సబ్ ఫీచర్

క్షయ వ్యాధికి ‘డాట్స్’ చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాణాంతక సమస్య ‘క్షయ’. ఈ వ్యాధి ముఖ్యంగా మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా వ్యాపిస్తుంది. ఇది స్ర్తిపురుష తారతమ్యం లేకుండా, ఏ వయసులో వారికైనా రావచ్చు. ఇది శరీరంలో (తల వెంట్రుకలు, గోళ్లు తప్ప) రక్తప్రసరణ ఉన్న ఏ భాగానికైనా రావచ్చు. క్షయ క్రిమికి ఆక్సిజన్ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. దీన్ని శ్వాసకోశ క్షయ అంటారు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్నచోట్లలో, మురికివాడల్లో నివసించే వారిలో ఇది అధికంగా ఉంటుందని పరిశీలనలో వెల్లడైంది. ఈ క్రిమిని 1882, మార్చి 24న జర్మనీకి చెందిన రాబర్ట్ కాక్ అనే శాస్తవ్రేత్త కనుగొన్నాడు.
ప్రపంచంలో ఐదోవంతు క్షయ కేసులు మనదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజు భారత్‌లో 5వేల మంది క్షయవ్యాధికి గురవుతున్నారు. సంవత్సరానికి 18 లక్షలమందికి క్షయ సోకుతోంది. ప్రస్తుతం మనదేశంలో 34 లక్షలమంది క్షయవ్యాధి పీడితులున్నారు. దేశంలో ప్రతి మూడు నిముషాలకు ఇద్దరు, సగటున రోజుకు 1500 మంది, సంవత్సరానికి ఐదు లక్షలమంది క్షయవ్యాధి కారణంగా మరణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 15 నిముషాలకు ఒక క్షయ రోగి మరణిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1.08 లక్షలమంది క్షయవ్యాధిగ్రస్తులున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షలమంది కేవలం క్షయ కారణంగానే అసువులు కోల్పోతున్నారు.
రెండువారాలకు మించి ఎడతెరిపిలేని దగ్గు, సాయంత్రంపూట జ్వరం రావడం, ఆకలి తగ్గడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం, కళ్లె (తెమడ) పడటం, ఆయాసం, త్వరగా అలసిపోవడం, రాత్రిపూట బాగా చెమటలు పట్టడం, నిద్ర పట్టకపోవడం, రోగి అస్థిపంజరంగా మారడం మొదలైనవి. అయితే క్షయక్రిమి శరీరంలో ప్రవేశించిన వెంటనే వ్యాధిరూపం దాల్చదు. సుమారు 95 శాతం మందిలో రోగ నిరోధక వ్యవస్థ దీనిపై సమర్థంగా పోరాడి రాకుండా అడ్డుకుంటుంది. ఓ ఐదు శాతం మందిలో మాత్రం రూపాంతరం చెందుతుంది. కొందరిలో ఈ క్రిమి నిద్రాణంగా ఉండిపోయి వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీన పడినప్పుడు విజృంభిస్తుంటుంది. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ఎవరికైనా క్షయ సోకిందేమోనన్న అనుమానం ఉన్నవారికి డిఎంసిల ద్వారా మన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోను, వైద్యకళాశాలల్లోను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోను కళ్లె రెండుసార్లు (అక్కడికక్కడే ఒకసారి, మరుసటిరోజు ఉదయం రెండోసారి) ఛాతీ ఎక్స్‌రేపరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు.
క్షయ తీవ్రమైన అంటువ్యాధి. రోగి దగ్గినప్పుడు, ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు, క్షయ రోగ క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లుగా వదలడం వల్ల ఇవి తేలిగ్గా ఆరోగ్యవంతుల శరీరాల్లోకి శ్వాసపీల్చినప్పుడు ప్రవేశిస్తాయి. ఒక రోగి ఏడాదిలో 10 నుంచి 15 మందికి క్షయ వ్యాధిని వ్యాపింపజేయగలుగుతాడు. కాబట్టి క్షయ రోగులు దగ్గేటప్పుడు నోటికి దట్టమైన బట్టను అడ్డుగా పెట్టుకోవాలి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో 50 నుంచి 60 శాతం మంది క్షయ వ్యాధికి గురవుతున్నారు. వీరి ఆయుఃప్రమాణం కూడా గణనీయంగా తగ్గిపోతుంది.
క్షయను నియంత్రించడానికి ఇప్పుడు ‘డాట్( (డైరెక్ట్‌లీ అబ్జర్వ్‌డ్ ట్రీట్‌మెంట్, షార్ట్‌కోర్స్-కీమోథెరపీ) అనే స్వల్పకాలిక చికిత్స అందుబాటులో ఉంది. ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు మున్నగువారు మారుమూల గ్రామాల్లోని రోగులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వ్యాధి దశను బట్టి 6/7 నుండి 8/9 నెలలు చికిత్సకు అవసరమైన నాణ్యమైన డాట్ మందులు రోగులకు ఇస్తారు. వ్యాధి పూర్తిగా నయమయ్యేలా చూడటం ఈ విధానంలో ప్రత్యేకత.

-పాకెర్ల బాబు డేవిడ్