సంపాదకీయం

విజయ సూచికలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో ఎవరు విజయం సాధించగలరన్నదానికి మహారా ష్ట్ర నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు పూర్వ సూచికలు! మిగిలిన రాజకీయ పక్షాల సంగతి ఎలా ఉన్నప్పటికీ భారతీయ జనతాపార్టీ వారు మాత్రం దీన్ని విశ్వసిస్తున్నారు. మహారాష్ట్ర నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికలలో భాజపాకు లభించిన విజయాలు ఇందుకు ప్రాతిపదిక! మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలతో దాదాపు సమాంతరంగా జరిగిన ఒడిశా జిల్లా పరిషత్ ఎన్నికలలో సైతం ‘్భజపా’కు గణనీయమైన విజయాలు లభించడం ఈ విజయ విశ్వాసానికి కారణం. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు, అవినీతిని అసహ్యించుకుంటున్నారు, పారదర్శక పరిపాలనను కోరుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా కొనసాగుతున్న జాతీయ విప్లవంలో ‘పెద్దనోట్ల రద్దు’ ఒక ప్రధాన ఘట్టం. ఐదు వందల రూపాయల, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల నల్లడబ్బు ప్రభావం, నకిలీ డబ్బు చెలామణి తగ్గిపోతాయన్నది ప్రజల విశ్వాసమని మహారాష్ట్ర నగరాల వోటర్లు, ఒడిశా గ్రామీణ వోటర్లు చెప్పిన తీర్పుల వల్ల స్పష్టమైంది. ఉత్తరప్రదేశ్‌లోని యాబయి మూడు శాసనసభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఈ నాలుగవ విడత పోలింగ్ జరుగుతున్న సమయంలోనే మహారాష్ట్ర నగర పాలికలకు మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడడం సమాంతర పరిణామం. పది ‘నగరపాలిక’లకు, పదకొండు జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. ‘నగరపాలక’-మునిసిపల్ కార్పొరేషన్-లలో ఏడింటిని ‘్భజపా’ కైవసం చేసుకోనుండడం ‘నోట్ల రద్దు’నకు ప్రజల నుండి లభించిన మద్దతుకు చిహ్నమన్నది రాజకీ య వ్యాఖ్యాతలు చే స్తున్న నిర్ధారణ! ఈ నిర్ధారణ నిజమైతే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ‘్భజపా’ విజయం సాధించడం ఖా యం. వోటర్లు సాధిందలచిన ‘నిశ్శబ్ద విప్లవ’ ధ్వ నులు ముంబయి ఎన్నికలలో మరింత ‘బిగ్గర’గా వినిపిస్తున్నాయి. ప్రత్యర్థుల గుండెల్లో ప్రకంపనాలను సృష్టిస్తున్నాయి. మంగళవారం జరిగిన ‘బృహన్ ముంబయి మహానగర పరిషత్’ ఎన్నికలలో ‘్భజపా’, ‘శివసేన’కు సమ ఉజ్జీగా నిలబడడం అద్భుతమైన పరిణామం. ‘మహానగర పాలిక’లో ఎదురు లేదన్న ధీమాతో ఉండిన ‘శివసేన’కు ‘్భజపా’ పెరగడం పెద్ద ఎదురు దెబ్బ. రెండు వందల ఇరవై ఏడు స్థానాలున్న బృహన్ ముంబయి నగర పాలికలో భాజపాకు ఎనబయి ఒకటి శివసేనకు ఎనబయి నాలుగు స్థానాలు లభించాయి. 2012 నాటి కంటె భాజపా బలం మూడు రెట్లు పెరగడం శివసేన ఆధిపత్యానికి అశనిపాతం! ముంబయి ఎన్నికలలో గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో వోటర్లు పాల్గొన్నారు. పోలింగ్ శాతం పెరగడం భాజపా విజయానికి కారణమట! ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లోను పాల్గొన్న వోటర్ల శాతం గతంలో కంటె పెరిగింది.
ఇలా పోలింగ్ శాతం పెరగడం జన చైతన్యానికి ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల పెరుగుతున్న నిష్ఠకు సంకేతం! పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలకు పెద్ద నష్టం జరిగిపోతున్నట్టు కాంగ్రెస్ తదితర విపక్షాలు చేసిన ఆర్భాటాన్ని ప్రజలు అంగీకరించలేదని కూడ మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ధ్రువపరిచాయి. భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన నోట్ల రద్దును సమర్ధించడానికేనన్నట్టు ఎన్నికలలో మరింత ఎక్కువమంది వోట్లు వేశారు. ముంబయి మహానగరంలో ఇరవై ఏళ్లుగా పోలింగ్ యాబయి శాతాని కంటె మించలేదు. ఈ ఎన్నికలలో యాబయి ఐదు శాతం వయోజనులు పోలింగ్‌లో పాల్గొన్నారట! ఇలా పోలింగ్ శాతం పెరగడం భాజపా ప్రత్యర్థులకు మాత్రమే కాక మిత్రులకు సైతం వ్యతిరేక ఫలితాలను సమకూర్చి పెడుతోంది! ముంబయిలో శివసేనకు ఇన్ని రోజులుగా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఇప్పుడు భాజపా కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకుంది. నోట్ల రద్దుపై భూనభోంతరాళాలు బద్దలయ్యేలా నిరసన శబ్ద కాలుష్యాన్ని నిగిడించిన కాంగ్రెస్‌కు వాణిజ్య ఆర్థిక రాజధానిలో ఈ గతి పట్టడం వినియోగదారులు సాధించిన నిశ్శబ్ద విప్లవం. జాతీయతా కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్‌కు రాజకీయాలలో యాబయి ఏళ్లు విజయవంతంగా గడిచాయట. ఈ శుభ సందర్భంగా ఆయన పార్టీ ముంబయిలో తుడిచిపెట్టుకొనిపోయింది..
