతం కంటె తక్కువకు దిగజారింది. ఈ అవశేష హిందువులలో అత్యధికులను 1948 నాటికి జిహాదీలు నిర్మూలించారు,తరిమివేశారు. మిగిలిన పండితులను సైతం 1990వ, 1991వ సంవత్సరాలలో నిర్మూలించారు. ఈ చారిత్రక వ్యథకు ముగింపు ఎప్పుడో?