సంపాదకీయం

వ్యూహాత్మక మైత్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన అరవై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవాల్లో ‘ఐక్య ఆరబ్ సంస్థానాల’- యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్- యుఏఈ- ప్రభుత్వాధినేత- క్రౌన్ ప్రిన్స్- షేక్ మహమ్మద్ బిన్ జాయాద్ అల్ నహ్‌యాన్ ప్రధాన అతిథిగా పాల్గొనడం ఆ దేశంతో మనకు పెరుగుతున్న ‘వ్యూహాత్మక’ మైత్రికి సరికొత్త నేపథ్యం. చైనా ప్రభుత్వం పాకిస్తాన్‌కు రెండు యుద్ధనౌకలను సమర్పించడం ‘యుఏఈ’తో మన వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యం పెంచిన పరిణామం. పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవు భద్రత కోసమని చైనా ఈ యుద్ధనౌకలను తరలించినట్టు ఈ ఉభయ దేశాలు ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నప్పటికీ అరేబియా సముద్ర ప్రాంతాన్ని తన యుద్ధనౌకలకు విహార ప్రాంగణంగా మార్చడం చైనా అసలు వ్యూహం. మన దేశాన్ని పడమటి వైపునుంచి దిగ్బంధం చేయడం చైనా దీర్ఘకాల లక్ష్యం. ఈ నేపథ్యంలో ‘ఐక్య ఆరబ్ సంస్థానాల’ ప్రభుత్వం మన దేశానికి మరింత చేరువ కావడం మన ప్రభుత్వం సాధించగలిగిన మరో వ్యూహాత్మక విజయం. చిన్నదేశాలలో ఒకటైనప్పటికీ ‘యుఏఈ’ భౌగోళికంగా కీలకమైన ప్రదేశంలో నెలకొని ఉంది, ఆర్థికశక్తిగా ఎదిగి ఉంది. అందువల్ల మన దేశంతో ‘ఎమిరేట్స్’ స్నేహం పెరగడం పాకిస్తాన్-చైనాల ఉమ్మడి దురాక్రమణకు పటిష్ఠమైన ప్రతిఘటన! బంగాళాఖాతం తీర ప్రాంత దేశాలైన బంగ్లాదేశ్‌లోను, మయన్మార్‌లోను, హిందూ మహాసముద్రంలోని శ్రీలంక, మాల్దీవులలోను తన యుద్ధనౌకలను నెలకొల్పే కార్యక్రమాన్ని చైనా ప్రభుత్వం ఇదివరకే ఆరంభించింది. గ్వాడార్‌లో తిష్ట వేయడం ద్వారా చైనా ప్రభుత్వం మూడు సముద్రాల వైపునుంచి భారత్‌పై నిఘా వేసి ఉంచగలుగుతోంది. గ్వా డార్ ఓడరేవుకు సమీపంలోనే పర్షియా సిం ధుశాఖ తీరంలో ‘యు ఏఈ’ నెలకొని ఉంది. మరో అరేబియా సముద్ర తీరస్థ దేశమైన యెమన్ నుంచి, అఫ్ఘానిస్థాన్ నుంచి పలాయనం చిత్తగించిన తాలిబన్లు, అల్ ఖాయిదా జిహాదీ మూకలు తిష్టవేసి ఉన్నాయి. 2002-2003 సంవత్సరాల్లో అమెరికా ఆధ్వర్యంలోని ‘ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి’ దళాలు తాలిబన్, అల్ ఖాయిదా జిహాదీ మూకలను అఫ్ఘానిస్థాన్ నుంచి తరిమివేశాయి. పలాయనం చిత్తగించిన ఈ ‘మూకలు’ బంగ్లాదేశ్‌కు, మాల్దీవులకు పశ్చిమ దేశాలకు విస్తరించాయి. యెమన్ కేంద్రంగా ఈ బీభత్స ముష్కరుల విస్తృతి కొనసాగింది. తాలిబన్, అల్‌ఖాయిదా జిహాదీలకు యెమన్ ప్రధాన కేంద్రమైంది. అమెరికా, ఐరోపా దేశాలు యెమన్‌లో పదేపదే తమ రాయబార కార్యాలయాలను మూసివేయడానికి ఇదీ కారణం. యెమన్ సౌదీ అరేబియాకు ఆగ్నేయ దిశలోను, ‘యుఏఈ’ సౌదీ అరేబియాకు ఈశాన్య దిశలోను నెలకొని ఉన్న సమీప దేశాలు. యెమన్ ఉగ్రవాదులకు ఆలవాలమై ఉన్న నేపథ్యంలో మన దేశం, యుఏఈ ఉమ్మడిగా పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ హత్యాకాండను నిరసించడం ప్రాధాన్యం సంతరించుకొంది. మన గణతంత్ర దినోత్సవం నాడు ఉభయ దేశాల ప్రభుత్వాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో మతోన్మాద దేశాల జిహాదీ ఉగ్రవాదాన్ని తీవ్రంగా అభిశంసించాయి. పాకిస్తాన్ జిహాదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం.