పెద్దనోట్ల రద్దు-డీమానిటైజేషన్-ప్రభావం ఒడిశా స్థానిక ఎన్నికలలో ప్రస్ఫుటించడం భాజపా వారికి ఉత్తరప్రదేశ్‌లో విజయ విశ్వాసం పెరగడానికి మరో కారణం. ఒడిశాలోని ముప్పయి ఒక్క జిల్లా పంచాయతీలకు ఎనిమిది వందల యాబయి మంది ప్రతినిధులు ఎన్నిక అవుతున్నారు. 2012లో భాజపాకు కేవలం ముప్పయి స్థానాలు లభించాయట. ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో భాజపా మూడు వందల స్థానాలను గెలుచుకొనడమే కాక ఎనిమిది జిల్లాల పంచాయతీలలో మెజారిటీని సాధించింది. అధికార బిజూ జనతాదళ్ బలం ఆరు వందల యాబయి మూడునుంచి నాలుగు వందల యాబయి రెండు స్థానాలకు పడిపోవడం పెద్దనోట్లు రద్దు పట్ల పెరిగిన ప్రజల మద్దతుకు సంకేతం! కాంగ్రెస్ కేవలం అరవై స్థానాలు దక్కించుకొని మూడవ స్థానానికి దిగజారిపోయింది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మాత్రమే కాక, శాసనసభలకు ఇప్పుడు ఎన్నికలు జరిగిన మిగిలిన రాష్ట్రాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్నదానికి ఈ రెండు రాష్ట్రాల- మహారాష్ట్ర, ఒడిశా- స్థానిక సమరాలు స్పష్టమైన సూచికలు! అయితే దేశ ప్రజలందరి దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్నది ఉత్తరప్రదేశ్. దేశంలోని ప్రజలలో దా దాపు ఆరవ వంతు ఉత్తరప్రదేశ్‌లో ఉండడం ఇందుకు ఒక కారణం! లోక్‌సభలో ఐదు వందల నలబయి ముగ్గురిలో ఎనబయి మంది ప్రతినిధులు ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికవుతున్నారు. ప్రధాన మంత్రి పదవి తరువాత అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉన్నది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికే! ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను ఉత్తరప్రదేశ్ ‘దత్తపుత్రుని’గా ప్రకటించుకొనడం ‘ఉత్తర’ సమరానికి ప్రాధాన్యం పెరగడానికి మరో కారణం! లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృత్తం కాగలవన్నది ఈ ‘దత్తపుత్రుని’ప్రచారానికి ఇతివృత్తం! వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన నరేంద్ర మోదీ ప్రభావం 2014 నాటి ఎన్నికలలో అద్భుతాన్ని సృష్టించింది. డెబ్బయి మూడు లోక్‌సభ స్థానాలు భాజపా గెలిచింది! అయోధ్య రామజన్మభూమి ఉద్యమం ఉద్ధృతంగా సాగిన సమయంలో కూడ భాజపాకు ఉత్తరప్రదేశ్‌లో ఇన్ని లోక్‌సభ స్థానాలు దక్కలేదు! 2014 నాటి ఎన్నికలలో భాజపాకు లోక్‌సభలో మెజారిటీ లభించడానికి కారణం ఉత్తరప్రదేశ్ వోటర్లు ప్రకటించిన అనూహ్యమైన మద్దతు.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల తరువాత భాజపా ప్రభుత్వం ఏర్పడినట్టయితే అది ఆశ్చర్యం కాజాలదు! ఉత్తరప్రదేశ్ కులరాజకీయాలకు మొదటిసారి విరుగుడు ‘రామభూమి’ ఉద్యమం. రెండవసారి కుల రాజకీయ విముక్తి 2014 లోక్‌సభ ఎన్నికలలో కలిగింది. 2007 నుంచి 2012 వరకు మాయావతి నేతృత్వంలోని బహుజన స మాజ్ పార్టీ, 2012 నుంచి అఖిలేశ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ను పాలించాయి. అందువల్ల ఈసారి భాజపా వంతు. ఇదీ భాజపా విశ్వాసం!