సంపాదకీయం

ఎన్నికల కొలమానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఎన్నికలు జరుగుతున్న తీరు మన ప్రజల సమష్టి నైతిక నిష్ఠకు సూచికలు. ఈ వాస్తవాన్ని ఆధికారికంగా ధ్రువపరచలేక పోవచ్చు. అక్షరాస్యత పెరగడం వల్ల, ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమష్టి నైతిక నిష్ఠ మెరుగుపడుతుందా? మరింత దిగజారిపోయిందా? అన్న మీమాంసకు సైతం మన ఎన్నికలు కాలం నిలబెడుతున్న కొలమానాలు! బ్రిటన్ దాస్యముక్త భారత్ రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత 1952లో తొలిసారి సార్వత్రిక వయోజన అభిప్రాయం ఎన్నికల్లో ప్రస్ఫుటించింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరఖండ్ శాసనసభలను ఎన్నుకొనడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో దేశంలోని వోటర్లలో దాదాపు ఐదు శాతం మంది పాల్గొంటున్నారు. 1952 నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో ‘నేర స్వభావం’ పెరుగుతూ వస్తోంది. జనాభా పెరుగుతున్నంత వేగంగా ఉపాధి, వనరులు పెరగకపోవడం గురించి దశాబ్దులుగా ప్రచారవౌతోంది. నిరుద్యోగం పెరగిపోవడం, వస్తువుల కొరత, ద్రవ్యోల్బణం, రూపాయి క్రమంగా బలహీనపడడం వంటి విపరిణామాలు ఆర్థిక వ్యవస్థలో నిహితం కావడానికి ప్రధాన కారణం జనసంఖ్య పెరిగిపోవడమన్నది జరిగిన ప్రచారం. ‘ప్రపంచీకరణ’ మొదలైన తర్వాత వాస్తవాలు వక్రీకరణలుగా, వక్రీకరణలే వాస్తవాలుగా ప్రచారం అవుతుండడం మరో ప్రధాన వైపరీత్యం. ఆర్థిక సౌష్టవం విస్తరించడం గురించి మాత్రమే విద్యావ్యవస్థలో ప్రధానంగా చర్చ జరుగుతుండడం ఈ వైపరీత్యం. విద్యావంతుల సౌశీల్య సౌష్టవం గురించి ఆలోచించడం అడుగంటింది. అందువల్ల 1952 నాటితో పోలిస్తే ఇప్పటి ఎన్నికల్లో అభ్యర్థుల, వోటర్ల నైతిక నిష్ఠ దిగజారి ఉండడం నిరాకరింపజాలని నిజం. జనాభా పెరుగుదల వల్ల అనేక వైపరీత్యాలు నిహితమై పోవడం ఈ దశాబ్దుల చరిత్ర. అవినీతి పట్ల ధ్యాస దాదాపు శూన్యమైపోవడం ఇంతకంటే ప్రధాన వైపరీత్యం. కిరాయి కార్యకర్తలు అన్ని పార్టీల్లోను చేరి ఉండడం అవినీతి ధ్యాస లేమికి ఒక ఉదాహరణ మాత్రమే! ఎన్నికల్లో అక్రమ ధనం, మద్యం వరదలెత్తడానికి నైతికత ధ్యాస లేని ఈ ‘కిరాయి తనం’ ప్రధాన కారణం!
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నేరచరిత్ర సూచిక విపరీతంగా పెరిగింది. కేవలం 2012 నాటి శాసనసభా నిర్మాణ ప్రక్రియతో పోల్చినప్పటికీ ఈ ఎన్నికల్లో మద్యం, అక్రమ ధనం ప్రభావం భారీగా పెరిగింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితుల శాతం కూడ పెరిగినట్టు ప్రచారమైంది. ఎన్నికలు జరుగుతున్న గోవా, పంజాబ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ప్రస్తుత ప్రక్రియ సందర్భంగా పట్టుబడిన అక్రమధనం, మద్యం విలువ పరిమాణం 2012 నాటి ఎన్నికల సందర్భంగా పట్టుబడిన వాటికంటే ఎక్కువగా ఉండడం ఒక కొలమానం. పట్టుబడిన నల్లడబ్బు లేదా ఎన్నికల ఖర్చులో లెక్కకురాని డబ్బులో- గత నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన పాతనోట్లు కూడా ఉన్నాయట. అంటే వోటర్లను ప్రలోభపెట్టడానికి కాని, కిరాయి కార్యకర్తలను సమకూర్చుకొనడానికి వీలుగా రద్దయిన పాతనోట్లను కూడ అభ్యర్థి ‘మహాశయులు’ చెలామణి చేస్తున్నారన్నమాట! ఈ పాతనోట్లను పొందుతున్నవారు కేవలం రిజర్వ్ బ్యాంకు శాఖల్లోను, అతికొద్ది సంఖ్యలో ప్రత్యేక అనుమతి పొందిన వాణిజ్య బ్యాంకు శాఖల్లోను మాత్రమే ఈ పాతనోట్లను బదిలీ చేసుకుని కొత్తవి పొందవచ్చు. ఇలా పొందే సదుపాయం గురించి బాగా తెలిసిన వోటర్లు, ‘కార్యకర్తలు’, నాయకులు, ప్రచారకర్తలు మాత్రమే పాతనోట్లను స్వీకరించగలరు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దాదాపు ముప్పయి రెండు లక్షల రూపాయల విలువైన పాత- రద్దయిన పెద్దనోట్లు పట్టుబడినాయట! పట్టుబడని వాటి సంఖ్య, విలువ పరిమాణం ఇంకా ఎక్కువేనన్నది బహిరంగ రహస్యం. ఉత్తరప్రదేశ్‌లో 2012 నాటి శాసనసభ ఎన్నికల సందర్భంగా దాదాపు ముప్పయి ఏడు కోట్ల రూపాయల నల్లడబ్బును అధికారులు పసిగట్టి పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే దాదాపు నూట పనె్నండు కోట్ల రూపాయల విలువైన నల్లడబ్బు పట్టుబడిందట! అంటే నల్లధనం చెలామణి దాదాపు మూడురెట్లు పెరిగిపోయింది!
పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనం చెలామణి, ప్రభావం తగ్గిపోతుందన్న భావం ప్రబలింది. కానీ, ఎన్నికల ప్రచార రంగం వరకూ ఈ భావం కేవలం భ్రాంతి అని స్పష్టమైంది! పాతనోట్లు- లెక్కల్లో చూపనివి- చెలామణిలో ఉన్నాయి. అక్రమాలకు ఒడిగట్టే వారి ధీమా ఇందుకు కారణం. కొత్తనోట్లను బ్యాంకుల నుంచి ఉపసంహరించుకొనడంపై కేంద్రం, రిజర్వ్ బ్యాంకు విధించిన ఆంక్షలు, నియంత్రణలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చేనెలలో ‘హోలీ’ ఉత్సవం వరకూ నియంత్రణలు కొనసాగనున్నాయి. కానీ ‘లెక్కలు తేలని’ కొత్తనోట్లు కూడా భారీగా ఎన్నికల ప్రచారంలో చెలామణి అయిపోతున్నాయి. శతకోటి దరిద్రాలను అతిగమించడానికి అనంత కోటి ఉపాయాలన్నది పాత కథ. శతకోటి సక్రమాలను వమ్ము చేయడానికి అనంత కోటి అక్రమాలన్నది నేటి వ్యథ! ప ట్టుబడని నల్లడబ్బు ఎన్ని వందల కోట్ల రూపాయలన్నది ఎప్పటికీ తేలదు. అది కిరాయి కార్యకర్తలు, అమ్ముడుపోయిన వోటర్ల చేతుల మీ దుగా ఖర్చయిపోయి, తె ల్లదనాన్ని సంతరించుకొంది. వోటర్లకు గుర్తింపుపత్రాలను ఇవ్వడం వల్ల, ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను వాడడం వల్ల పోలింగ్ బూత్‌లలో ‘రిగ్గింగ్’ జరిపే నేరాలు సన్నగిల్లాయన్నది ప్రచారం. కానీ ‘రిగ్గింగ్’ కొనసాగుతూనే ఉంది. అయితే ఇది కొత్త రకం ‘రిగ్గింగ్’. ఐదు వందలు లేదా రెండువేల రూపాయల నోట్లు ‘రిగ్గింగ్’ యంత్రాలు.. ఈ యంత్రాలతో వోటర్ల హృదయాల్లో, చిత్తవృత్తి సీమల్లో భయంకరంగా ‘రిగ్గింగ్’ జరిగిపోతోంది. 1952 నాటికి అక్షరాస్యత శాతం చాలా తక్కువ. అందువల్ల అనభిజ్ఞులైన- ఇగ్నోరెంట్- వోటర్లు అక్రమాలకు అమాయకంగా లొంగిపోయి ఉండవచ్చు. కానీ అక్షరాస్యత పెరిగిన తర్వాత విజ్ఞులైన వోటర్లు, కార్యకర్తలు, నాయకులు, ప్రచారకర్తలు, అభ్యర్థులు అక్రమాలకు లొంగిపోరాదు. అక్షరాస్యత పెరిగిన కొద్దీ అవినీతి పెరిగింది!
జాతిహితం గురించి తపన పడేవారు ఆలోచించవలసిన విషయం ఇది, మథనపడవలసిన సమస్య ఇది. మద్యం తాగడం, అర్ధరాత్రి వరకూ మద్యం తాగడం, తెల్లవార్లూ మద్యం దుకాణాలు తెరచి ఉండడం- ఇవన్నీ సక్రమమై పోతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రం మద్యం ముట్టరాదన్న నియమానికి తాగుబోతులు ఎలా కట్టుబడి ఉండగలరు? కొన్ని రాష్ట్రాల్లో మద్యపానంపై ఆంక్షలు విధిస్తున్నారు, మద్యపానాన్ని నిషేధిస్తున్నారు. సమాంతరంగా అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాల సంఖ్యను పెంచారు. సమన్వయం ఏదీ..?