సంపాదకీయం

సమృద్ధి సమస్యలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వ్యవసాయ రంగంలోని అసంతులనానికి, అస్థిరత్వానికి ఇది మరో నిదర్శనం. అంతర్గత వైరుధ్యాలు పదే పదే ప్రస్ఫుటిస్తున్నాయి. దేశంలో 2016-2017 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నది ఆధికారిక నిర్థారణ. ఆంధ్రప్రదేశ్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోను దుర్భిక్షం వల్ల రైతులు, వ్యవసాయ శ్రామికులు సొంత ఊళ్లను వదలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నది సమాంతర నిర్థారణ! ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లు ప్రతీకలు మాత్రమే. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వేసవికాలం మొదలుకాకముందే వ్యవసాయ క్షేత్రాలు దప్పితో పగుళ్లు పారిపోతుండడం ఆవిష్కృతవౌతున్న దృశ్యం. ఈ దృశ్యాలు నిజానికి దశాబ్దుల తరబడి పునరావృత్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వారి ‘మిషన్ కాకతీయ’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కృష్ణా, గోదావరీ నదుల అనుసంధానం పొలాల దప్పిని ఇప్పుడప్పుడే తీర్చబోవన్నది నిరాకరింపజాలని నిజం. ఆహారం ఉత్పత్తి పెరగడం, దుర్భిక్షం- ఈ రెండూ పరస్పర వైరుధ్యాలు. రెండూ ఒకేసారి నెలకొని ఉండడం వ్యవసాయ రంగంలో సంతులన రాహిత్యానికి ఒక నిదర్శనం. మానవ ప్రయత్నంతో నిమిత్తం లేని, మానవ ప్రయత్నానికి అతీతమైన పర్యావరణ పరిణామాలు మాత్రమే అభూత పూర్వమైన భారీ ఉత్పత్తిని, కరవుకాటకాలను సృష్టిస్తుండడం వ్యవసాయ రంగంలో నిహితమై ఉన్న వైపరీత్యం. సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయ సీమలు సస్యశ్యామల శోభలను సంతరించుకొనడాన్ని ప్రభుత్వాలు వీక్షిస్తున్నాయి. వర్షాలు కురవక పంటలు ఎండిపోవడాన్ని, రైతులు నష్టపోవడాన్ని, ఆహారం కొరతలు ఏర్పడి ధరలు పెరగడాన్ని కూడ ప్రభుత్వాలు వీక్షిస్తున్నాయి. నిరంతరం నిలకడగా వ్యవసాయ రంగంలో సస్యహరిత శో భలు సభలను తీర్చడానికి వలసిన దీర్ఘకాల సమీక్ష లు మాత్రం జరగడం లే దు. కాలుష్యం కాటుకు నిరంతరం గురిఅవుతుండడం వల్ల మాత్రమే వ్యవసాయ రంగం ఇలా వైరుధ్యాలకు లోనవుతోందన్నది సమీక్ష వల్ల నిగ్గు తేలుతున్న నిజం. ఈ సమీక్షను ప్రభుత్వాలు మాత్రం చేయడం లేదు. స్వచ్ఛంద సంస్థలు, స్వదేశీయ ఉద్యమకారులు, అధ్యయనాల వల్ల పరిశోధనల వల్ల నిగ్గుతేలుతున్న నిజాలను ప్రభుత్వాలు గుర్తించడం లేదు. కాలుష్యం విస్తరించడానికి ప్రధాన కారణం వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- వ్యవస్థ! ప్రపంచీకరణ భూమిని నిస్సారంగా మారుస్తోంది. పచ్చదనాన్ని పాడు చేస్తోంది. పరిసరాలను పరిమార్చుతోంది. అడవులను హననం చేస్తోంది. కాలుష్యానికి, కాలుష్యం వల్ల వర్షాభావం ఏర్పడడానికి ఇదీ కారణం! ప్రపంచీకరణ ఉచ్చు మరింత బిగిసిపోవడానికి దోహదం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి, విధానాల మథనం జరగాలి..
