సంపాదకీయం

న్యాయమూర్తి ‘్ధక్కారం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగ ప్రక్రియను పరిరక్షించి పరిపోషించవలసిన ఉన్నత న్యాయమూర్తులు కొందరు రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తనకు ఒడిగడుతున్నారన్నది ధ్రువపడిన వాస్తవం. కలకత్తా ఉన్నత న్యాయమూర్తి చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ అనేక నెలలుగా ఇలా రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తనకు ఒడిగడుతున్నాడన్నది సర్వోన్నత న్యాయస్థానం గుర్తించిన అభియోగం! అభియోగానికి గురి అవుతున్న ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులను శిక్షించడం పార్లమెంటు అభిశంసన ద్వారా మాత్రమే సాధ్యమన్నది రాజ్యాంగంలోని 124వ, 217వ అధికరణాల స్ఫూర్తి. అయితే న్యాయ ధిక్కారానికి ఒడిగట్టిన ఉన్నత న్యాయమూర్తులను విచారించి శిక్షించే అధికారం సైతం సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్నట్టు ఇపుడు స్పష్టమైపోయింది. న్యాయధిక్కారం అభియోగంపై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిని విచారించాలన్నది ఫిబ్రవరి ఏడవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం చేసిన నిర్ధారణ. ఈ నిర్ధారణ మేరకు సర్వోన్నత న్యాయస్థానం వారు న్యాయమూర్తి కర్ణన్‌కు న్యాయధిక్కార అభియోగానికి సమాధానం చెప్పాలన్న ఆదేశాన్ని పంపించారు. ఫిబ్రవరి పదమూడవ తేదీ తమ ఎదుట హాజరై సమాధానం చెప్పాలని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్‌తో కూడిన ధర్మాసనం ఎనిమిదవ తేదీన న్యాయమూర్తి కర్ణన్‌ను ఆదేశించింది. కర్ణన్ పదమూడవ తేదీన హాజరవుతాడా? అన్నది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశం. ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఒకరు సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఎదుట నిందితుడిగా నిలబడవలసి రావడం ఇదే మొదటిసారి!
కర్ణన్ దోషి అని ధ్రువపడినట్టయితే ఆయనకు ఎలాంటి శిక్షను విధించాలన్నది రాజ్యాంగ ధర్మాసనం నిర్ధారించవలసి వుంది. అభూతపూర్వకమైన ఇలాంటి అభియోగాన్ని విచారిస్తున్న ధర్మాసనం సైతం ఈ విషయమై సందేహాలను వ్యక్తం చేసింది. ఈ సందేహ నివృత్తికి సహకరించాలని వరిష్ట న్యాయవాదులను న్యాయమూర్తులు కోరడం కూడ ప్రాధాన్యం సంతరించుకున్న అంశం. ‘‘... చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి వుంది. మీ అభిప్రాయాలను కోరుతున్నాము. న్యాయమూర్తి కర్ణన్- సమాధానాన్ని కూడ వినవలసి ఉంది. కార్యకారణ సంబంధ సూత్రం ప్రాతిపదికగా ప్రతి అంశాన్ని నిర్ధారించవలసి ఉంది. మేము ఏమి చేయాలి? ఏమి చేయకూడదు...?? శిక్షకు గురి అయితే ఆయన పదవిలో కొనసాగాలా? పదవీచ్యుతుడు కావాలా??’’2అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేహర్ వరిష్ట న్యాయవాదుల నుద్దేశించి వ్యాఖ్యానించడం కూడ అభూతపూర్వకమైన పరిణామం. న్యాయధిక్కార అభియోగం ధ్రువపడినట్టయితే కర్ణన్‌ను పదవి నుంచి తొలగించడమే ఏకైక ప్రత్యామ్నాయమా? లేక తక్కువ శిక్షను విధిస్తారా? తక్కువ శిక్షను విధించడానికికాని, ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులను సుప్రీంకోర్టు శిక్షించడానికి కాని ఎలాంటి రాజ్యాంగ నిబంధనలు లేవు! ఎందుకంటే ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులు పదవులలో వున్నవారు నైతిక నిష్ఠతో రాజ్యాంగ నిబద్ధతతో న్యాయపాలన సాగిస్తారన్నది రాజ్యాంగ నిర్మాతల విశ్వాసం. కానీ అన్ని రంగాలకు వ్యాపిస్తున్నట్టే అవినీతి చెదలు, అసమర్థత, రాజ్యాంగ నిబద్ధతా రాహిత్యం న్యాయవ్యవ్థను కూడా ఆవహించడం నడుస్తున్న చరిత్ర.
చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్‌కు 2016 ఫిబ్రవరిలో మదరాసు హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టునకు బదలీ అయింది. సర్వోన్నత న్యాయస్థానం వరణ మండలి- కాలేజియమ్- నిర్ణయం మేరకు జరిపిన తన బదిలీని కర్ణన్ తానే ఆపివేశాడు. తనతో సంప్రదించకుండా తనను బదిలీ చేయడం చెల్లదనీ ఆయన నిర్ధారించాడు- న్యాయపాలన సౌలభ్యం కోసం మాత్రమే మెరుగైన రీతిలో న్యాయ ప్రక్రియను నిర్వహించడంలో భాగంగానే కర్ణన్‌ను బదిలీ చేసినట్టు స్పష్టీకరించిన అప్పటి సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిని కర్ణన్ వెక్కిరించాడు అంతకుముందు. ఆ తరువాత కూడ కర్ణన్ మదరాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగాను, ఇతర న్యాయమూర్తులకు వ్యతిరేకంగాను బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం చరిత్ర. ఈ దేశంలో పుట్టడంవల్ల తనకు అన్యాయం జరిగిపోతోందని, ఇక్కడ పుట్టడం తన దౌర్భాగ్యమని కర్ణన్ మాతృభూమిని సైతం నిందించి విస్మయపరచడం వేరే సంగతి. రాజ్యాంగంలోని రెండువందల ఇరవై రెండవ అధికరణం మేరకు 3సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తరువాత రాష్టప్రతి ఒక ఉన్నత న్యాయమూర్తిని మరో హైకోర్టునకు బదిలీ చేయవచ్చు..2కానీ కర్ణన్ తనతో సంప్రదించాలని బహిరంగంగా కోరి, రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను ధిక్కరించాడు. తరువాత కలకత్తాకు బదిలీ కావడం తప్పనిసరి అని తెలుసుకున్న తరువాత మనసు మార్చుకున్నాడు, కలకత్తా కోర్టునకు వెళ్లాడు! ఆయన కలకత్తా హైకోర్టుకు వెళ్లడం తప్పదని బదిలీ ఉత్తర్వు తరువాత ఆయనకు ఎలాంటి పనిని కేటాయించకపోవడం ద్వారా మదరాసు ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేయడం కర్ణన్ అప్పుడు మనసు మార్చుకొనడానికి కారణం...
న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ నిష్పక్షంగాను, నిర్భయంగాను, స్వతంత్రంగాను, నైతిక నిబద్ధతతోను రాజ్యాంగ నిష్ఠతోను పనిచేయడానికి ఏర్పడిన నిబంధనలు కాలక్రమంలో అవినీతికి ఒడిగట్టిన న్యాయమూర్తులను, రాజ్యాంగానికి ఎదురుతిరుగుతున్న న్యాయమూర్తులను శిక్షించడానికి అడ్డుగా నిలబడడం విచిత్రమైన పరిణామం! ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులను తొలగించే అధికారం మంత్రివర్గం సలహాపై పనిచేసే రాష్టప్రతికి లేదు. మంత్రివర్గంలో ఉండేది రాజకీయ వాదులు. అందువల్ల రాజకీయ కారణాలతో రాజకీయ ప్రయోజనాల సాధనకోసం మంత్రివర్గం నిజాయితీపరులైన న్యాయమూర్తులను తొలగించవలసిందిగా రాష్టప్రతికి సలహా ఇవ్వవచ్చు! అందువల్లనే ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులను పార్లమెంటు ఉభయసభలు అభిశంసించిన తరువాత మాత్రమే రాష్టప్రతి వారిని పదవి నుంచి తొలగించగలడన్న నిబంధనను రాజ్యాంగంలో విధించారు. రాజ్యాంగంలోని 124వ అధికరణ మేరకు అవినీతికి పాల్పడిన అసమర్ధులైన సర్వోన్నత న్యాయమూర్తులను పార్లమెంటు అభిశంసించగలదు. ఉభయసభలు మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతుతో విడివిడిగా తీర్మానాలను ఆమోదించి అభియోగగ్రస్తులైన న్యాయమూర్తులను అభిశంసించాలి. 217వ అధికరణం మేరకు హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసనకు కూడా ఇదే పద్ధతి! అభిశంసనకు పూర్వం పార్లమెంటు సభ్యుల ఉమ్మడి 3కమిటీ2 అభియోగాన్ని విచారించి నిజానిజాలను నిగ్గు తేల్చాలి! అభిశంసన తరువాత రాష్టప్రతి అభియోగగ్రస్తులను పదవినుంచి తొలగించవచ్చు! కానీ ఈ నిబంధన ఇటీవలి కాలంలో సౌమిత్రసేన్, పడి దినకరన్ వంటి అవినీతిగ్రస్త న్యాయమూర్తులు అనేక ఏళ్లతరబడి పదవులను వదలకుండా మొండికెత్తడానికి కూడా ఉపయోగపడింది. ఇప్పుడు కర్ణన్ ధీమాకు కారణం కూడ ఈ నిబంధన మాత్రమే! సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి కర్ణన్‌కు న్యాయపాలన విధులను కేటాయించరాదని నిర్దేశించాడు. అంతకుమించిన చర్యను తీసుకోవచ్చునా? అన్నది సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం ఇప్పుడు నిర్ధారించనుంది...