పాకిస్తాన్ ప్రోత్సాహం వల్లనే యెమన్‌లో తిష్టవేసి ఉన్న తాలిబన్ తండాలకూ, సొమాలియా తీరంలోని ఓడదొంగలకు మధ్య అనుసంధానం ఏర్పడింది. ఈ అనుసంధానం కారణంగానే మన దేశంలోకి అరేబియా సముద్రం ప్రాంతం నుంచి జిహాదీ, మాదక ద్రవ్యాల విక్రేతలు చొరబడగలుగుతున్నారు. ఎర్రసముద్రం హిందూ మహాసముద్రంలో సంగమించే చోట యెమన్, సోమాలియా దేశాలు నెలకొని ఉన్నాయి. ఈ ఉభయ దేశాలకు మధ్య ఇరుకైన ఏడెన్ సింధుశాఖ మాత్రమే అడ్డుగా ఉంది. అందువల్ల సోమాలియా తీరంలోని ఓడదొంగలు, యెమన్‌లోని తాలిబన్లు కలసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ బీభత్స కూటమిని పాకిస్తాన్ ప్రభుత్వం విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ ఏర్పాటు చేసింది. ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ఉమ్మడి ముఠాలు మాల్దీవుల్లో సైతం చేరిపోయాయి. మాల్దీవుల్లో ఐదారేళ్లుగా మన దేశం పట్ల వ్యతిరేకత పెరుగుతుండడానికి ఇదీ కారణం. మరోవైపు ఓడదొంగలను అరికట్టే నెపంతో చైనా యుద్ధనౌకలు అరేబియా సముద్ర తీరంలో గస్తీ తిరుగుతున్నాయి. ఓడదొంగలను, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్, ఓడదొంగలను అరికట్టడానికి కృషి చేస్తున్నట్టు అభినయిస్తున్న చైనా అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు. పాక్‌లోని గ్వాడార్‌కు చైనా మరో రెండు యుద్ధనౌకలను పంపడం ఈ దుష్ట మైత్రీ వ్యూహంలో భాగం.
ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవును అభివృద్ధి చేసి ఆధునికంగా తీర్చిదిద్దే బాధ్యతను మన ప్రభుత్వం స్వీకరించడంతో తమ వ్యూహాత్మక దురాక్రమణకు ప్రతిఘటన మొదలైనట్టు పాక్, చైనాలు భావిస్తున్నాయి. అందువల్లనే చైనా రెండు యుద్ధనౌకలను గ్వాడార్‌కు తరలించింది. ఇరాన్‌లో చౌబహార్ ఓడరేవు, ‘యుఏఈ’దేశం గ్వాడార్‌కు సమీపంలోనే ఉన్నాయి. ‘యుఏఈ’ భారత్‌కు సన్నిహితం కావడంలో వ్యూహాత్మక ప్రాధాన్యం ఇదీ. చైనా వారి వ్యూహాత్మక దురాక్రమణకు మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రతిఘటనను ఆరంభించింది. ‘ఎమిరేట్స్’కు చెందిన నూట నలబయి తొమ్మిది మంది సైనికులు మన గణతంత్ర దినోత్సవ పథ సంచలన ప్రదర్శనలో పాల్గొనడం ఉభయ దే శాల మధ్య పెరుగుతు న్న సహకారానికి మరో నిదర్శనం. మన గణతంత్ర దినోత్సవ సైనిక విన్యాసాల్లో విదేశీయులను పా ల్గొనడానికి అనుమతించడం ఇది రెండవ సారి మా త్రమే. గత సంవత్సరం గణతంత్ర దినం వేడుకల్లో ఫ్రాన్స్ సైనిక విభాగం ఒకటి విన్యాసాలను ప్రదర్శించింది. ‘ఎమిరేట్స్’తో మన మైత్రి ఇలా ‘రక్షణ వ్యూహాత్మకం’గా రూపొందడం మన ప్రభుత్వ దౌత్య విజయం. పాక్- చైనాల కవ్వింపు చర్యలను, ప్రచ్ఛన్న యుద్ధాన్ని మనం వౌనంగా చూస్తూ చతికిలపడి ఉండే దశాబ్దుల వైఫల్యానికి పూర్తి భిన్నంగా ప్రస్తుతం మన ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఈ కొత్త వైదేశిక నీతి రొద లేని విప్లవం. 1990వ దశకంలో పాకిస్తాన్, సౌదీ అరేబియాలతో కలసి తాలిబన్‌లను సమర్ధించిన ‘యుఏఈ’ విధానంలో సైతం ఇది విప్లవాత్మమైన పరివర్తనకు చిహ్నం. తాలిబన్లు ‘యుఏఈ’కి వ్యతిరేకంగా బీభత్సకాండను జరుపుతున్నారు. అఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌లొ ఐదుగురు ‘యుఏఈ’ దౌత్య అధికారులను పాక్ ప్రేరిత జిహాదీ దుండగులు మట్టుపెట్టారు. యుఏఈ ‘క్రౌన్ ప్రిన్స్’ మహమ్మద్ బిన్ అల్ నహ్‌యాన్ మన ప్రభుత్వంతో గళం కలిపి ఉగ్రవాదాన్ని తీవ్రంగా నిరసించడానికి ఇదంతా పూర్వరంగం.
‘యుఏఈ’ క్రౌన్ ప్రిన్స్ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య కుదిరిన పదునాలుగు ఒప్పందాలన్నింటికీ ప్రధాన ఇతివృత్తం వ్యూహాత్మక సహకారం. ఆ దేశం నుంచి మనదేశానికి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నట్లు కూడా ప్రచారవౌతోంది. ద్వైపాక్షిక వాణిజ్యం 2020 నాటికి అరవై శాతం పెరగనున్నదట. కానీ, ఈ ఆర్థిక బంధం కంటే బీభత్సకాండకు వ్యతిరేకంగా మనతో సహకరించడానికి మరో పశ్చిమాసియా ప్రాంత దేశం ముందుకు రావడం అద్భుత పరిణామం. మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక క్రియాశీలతకు తార్కాణం.