సంపాదకీయం

అమ్మకు అర్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమాతుః పర దైవతమ్ - అన్నది సనాతన జాతీయ సంస్కృతికి వౌలికమైన ప్రాతిపదిక. తల్లిని మించిన పరమ దేవత లేదు. పరమ దేవుడు లేడు. మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః - తల్లి భూమి, నేను ఆమెకు బిడ్డను - అన్న వేద భూమికపై సృష్ట్యాది మన జాతీయత వికసించింది, అనంతంగా వికసిస్తూనే ఉంటుంది. అందువల్లనే మన భరతజాతి లేదా హైందవజాతి సనాతన జాతి అయింది. సనాతనం2అని అంటే ఆది, ఆంతము లేనిదని అర్థం! అందువల్ల సనాతన తత్త్వం గతంలోను, వర్తమానంలోను, భవిష్యత్తులోను సృష్టి మొత్తానికి అన్వయం అవుతోంది. కానీ సృష్టిగత వాస్తవాన్ని తత్త్వాన్ని తమ జీవన వ్యవహారానికి వర్తింప చేసుకున్న హిందువులు లేదా భారతీయులు మాత్రమే అనాదిగా తమది సనాతన జాతి అని, తమది సనాతన సంస్కృతి అని భావిస్తున్నారు. ఈ వాస్తవాన్ని సనాతన-శాశ్వత-ఎటర్నల్ తత్త్వాన్ని గ్రహించని, గ్రహించలేని అనేక విదేశీయ జాతులవారు భూమిని తల్లిగా భావించడం లేదు, తల్లిని పరమ దైవీమూర్తిగా అనుభూతి చెందడంలేదు. కానీ ఇలాంటి సనాతన భారత భూమిలో మహిళ అవమానాలకు గురి అవుతోంది, అత్యాచారాలకు గురి అవుతోంది! ఇదీ వర్తమాన వైపరీత్యం! భారతీయతను శతాబ్దుల పాటు విదేశీయ భౌతిక దురాక్రమణ దిగమింగడం ఈ వర్తమాన వైపరీత్యానికి కారణం! భౌతిక దురాక్రమణ తొలగిపోయినప్పటికీ బౌద్ధిక దురాక్రమణ కొనసాగుతూనే ఉంది. ఫలితంగా మన దేశంలోని అధికాధికులు విదేశీయ భావదాస్యగ్రస్తులై ఉన్నారు. పురుషాధిక్య భ్రాంతి తొలగని వారు మాతృమూర్తిని కించపరుస్తున్నారు. భూమిని తవ్విపారేస్తున్నారు, హరిత నేలపై కాలుష్యపు కన్నాలను పెడుతున్నారు. భారతీయత తన భౌతిక స్వరూపాన్ని బౌద్ధిక స్వభావాన్ని పునరుద్ధరించుకొనకుండా 3ప్రపంచీకరణ2 వాణిజ్య నాగరికత అడ్డుపడుతుండడం పరాకాష్ట! విజయవాడలో ఆదివారం ముగిసిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సునకు ఈ వర్తమాన దుస్థితి నేపథ్యం.
మహిళలకు చట్టసభలలో మూడవ వంతు స్థానాలను కల్పించకపోవడంపట్ల లోకసభ స్పీకర్ సుమిత్రామహాజన్ ఆందోళనను వెలుబుచ్చడం మహిళా పార్లమెంటు2సదస్సులో జరిగిన ప్రధాన పరిణామం. మహిళా సాధికారకతలో భాగంగా ఇలా చట్టసభలలో మహిళలకు ముప్పయి మూడు శాతం ఆరక్షణలు- రిజర్వేషన్స్ -కల్పించాలన్న ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఎండమావిలోని తీయటి నీటివలె శాసన ఆరక్షణలు మహిళలను దశాబ్దులుగా ఊరిస్తునే ఉన్నాయి. ఇలా మహిళలకు రిజర్వేషన్లను కల్పించడం దయతో బిచ్చం పెట్టడం వంటిది కారాదని సుమిత్రా మహాజన్ మహిళా పార్లమెంటు సదస్సులో స్పష్టం చేసి వెళ్లడం పురుష పుంగవులకు గుణపాఠం వంటిది. మహిళలకు వారి పట్ల పురుషుల గౌరవ సూచకంగా మాత్రమే చట్టసభలలో రిజర్వేషన్లను కల్పించాలన్నది లోక్‌సభాధ్యక్షురాలి నిర్ధారణ. ఈ నిర్ధారణ తరతరాల భారతీయ సంప్రదాయానికి అనుగుణమైంది. పురుషునికంటె మహిళ అన్ని విషయాలలోను గొప్ప కావడం భారతీయ సంప్రదాయం. నిజానికి మూడవ వంతు మాత్రమే కాక, మహిళలకు చట్టసభలలో మాత్రమేకాక అన్ని జీవన రంగాలలోను సమానమైన వాటా లభించినపుడే సమాజంలో సమతుల్య స్థితి నెలకొంటుంది. కానీ నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత అరవై ఏడు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మహిళలకు పార్లమెంటులోను, శాసనసభలలోను సమానమైన వాటా కాదుకదా పాతిక శాతం స్థానాలు సైతం దక్కిన చరిత్ర లేదు. రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న మహిళా వ్యతిరేక వివక్షకు ఈ రిజర్వేషన్ల లేమి ఉదాహరణ మాత్రమే! సుమిత్రా మహాజన్ విజయవాడ సదస్సులో చేసిన ప్రసంగంలో ఈ వైపరీత్యంపట్ల తీవ్ర నిరసన ధ్వనించింది!
