సంపాదకీయం

భాషల మీమాంస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రీయ ఉన్నత విద్యామండలి- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సిబిఎస్‌ఇ- వారు అమలు జరుపతలపెట్టిన ‘నూతన త్రిభాషా బోధన’ విధానం 2020 వరకూ వేచి ఉండాలట! 2014 మే నెలలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని భాజపా ప్రభుత్వం పాలనా బాధ్యతలు స్వీకరించాక విద్యారంగంలో తలపెట్టిన మార్పులలో ఈ ‘త్రిభాషా బోధన’ ప్రధానమైనది. విదేశీయ భాషల స్థానంలో స్వదేశీయ భాషలను ప్రవేశపెట్టడం, సంస్కృత భాషాబోధనకు మరింత ప్రాధాన్యం కల్పించడం, పదవ తరగతి స్థాయిలో పరీక్షలను పునరుద్ధరించడం వంటివి జరుగనున్న మార్పులు. అయితే, పదవ తరగతికి పరీక్షల పునరుద్ధరణ మాత్రమే 2017-2018 విద్యాసంవత్సరంలో అమలు కానున్నదట. నూతన త్రిభాషా బోధన మాత్రం 2019-2020 వరకూ ఆచరణలోకి రాదట. ఈలోగా 2019లో లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. అంటే భాజపా ప్రభుత్వం విద్యారంగంలో తలపెట్టదలచిన భాషాపరమైన మార్పుల అమలు 2019లో ఏర్పడే కొత్త ప్రభుత్వం వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఆ కొత్త ప్రభుత్వం కూడా భా జపా నాయకత్వంలోనే ఏర్పడగలదన్నది ఈ ‘్భషా బోధన ప్రణాళిక’ వాయిదా పడడానికి ప్రా తిపదిక! కేంద్రీయ వి ద్యాలయాలోను, కేంద్రీయ ఉన్నత విద్యా మండలి- సిబిఎస్‌ఇ- పాఠ్య ప్రణాళికను బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలోను విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ రెండు భాషలను నేర్చుకుంటున్నారు. వాటిలో ఒక విదేశీయమైన ఆంగ్లం. రెండవది రాజ్యాంగంలోని ‘ఎనిమిదవ అనుబంధం’లో పేర్కొన్న భారతీయ భాష ఒకటి. ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకూ మరో భారతీయ భాషను కూడా కేంద్రీయ విద్యాలయాలలోను, సిబిఎస్‌ఇ ప్రణాళిక ఉన్న పాఠశాలల్లోను నేర్పుతున్నారు. ఈ భారతీయ భాష స్థానంలో విదేశీయ భాషను కూడ విద్యార్థులు నేర్చుకునే అవకాశం ప్రస్తుతం ఉంది. అందువల్ల అధికాధిక విద్యార్థులు ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకూ మూడవ భాషగా విదేశీయ భాషను నేర్చుకుంటున్నారు. అంటే ఇంగ్లీషు, మరో విదేశీయ భాష, ఒక భారతీయ భాషను నేర్చుకునే విద్యార్థుల సంఖ్య ఈ ‘కేంద్ర’ పాఠశాలల్లో ఎక్కువగా ఉంది. సంస్కృత భాషకు జర్మనీయ భాషకు మధ్య గత ఏడాది ఈ బోధన పోరాటానికి ఈ త్రిభాషా సూత్రం- ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతి కారణం.
సిబిఎస్‌ఇ వారి కొత్త ‘త్రిభాషా బోధన’ ప్రణాళిక వల్ల కలిగే ప్రధానమైన మార్పులు రెండట. ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకూ మాత్రమే గాక, ఐదు నుంచి పదవ తరగతి వరకూ కూడ మూడు భాషలను బోధించాలన్నది కొత్త ప్రతిపాదిత ప్రణాళిక! దీనివల్ల విద్యార్థులకు భాషా పటిమ, నైతిక జీవన నిష్ఠ పెరుగుతాయి! ఎందుకంటే భాష సాంస్కృతిక నిష్ఠను పెంపొందించే మార్గం. భౌతిక శాస్త్రాలు, గణితం విజ్ఞానాన్ని కలిగిస్తాయి. రాజకీయ, ఆర్థిక శాస్త్రాలు కూడ భౌతిక జీవనం సుఖమయ్యే పద్ధతులను గురించి వివరిస్తున్నాయి. వీటివల్ల విద్యార్థులు విజ్ఞానవంతులు అవుతున్నారు. కానీ విజ్ఞానం సౌశీల్యంతో జతకూడినప్పుడు మాత్రమే విద్యార్థులు ఉత్తమపౌరులు కాగలరు. చరిత్ర అధ్యయనం వల్ల సౌశీల్య స్ఫురణ కలుగుతుంది. ఈ స్ఫురణ విద్యార్ధినీ విద్యార్థుల స్వభావంగా మారడానికి భాషల మాధ్యమంగా వారికి అలవడే సాహిత్యం దోహదం చేస్తోంది. అందువల్ల ఆవిర్భావ దశ- టీనేజ్-లో ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు భాషా సాహిత్యాలను బోధించడం వల్ల దీర్ఘకాల ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఎనిమిదవ తరగతి వరకూ మాత్రమే నేర్చుకుంటున్న మూడవ భాషను పనె్నండవ తరగతి వరకూ నేర్పడం వల్ల విద్యార్థులు సౌశీల్యంతో వికసించి అవినీతి అంటని పౌరులుగా పరిమళించడానికి మరింత వీలుకలుగుతుంది.