వ్యవసాయ రంగాన్ని వాణిజ్య వ్యవసాయ రంగంగా మార్చడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థ- మల్టీ నేషనల్ కంపెనీ-లు జరుపుతున్న కుట్ర ప్రపంచీకరణలో భాగం. రైతుకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, వినియోగదారుడు అత్యధికంగా ధరలు చెల్లించవలసి రావడం నడుస్తున్న కుట్రలో భాగం! ఈ వైపరీత్యాన్ని నిరోధించడానికి, నియంత్రించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకొనని, తీసుకోలేని వ్యవస్థ ఏర్పడడం ప్రపంచీకరణలో భాగం. దీన్ని ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ- అని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ డబ్ల్యుటిఓ- నిర్వచించింది. ప్రభుత్వం ప్రమేయం ‘లవలేశం’ కూడ లేని రీతిలో సరఫరా- సప్లయ్- గిరాకీ- డిమాండ్- ప్రాతిపదికగా మాత్రమే ధరలు నిర్ణయం కావడం ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- స్వభావమని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిర్థారించింది. ‘మార్కెట్ ఎకానమీ’ స్థాయిని పొందిన మన దేశంలోను, ఇతర దేశాలలోను ప్రభుత్వాలు వ్యవసాయదారునికి వ్యతిరేకంగా ఉత్పత్తుల ధరలు తగ్గిపోయినా, వినియోగదారునికి వ్యతిరేకంగా ధరలు పెరిగిపోయినా చూస్తూ ఊరుకోవలసిందే! నియంత్రించడానికి ప్రభుత్వం యత్నిస్తే ‘డబ్ల్యుటిఓ’ వారు మనకు ‘మార్కెట్ ఎకానమీ’ హోదాను రద్దు చేస్తారు. ధరలు పెరగడం, తగ్గడం ప్రధానం కాదు- ‘మార్కెట్ ఎకానమీ’ హోదా ప్రధానం. ప్రవర్ధమాన దేశాల ప్రజలను సంపన్నదేశాల ‘సంస్థలు’ దోచుకొనడానికి మాధ్యమం ‘మార్కెట్ ఎకానమీ’! అపూర్వ రీతిలో దేశంలో దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోను రైతులు, గ్రామీణ శ్రామకులు తమ ఇళ్లను, పల్లెలను వదలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస పోతుండడానికి ఇదీ కారణం- మార్కెట్ ఎకానమీ!
కందులను భారీ పరిమాణంలో పండించిన రైతులు కడగండ్లపాలు కావడం ‘మార్కెట్ ఎకానమీ’ మాయాజాలంలో ఒక అంశం మాత్రమే. ఈ ఏడాది అభూత పూర్వం- అన్‌ప్రిసిడెంటెడ్-గా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరగడానికి కారణం దేశమంతటా పప్పు ధాన్యాల పంటలు ఎక్కువ కావడం. పప్పు్ధన్యాల్లో ప్రధానమైనది కంది. రెండేళ్ల క్రితం కందిపప్పుల ధరలు భయంకరంగా పెరగడానికి కారణం మెగా ‘దగా’ దుకాణాలను నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థలు, వాటి దళారీలు సృష్టించిన కృత్రిమ కొరత. కిలో రెండు వందల రూపాయలు చె ల్లించి వినియోగదారులు కందిపప్పు కొనవలసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా రంగంలోకి దిగి భారీగా కందిపప్పును దిగుమతి చేసుకొనడానికి అనుమతి ఇచ్చినప్పటికీ కందిపప్పు ధరలు పెద్దగా తగ్గలేదు. కానీ కందులను పండించే రైతుల సంఖ్య పెరిగింది. పంట విస్తీర్ణం పెరిగింది. గతేడాది ఖరీఫ్ పంట తర్వాత రైతులకు క్వింటాలుకు పదివేల రూ పాయల వరకూ ధర లభించింది. కేంద్ర ప్రభుత్వం వారి మద్దతు ధరకంటే ప్రతి క్వింటాలుకు దాదాపు నాలుగైదువేల రూపాయలు ఎక్కువగా రైతులకు గిట్టుబాటయింది. ఫలితంగా ‘కంది’ లాభసాటి అన్న ప్రచారం పెరిగి ఈ ఏడు ఖరీఫ్ కాలంలో పత్తి, పొగాకు, వేరుసెనగ, జనుము, పొద్దుతిరుగుడు పువ్వు, పసుపు వంటి పంటలను మానేసి అధికాధిక కృషీవలురు ‘కంది’ని పండించారట. గతేడాది కంటే కందిపంట విస్తీర్ణం, ఉత్పత్తి పెరగలేదు. అయినప్పటికీ కందులను కొనే వ్యాపారులు ధరలను దించేశారు. కనీసం క్వింటాలుకు ఏడు ఎనిమిది వేల రూపాయలు గిట్టుబాటు అవుతుందని ఆశించిన రైతులకు అడియాసలు లభించాయి. క్వింటాలు ధర నాలుగువేల రూపాయల స్థాయికి దిగజారింది. నష్టపోయిన రైతులు ఖరీఫ్ రుణాలను తీర్చలేకపోతున్నారు. ఇక రబీ పంటకు పెట్టుబడులు లేవు. రబీ పంటలు పెట్టలేని రైతులు నాలుగు నెలల పాటు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వలసపోతున్నారు. ఇది ‘మార్కెట్ ఎకానమీ’ మాయాజాలం!
కాలుష్యాన్ని పెంచుతున్న రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వ్యవసాయ భూమిని మాత్రమే కాదు, పరిసరాలను పాడు చేశాయి. ‘బిటి’ పత్తి వంటి మహా సంకర రకాల పంటలు పర్యావరణ సంతులనాన్ని ధ్వంసం చేయగల గొడ్డళ్లు. అందువల్లనే భూమి, జలాశాయలు నీటిచుక్కకు నోచుకోక ఎండిపోయాయి, ఎండిపోతున్నాయి. రసాయన ఎరువుల అవసరం లేని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల పునరుద్ధరణ వేగం పెరగడం ఒక్కటే రైతులకు కడగండ్ల నుంచి విముక్తి మార్గం.