సంపాదకీయం

అవినీతి ‘శశి’పై ‘అశని’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత త్వరగా శశికళ రంగు తేలిపోవడం తమిళ రాజకీయాలలో కొనసాగుతున్న వేగ పరిణామక్రమానికి పరాకాష్ఠ. మంగళవారం ఉదయం వరకూ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి తీరుతానని గర్జించిన వి.కె.శశికళా నటరాజన్ మధ్యాహ్నం తిరగకముందే కోరలు ఊడిన తోడేలు వలె కూలబడిపోవడం ఊహించడానికి వీలుకాని సంఘటనా పరంపరలో సరికొత్త ఘట్టం! ఫిబ్రవరి ఐదవ తేదీ ఆదివారం ఆమె ముఖ్యమంత్రి పదవికి ఎంపిక కావడం ఎంత హఠాత్తుగా జరిగిందో అంతే హఠాత్తుగా ఆమెను జైలుకు పంపాలని సర్వోన్నత న్యాయస్థానం పదునాలుగవ తేదీన నిర్థారించింది. అన్నాడిఎమ్‌కె పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠాన్ని గత డిసెంబర్ ఇరవయి తొమ్మిదవ తేదీన ఎక్కి కూర్చున్నప్పటి నుంచి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవీ సింహాసనంపై కనే్నసి ఉంచింది. ఆ పీఠం మీదకి ఆమె ఎప్పుడు లంఘించనున్నదన్న విషయమై ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకూ ఎలాంటి సమాచారం బయటికి పొక్కలేదు. నాలుగవ తేదీన మొ దలైన ఊహాగానం యుద్ధప్రాతిపదికపై ఊపందుకుం ది, ఐదవ తేదీన వాస్తవమైంది. ముఖ్యమంత్రి పీ ఠం నుంచి పన్నీర్ సె ల్వంను దిగలాగాలని, తా ను ఆ గద్దెపై కూర్చోవాలని శశికళ నిర్ణయించింది. ఆమె మాట శాసనసభా పక్షం నోట తన్నుకొని వచ్చింది. సెల్వం రాజీనామా వాస్తవమైంది. అలా శశికళ ‘ఆరోహణ క్రమం’ ఊహించని వేగాన్ని పుంజుకొంది. అదే ఊహించని వేగంతో మంగళవారం ఆమె కూలబడిపోయింది! ఎందుకంటె ఆదాయాన్ని మించిన రీతిలో ఆస్తులను పోగేసిన అభియోగంలో ఆమె నేరస్థురాలన్న నిజాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఇంతత్వరగా నిర్థారిస్తుందని మంగళవారం తెల్లవారే వరకూ ఎవరూ ఊహించలేదు! ఈ ఆదాయాన్ని మించిన సంపదను పోగేసిన అభియోగంపై సర్వోన్నత న్యాయస్థానంలో వాదోపవాదాలు ముగిసి అనేక నెలలైంది. ఇన్నినెలలుగా తీర్పును వెలువరించని సర్వోన్నత న్యాయమూర్తులు మంగళవారం తీర్పును చెప్పడం శశికళకు వ్యతిరేకదిశలో దూసుకొనివచ్చిన ప్రతిఘటనా పరంపరకు పరాకాష్ఠ. సర్వోన్నత న్యాయస్థానం ఇంత త్వరగా తీర్పును ప్రకటిస్తుందని శనివారం కూడా ఎవ్వరూ బహుశా ఊహించని పరిణామం! ఘటనలు, ప్రతిఘటనలు ఊహించని వేగంతో దూసుకురావడం శశికళ కారాగృహ ప్రస్థాన క్రమంలో ప్రధానమైన ఇతివృత్తం. ముఖ్యమంత్రి పీఠం వైపు పరుగులు తీసిన శశికళ మధ్యలోనే కారాగారం వైపు కొట్టుకొని పోవడం పరిణామ ప్రభంజన వేగానికి చిహ్నం!
డిసెంబర్ నుంచి ఫిబ్రవరి పదునాలుగవ తేదీ వరకూ ‘ఇంత త్వరగా ఈ ఘటన జరుగుతుందని అనుకోక పోతిమి..’ అని ఘటన జరిగిన తరువాత దాదాపు అందరూ అనుకోవడం శశికళా ప్రహసనంలో ఇతివృత్తం. అన్నా డిఎంకెకు దాదాపు ఇరవై తొమ్మిదేళ్లు తిరుగులేని నాయకురాలైన దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత ఇంతత్వరగా దివంగతురాలవుతుందని గత డిసెంబర్ ఆరంభంలో సైతం ఎవ్వరూ ఊహించలేదు. ఐదవ తేదీన ఆమె మరణించింది. ఆమె మరణం తరువాత వారం తిరగకముందే శశికళ అన్న ఈ ‘అభినవ పూతన’ తన పేరును ‘చిన్నమ్మ’గా మార్చుకొనడం మరింత క్షిప్ర పరిణామం. అప్పటి నుంచి మరింత వేగం పుంజుకొన్న శశికళ ఆధిపత్య అహంకార అత్యాశాక్రీడలో ఊహించని, ఊహించిన పరిణామాలు విపరిణామాలు జరిగిపోయాయి. పన్నీర్ సెల్వం ‘కసాయి కత్తికి తలను అప్పగించిన గొర్రెపిల్ల’ వలె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, మనసు కోరడం, తిరగబడడం, గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ఆమోదించిన తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడం, శిశకళ నిప్పులు తొక్కిన మహిళా మర్కటం వలె చిందులు వేయడం, గవర్నర్‌కు హెచ్చరికలు చేయడం, ఆమె నేరస్థురాలని నాలుగేళ్లపాటు కారాగార నిర్బంధానికి గురికావాలని సుప్రీం కోర్టు నిర్థారించడం ఎంతో త్వరగా జరిగిపోయిన ఘటనాక్రమం!