మన రాజ్యాంగ నిర్మాతలు 1940వ దశకం చివరిలోనే, రాజ్యాంగ రచనా ప్రక్రియ కొనసాగిన కాలంలోనే మహిళలకు పార్లమెంటులోను చట్టసభలలోను సగం స్థానాలు లభించి తీరాలని నిర్దేశించి ఉండాలి! ఎందుకంటే గృహ జీవన శకటానికి, సమాజ జీవన రథానికి మహిళ, పురుషుడు రెండు సమాన చక్రాలు! అందువల్ల కుటుంబంలోను సమాజంలోను పురుషులకు మహిళలకు గుణాత్మకంగా పరిమాణాత్మకంగా సమానత్వం ఏర్పడడం న్యాయం! సృష్టిలో ఇలా సమానత్వం నిహితమై ఉంది! అందువల్ల కేవలం చట్టసభలకు మాత్రమే కాక అన్ని ఉద్యోగ, ఉపాధి విద్యా, సమాజ, సాంస్కృతిక రంగాలలోను మహిళలకు సగం స్థానాలు దక్కినపుడు మాత్రమే నిజమైన మహిళా అధికారం సాకారం అవుతుంది. షెడ్యూల్డు కులాల వారికి, షెడ్యూల్డు తెగలవారికి కల్పించిన రీతిలోనే రాజ్యాంగంలో మహిళలకు 1950లోనే ఆరక్షణలు కల్పించి ఉండాలి! కల్పించకపోవడం వైపరీత్యం. రాజ్యాంగ నిర్మాతలకు తోచలేదు. అందువల్ల చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆందోళన మొదలైంది. కానీ రెండు దశాబ్దులుగా ఇందుకోసం రాజ్యాంగ సవరణ జరగకపోవడం మహిళలకు జరుగుతున్న అన్యాయం, కొనసాగుతున్న అపచారం! భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు మరికొన్ని ప్రధాన పక్షాలు ఈ రిజర్వేషన్లను సమర్థిస్తున్నప్పటికీ అతి కొద్దిమంది రాజకీయ వేత్తల వ్యతిరేకతవల్ల ఈ 3మహిళా సాధికార యజ్ఞం2 కొడిగట్టి ఉండడం సుమిత్ర మహాజన్ ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు మరోసారి గుర్తుకు వచ్చింది! గతంలో రాజ్యసభలో ఈ మహిళా సాధికార బిల్లు ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో బిల్లు గట్టెక్కలేదు. లోక్‌సభాధ్యక్షురాలి ప్రసంగ స్ఫూర్తితోనైనా 3బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలి! సదస్సులో ప్రసంగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి ఎమ్ వెంకయ్యనాయుడు తదితరుల ప్రసంగాలలో సైతం మహిళలకు జరిగిపోతున్న అన్యాయాలట్ల తీవ్ర నిరసన ధ్వనించడం సాధికారం2 పట్ల ఉద్ధృమవుతున్న ధ్యాసకు నిదర్శనం!
3తల్లికి వందనం2 అన్న కార్యక్రమాన్ని పాఠశాలల్లో, కళాశాలలలో ప్రారంభిస్తున్నట్లు 3జాతీయ మహిళా పార్లమెంట్2సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం సందర్భ శుద్ధికి నిదర్శనం. విద్యాలయాలలో ప్రతి సంవత్సరం ఒకరోజున మాతృవందనం2కార్యక్రమం నిర్వహిస్తారట! ఆ రోజున విద్యార్థినీ విద్యార్థులు తమ మాతృదేవతను2పూజించి ఆమె ఆశీస్సులను పొందడం కార్యక్రమ వైశిష్ట్యం! ఈ వైశిష్ట్యం తరతరాల భారతీయ జీవన విధానానికి అనుగుణం. ఉపాధ్యాయాన్ దశాచార్యః ఆచార్యాణాం శతం పితా, సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే2- అక్షరాలు నేర్పించే ఉపాధ్యాయునికంటె పదిరెట్లు సంస్కారాలను నేర్పే ఆచార్యుడు, ఆచార్యునికంటె జన్మనిచ్చిన తండ్రి వందరెట్లు పూజనీయులు. తండ్రి కంటె తల్లి వేయిరెట్లు పూజనీయురాలు2- అన్నది హైందవ జాతీయ సంప్రదాయం. ఈ స్ఫూర్తికి అనుగుణంగా మాతృవందనం2కార్యక్రమం రూపొందడం హర్షణీయం. మహిళా సాధికార పథంలో ఇది మరో మహత్తర ఘట్టం. కన్నతల్లి నేలతల్లి వ్యక్తికి ఆధారం, జాతికి ఆధారం.