సంపాదకీయం

దక్షిణాసియా చుక్కాని భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌కు ఉన్న తిరుగులేని స్థానానికి ఇండోర్‌లో జరిగిన పార్లమెంట్ స్పీకర్ల సదస్సే నిదర్శనం. ఈ ప్రాంతంలోని దేశాల్లో అన్ని విధాలుగా అగ్రగామిగానే కాకుండా భిన్న రంగాల్లో ప్రగతి సమతూకాన్ని సాధించి అందరికీ ఆదర్శనీయమైన దేశంగానూ భారత్ కొనసాగుతోందని చెప్పడానికి దృష్టాంతాలెన్నో.. ఇతర దేశాలకు మార్గ నిర్దేశన చేసే దేశాలకు స్ఫూర్తిదాయక రీతిలో వ్యవహరించగలిగే శక్తియుక్తులు ఉండాలి. అలాంటి దేశాలు మాత్రమే తాము సాధించిన విజయ సోపానాలను ఇతరులకూ అందించగలుగుతాయి. అలాంటి స్థాయి దక్షిణాసియాలో భారత్‌కు మాత్రమే ఉందని చెప్పడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్న తీరుతెన్నులే నిదర్శనం. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఆయా దేశాల్లో ఉన్న పాలక వ్యవస్థ పటిష్ఠతే కీలకమవుతుంది. అంటే పాలనా విధానం, పార్లమెంటరీ వ్యవస్థ పనితీరు అనేక రీతుల్లో ఆ దేశాల రాజకీయ, ప్రభుత్వ మనుగడకు మూలం అవుతాయి. అత్యంత కీలకమైన ఈ సదస్సును పాకిస్తాన్, మైన్మార్‌లు బహిష్కరించడం కొంత మేర ఆశయ స్ఫూర్తిని దెబ్బతీసేదే అయినప్పటికీ.. అంతిమ లక్ష్య సాధనలో ఈ సదస్సు కృతకృత్యమైందనే చెప్పాలి. అనేక రీతుల్లో భారత ఔన్నత్యానికి, ఇక్కడ దశాబ్దాలుగా వేళ్లూనుతున్న పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విధానాల పటుత్వానికి ఈ శిఖరాగ్ర సదస్సు అద్దం పట్టింది. సుస్థిర అభివృద్ధితోనే బలమైన ప్రగతి బాటలు వేయగలుగుతాం. ప్రస్తుతం మనం ఉన్నది ఏకాకి ప్రపంచం కాదు. ఒక దేశ అభివృద్ధి అనేక దేశాలతో దానికి ఉండే సహకారంపైనే ఆధారపడి ఉంటుంది. పేదరికంలో మగ్గే ఆఫ్రికా దేశాలే కాదు, అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఇందుకు మినహాయింపుకాదు. పరస్పర సహకారమే పునాదిగా దే శాలు ముందుకు సాగినప్పుడే ఐక్యరాజ్య సమితి ప్రవచించిన సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు ఇండోర్‌లో జరిగిన పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు మరింత ఊతాన్నిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దక్షిణాసియా దేశాల మధ్య సహకారం ఎంతగా పెంపొందితే అంతగానూ ఉమ్మడి వనరులను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. దేశాభివృద్ధికి రాజకీయాలు అడ్డు కాకూడదు. దేశాల మధ్య ఉండే విభేదాలూ ఇందుకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. అలాంటి విశాల దృక్పథంతోనే సుస్థిర అభివృద్ధి సాధనా మార్గాలు బలపడతాయి. దక్షిణాసియా దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, పరస్పరం వ్యాపార, వాణిజ్య పరంగా ఎదిగేందుకు స్థిరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసునేందుకు సార్క్ ఏనాడో ఆవిర్భవించింది. ఒక్క సార్క్‌తోనే ఈ సుస్థిర అభివృద్ధి సాధ్యం కాదు. మిగతా ప్రాంతీయ కూటములతో పోలిస్తే సార్క్ దేశాలు సాధించిన ప్రగతి అంతంత మాత్రమేననడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా దేశాల కూటములు విజయవంతం కావడానికి, ప్రాంతీయ బలాన్ని చాటుకుని అంతర్జాతీయంగా విజయకేతనం ఎగురవేయడానికి కారణం విభేదాలకు అతీతంగా ఈ కూటముల్లోని దేశాలు పనిచేయడమే. అభివృద్ధికి విభేదాలు ఎంత మాత్రం అడ్డుకావన్న వాస్తవాన్ని చాటిచెప్పడమే. అనేక రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి వేగానికి ఈ సదస్సు అద్దం పట్టింది. అదే బాటలో మిగతా దేశాలూ పయనిస్తే అభివృద్ధి అసాధ్యమేమీ కాదంటూ నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా చేసిన మార్గనిర్దేశన ఇతర దేశాలకు శిరోధార్యం. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5శాతాన్ని దాటింది. అక్షరాస్యత సుస్ధిర అభివృద్ధిలో కీలక భాగం. ఇందులోనూ భారత్ 109శాతం వృద్ధి రేటును సాధించింది. ఎంతగా అక్షరాస్యత పెరిగితే అంతగానూ ఆరోగ్య ప్రమాణాలు విస్తరించడానికి, అంతిమంగా ఆరోగ్య భారత ఆవిష్కరణకూ ఆస్కారం ఏర్పడుతుంది.