కేంద్రీయ ఉన్నత విద్యామండలి వారి నూతన త్రిభాషా ప్రణాళిక అభిలషణీయం. రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన పాఠ్య ప్రణాళికల్లో ఈ నూతన త్రిభాషాసూత్రం దశాబ్దులుగా నిహితమై ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని పాటించడానికి రంగం సిద్ధం చేయడం ముదావహం. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి వరకూ మూడు భాషలను బోధిస్తున్నారు. అలాంటప్పుడు ‘కేంద్ర’ పాఠశాలల్లో చదువుకొనే వారు మాత్రం ఎందుకని పదవ తరగతి వరకూ మూడు భాషలను నేర్చుకొనరాదు? అన్న సందేహం కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులకు, కేంద్రీయ ఉన్నత విద్యామండలి వారికి ఇప్పటికైనా కలిగింది, సమాధానం కూడా లభించింది. దేశమంతటా ఇంటర్మీడియ ట్ స్థాయి వరకూ, కేం ద్రీయ విద్యాలయాల్లో పనె్నండవ తరగతి వ రకూ మూడు భాషలను మప్పేందుకు ఇ ప్పుడైనా ప్రయత్నం జరగాలి. పదవ తరగతి వరకూ మూడు భాషలను బో ధించాలన్న ‘కేంద్ర’ వి ద్యా పథకంలోని మరో అంశం ఈ మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు కావడం. దీనివల్ల విద్యార్థులు ఐదు నుంచి పదవ తరగతి వరకూ మాతృభాషను, మరో భారతీయ భాషను లేదా రెండు భారతీయ భాషలను విధిగా నేర్చుకొనడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకూ ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకూ ఇంగ్లీష్‌ను అధ్యయనం చేస్తున్న విద్యార్థులు సహజంగానే ఆంగ్లేయ పద్ధతులకు అలవాటు పడుతున్నారు. అదనంగా ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకూ, మళ్లీ పదకొండవ, పనె్నండవ తరగతుల్లోను మరో విదేశీ భాషను కూడ నేర్చుకోవడానికి వీలుంది. విదేశీయ భాషను నేర్చుకున్నట్టయితే విదేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చునన్న లాలసతో అలా నేర్చుకుంటున్న వారికి మనదేశం పట్ల అవగాహన త గ్గుతుంది. నూతన త్రిభాషా సూత్రం దీనికి విరుగుడు. రెండు భారతీయ భాషలను విధిగా నేర్చుకోవాలి.
మంచిదైన ఈ ప్రణాళికను రూపొందించడానికి ఈ ప్రభుత్వానికి రెండున్నర ఏళ్లకు పైగా పట్టింది. ఇప్పుడైనా వెంటనే ఎందుకు అమలు జరుపరాదు? 2017 జూన్‌లో తొమ్మిదవ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు ప్రస్తుతం వలే రెండు కాక మూడు భాషలను అధ్యయనం చేయాలన్న నిబంధనను వెంటనే ఎందుకు విధించరాదు? ఎలాగూ వారు ఎనిమిదవ తరగతి వరకః మూడు భాషలను చదివి ఉన్నారు. కానీ 2019- 2020 వరకూ ఎందుకని వాయిదా వేస్తున్నట్టు? ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులు భారతీయ భాషలను చదవకపోవడం మన దేశంలో నెలకొన్న మరో వైపరీత్యం! బిఎ, బిఎస్సీ వంటి డిగ్రీ తరగతుల విద్యార్థులు రెండేళ్ల పాటు భారతీయ భాషలను చదువుతున్నారు. ఇదే సూత్రాన్ని ‘వృత్తి విద్యార్థుల’కు ఎందుకని వర్తింప చేయరాదు? బ్రిటన్ దొరలు మనదేశంపై పెత్తనం మొదలుపెట్టేవరకూ మన దేశంలో సంస్కృతం ఉన్నత విద్యాబోధన మాధ్యమం, అనుసంధాన భాష, పాలనాభాష. కానీ, బ్రిటన్ దురాక్రమణదారులు సంస్కృత భాషలో జరిగిన అన్ని కలాపాలను ఆంగ్లభాషకు అప్పగించారు. స్వతంత్రం వచ్చాక ఆంగ్లంలో జరుగుతున్న కలాపాలకు మళ్లీ సంస్కృత భాషను ఉపయోగించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించారు. ఈ సూచనను పాటించడం ఇప్పుడైనా ప్రారంభించవచ్చు.