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన తరువాత శశికళ అస్వస్థతకు గురి అయిందన్న ప్రచారం మరో ఊహించని విపరిణామం. మంగళవారం ఉదయం వరకూ ఆరోగ్యంతో అలరారిన, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ముస్తాబయి ఉండిన శశికళమ్మ అకస్మాత్తుగా అనారోగ్యం బారిన ఎలా పడింది? సుప్రీం తీర్పును గౌరవించి ఆమె మంగళవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవలసి ఉంది. ఆమె తక్షణమే పోలీసులకు లొంగిపోవాలన్నది సర్వోన్నత న్యాయమూర్తులు పినాకి సి. ఘోష్, అమితవ రాయ్ జారీ చేసిన ఉత్తరువు. ఈ ఉత్తరువును అమలు జరపడానికి కొంతకాలం పా టు వాయిదా వేయాలన్న దురుద్దేశంతో మా త్రమే శశికళ అనారోగ్యాన్ని ‘ఆశ్రయించి ఉండవచ్చునన్న ది’ బహిరంగ రహస్యం. మంగళవారం రాత్రి వ రకూ శశికళ లొంగిపోకపోవడం ఈ ‘దూ పులు దాపులు’ జరిపే ప్రవర్తనకు నిదర్శనం. అనారోగ్యం పాలైనందున తనను జైలుకు పంపే కార్యక్రమాన్ని కనీసం నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని శశికళ సర్వోన్నత న్యాయస్థానంలో ‘పిటిషన్’ దాఖలు చేయనున్నట్టు కూడ ప్రచారమైంది. శశికళ వెంటనే లొంగిపోలేదు కనుక ఆమెను నిర్బంధించి జైలుకు పంపడం పోలీసుల తక్షణ కర్తవ్యం. ఆమె ముఖ్యమంత్రి అయిపోతుందేమోనని హడలిపోతున్న తమిళనాడు ప్రజలు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పుతో ఊపిరి పీల్చుకుంటూ ఉండొచ్చు! ప్రజా సమర్థన ఉందన్న ధీమాతో కాక, బెదిరించి భయపెట్టి పార్టీ శాసనసభ్యులను, కార్యకర్తలను తనకు అనుకూలంగా మార్చుకొనే దుందుడుకుతనం శశికళ వ్యవహార సరళిలో గత రెండు నెలలుగా కనిపించింది. తమిళ ప్రజల మద్దతు ఆమెకు లేదనడం స్పష్టం! ఉండి ఉన్నట్టయితే జయకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయమూర్తి మైకేల్ కున్వా 2014 సెప్టెంబర్ 27న జైలుశిక్షను విధించినప్పుడు ఉప్పొంగిన రీతిలో ప్రజల నిరసన వెల్లువెత్తి ఉండేది! శశికళ తాను మరో జయలలితనని ప్రకటించుకొనడానికి చేసిన అభినయం అవినీతి విషయంలో మాత్రమే వాస్తవమైంది. అధికారం విషయంలో బెడిసికొట్టింది.
దాదాపు ఇరవై ఏళ్లకుపైగా కొనసాగిన న్యాయవిచారణ ప్రక్రియ ఫలితంగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన శశికళకు, మరో ఇద్దరికి తగిన శాస్తి జరిగింది. దౌర్జన్య రాజకీయ వాదులకు, అవినీతిపరులకు దండన ఎప్పటికైనా తప్పదన్నది గుణపాఠం. 1996లో అప్పటి జనతా పార్టీ నాయకుడు, ఇప్పటి భాజపా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి జయలలిత శశికళాదులపై ఈ అభియోగాన్ని దాఖలు చేశాడు. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం వారిని దోషులుగా నిర్థారించినప్పటికీ కర్నాటక హైకోర్టు వారిని నిర్దోషులుగా నిర్ణయించింది. విస్మయకరమైన హైకోర్టు తీర్పును ఇప్పుడు సుప్రీం కోర్టు రద్దు చేయడం న్యాయానికి విజయం.. విలంబం జరిగినా వాస్తవం నిగ్గుతేలింది. పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య ముఖ్యమంత్రి పదవికి పోటీ మొదలుకావడం ఈ ప్రక్రియ ఫలితం..