సుస్థిర అభివృద్ధి అంటే నిలకడతో సాధించే ప్రగతి వ్యూహం. అన్ని రంగాలూ సమతూకంతో ముందుకు సాగినప్పుడే సుస్థిర అభివృద్ధి సార్ధకమవుతుంది. సమతూక రాహిత్యం వల్లే అనేక దేశాల్లో పేదరికం పెరిగిపోతోంది. సంపన్నులు, పేదల మధ్య అన్ని రకాలుగానూ వ్యత్యాసం విస్తరిస్తోంది. ఈ రకమైన పరిస్థితుల్ని తొలగించి.. అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో అందరూ సమానమేనన్న భావనే స్పీకర్ల శిఖరాగ్ర సదస్సులో స్పష్టమైంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం తన విధానాలను, ఆలోచనల్ని మార్చుకోవడం వల్ల, ఎప్పటికప్పుడు అవసరానుగుణంగా వాటిని తీర్చిదిద్దుకోవడం వల్లే స్ఫూలజాతియోత్పత్తి వేగాన్ని సంతరించుకుంటోంది. భారత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పినట్లుగా దక్షిణాసియా దేశాల పార్లమెంటేరియన్లు అభివృద్ధి విషయంలో చేతులు కలపాలి. తమతమ దేశాల పాలనా విధానాలు ఎలా ఉన్నా, ప్రభుత్వాలు ఏవైనా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వీరందరూ తమ బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలిగితేనే అభివృద్ధిలో సుస్థిరత సాధ్యమవుతుంది. లింగ సమానత్వం మొదలుకుని ఇందుకు అత్యంత కీలకమై అన్ని అంశాల్లోనూ పార్లమెంటేరియన్ల మధ్య లోతైన అవగాహనతో పాటు రా జకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లగలిగే స హకార స్ఫూర్తి కూడా ప్రస్ఫుటం కావాలి. ఏ దేశానికైనా మహిళల అభివృద్ధే చుక్కాని అవుతుం ది. వీరి పట్ల ఎ లాంటి వివక్ష కనబరిచినా ఆ దేశం అధోగతి పాలేనంటూ బంగ్లాదేశ్ స్పీకర్ శిరిణ్ చౌదరి ఉద్ఘాటన కూడా లింగ వివక్షతో సతమతమయ్యే సమాజానికి కనువిప్పు కలిగించేదే. మహిళల హక్కుల రక్షణే మానవ హక్కుల పరిరక్షణ అన్న శిరిణ్ పిలుపు మొత్తం దక్షిణాసియా దేశాల పాలకులకు, పురుషాధిక్యతే అభివృద్ధికి కొలమానంగా భావించేవారికి చీత్కారం లాంటిదే! లింగ సమానత్వాన్ని సాధించాలంటే ఇందుకు సంబంధించి సమాజంలో వేళ్లూనుకు పోయిన జాఢ్యాలను రూపుమాపాల్సి ఉంటుంది.
ఎస్‌డిజిలుగా పేర్కొనే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అన్నది కేవలం మాటల్లో సాధ్యమయ్యేది కాదు. ఇందుకు పాలనాపరంగానూ, విధానాల పరంగానే కాకుండా నిబద్ధతాయుతమైన రాజకీయ నాయకత్వమూ అవసరమే. స్పీకర్ల శిఖరాగ్ర సదస్సులో సుస్థిర అభివృద్ధే కీలకాంశం కావడానికి కారణం.. దీన్ని సాధించడంలో ఆయా దేశాల పార్లమెంటేరియన్ల పాత్ర ఎంత ఉందో చెప్పడమే. కేవలం సదస్సు ముగిసింది.. ఎవరి ప్రవచనాలు వారు చేశారని చేతులు దులుపుకోకుండా తీసుకున్న నిర్ణయాలను ఆచరణాత్మకం చేసే దిశగా దక్షిణాసియా దేశాలు కలసికట్టుగా అడుగేయాలి. పరస్పరం రెచ్చగొట్టుకుంటూ, ఒకరి అభివృద్ధిని మరొకరు కాలరాస్తూ పోతే ప్రగతి మసిబారిపోతుందన్నది తిరుగులేని నిజం. ఈ సదస్సును పాకిస్తాన్ బహిష్కరించడానికి కారణాలనేకం ఉన్నా.. అభివృద్ధి సాధన విషయంలో ముఖ్యంగా దక్షిణాసియా ప్రగతికి సంబంధించి అడ్డుగోడలు నిర్మించే హక్కు దానికి ఎంత మాత్రం లేదు. ఇందుకు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే పార్లమెంటేరియనే్ల క్రియాశీలకం కావాలి. ఇండోర్ స్పీకర్ సదస్సు అంతిమాశయం ఇదే..