సంపాదకీయం

అంతుపట్టని హంతక వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్ఘానిస్తాన్‌లోని నంగధర్ ప్రాంతంలో నక్కి ఉన్న ‘్భరతీయ’ జిహాదీ ముష్కరుల వివరాలను తెలుసుకోవడానికి మన ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’-‘నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ’-ఎన్‌ఐఏ-వారు ‘అంతర్జాతీయ నిఘా సంస్థ’-ఇంటర్ పోల్- సహాయం కోరడం సరికొత్త పరిణామం. ‘ఇరాన్ సిరియా ఇస్లాం మతరాజ్యం’-ఐఎస్‌ఐఎస్- జిహాదీ ముఠాలోకి పెద్ద సంఖ్యలో భారతీయులు చేరిపోవడం ఇందుకు కా రణం! నంగధర్ ప్రాంతానికి ‘ఐఎస్‌ఐఎస్’ వారు ‘ఖోరాసాన్ విలాయత్’ అన్న పేరు పెట్టారట! ఈ ప్రాంతమంతా ‘ఐఎస్‌ఐఎస్’ దురాక్రమణకు గురై ఉంది. అక్కడి ఈ ముఠావారు ‘ఇస్లాం మతరాజ్యాన్ని’ కూడ ఏర్పాటు చేసి ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ‘అమెరికా సమర్ధక’ ఇరాక్ ప్రభుత్వాన్ని తొలగించే లక్ష్యంతో పెద్దఎత్తున జిహాదీ బీభత్స కాండను మొదలుపెట్టిన ‘ఐఎస్‌ఐఎస్’ అటు సిరియా, టర్కీ, ఈజిప్ట్, లిబియాలకు ఇటు అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, భారత్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మైన్మార్‌లకు విస్తరించి పోయింది. మనదేశంలో ముంబయికి చెందిన ముష్కరులు కొందరు ‘అంతర్జాలం’ ద్వారా ‘ఐఎస్‌ఐఎస్’తో అనుసంధానం పెంచుకుని ఆ తరువాత ఇరాక్‌కు ఉడాయించినట్టు మూడేళ్ల క్రితం ‘పుటపుటలు’గా సమాచారం పొక్కింది! ఈ మూడేళ్లలో ఈ పుటపుటలు ‘చిటపటలు’గా మారి మన భద్రతా వ్యవస్థను కల్లోలపరుస్తున్నాయి. మూడేళ్ల కిందట మన భద్రత అప్రమత్తమైంది! అప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా మన నిఘా విభాగాల వారు, నేర పరిశోధక విభాగాల వారు మన దేశంలోని ‘ఐఎస్‌ఐఎస్’ ఉగ్రవాదులను ఏరివేస్తూనే ఉ న్నారు. కానీ, సమాంతరంగా మన దేశానికి చెందిన దుర్జనులు ‘ఐఎస్‌ఐఎస్’లో ‘్భర్తీ’ అవుతున్న ‘కార్యక్రమం’ కూ డ కొనసాగుతునే ఉంది! ముష్కరులు మన దేశం నుండి ‘జారు’కుంటున్నారు. ఈ పలాయనాన్ని పసికట్టలేకపోవడం మన భద్రత వైఫల్యమా? లేక మన ‘నిఘా’ విభాగాలు నిర్నిద్రమై ఉన్నప్పటికీ ‘ఐఎస్‌ఐఎస్’ ముష్కరులు ఎత్తుకు పైఎత్తులు వేయగలిగారా? ఉద్యోగాల కోసం పర్షియా సింధుశాఖ దేశాలకు, ఇతర విదేశాలకు వెడుతున్నట్టు అభినయిస్తున్న ‘జిహాదీ’లు మన సరిహద్దులు దాటుకున్న తరువాత నిజ రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. కేరళకు చెందిన టి.కె.హఫీసుద్దీన్ అనే ‘ఐఎస్‌ఐఎస్’ హంతకుడు అఫ్ఘానిస్తాన్‌లోని నంగధర్ ప్రాం తంలో దాడులకు గురై హతం కావడం ఈ విస్తృత విష వ్యూహానికి సరికొత్త సాక్ష్యం! హఫీసుద్దీన్‌తోపాటు మరో తొమ్మిది మంది జిహాదీలు కూడ కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని ‘పద్నే’ గ్రామం నుండి బయలుదేరి గత జూన్‌లో ఇరాన్ రాజధాని టెహరాన్‌కు చేరుకున్నారట! అక్కడి నుంచి ‘నంగధర్’ ప్రాంతంలోకి చొరబడలిగారు!
ఇలా మన దేశం నుండి ఎన్ని వందల మంది జట్లు జట్లుగా ఐఎస్‌ఐఎస్‌లోకి చేరిపోతున్నాన్నది ‘నిఘా’ విభాగాలు పసికట్టలేకపోయాయన్నది స్పష్టం! ‘నంగధర్’ ప్రాంతంలో ఎంతమంది మన దేశం నుంచి వెళ్లిన ‘జిహాదీ’ ముష్కరులు ‘ఐఎస్‌ఐఎస్’లో పనిచేస్తున్నదీ మన ‘ఎన్‌ఐఏ’కు తెలియకపోవడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే! జిహాదీ బీభత్సకారులకు వ్యతిరేకంగా ‘అంతర్జాతీయ సమరం’ ఆరంభం అయిందా? లేదా? అన్నది వివాదగ్రస్తం! కానీ ‘జిహాద్’ బీభత్సం మాత్రం అంతర్జాతీయ స్థాయిని సంతరించుకుంది. సిరియాలోను ఇతర చోట్ల అమెరికా ‘నాటో’- ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి- దేశాలవారు ‘ఐఎస్‌ఐఎస్’కు వ్యతిరేకంగా జరిపిన పోరాటానికి చైనా,రష్యాలు సహకరించలేదు! రష్యా జరిపిన యుద్ధానికి అమెరికా, నాటో దేశాలు సహకరించలేదు! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నాటో’కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ‘జిహాదీ’లకు కొత్త బలాన్నిచ్చాయి. క్రీస్తుశకం 1950వ దశకం నుంచి ‘నాటో’కు అమెరికా నాయకత్వం వహిస్తోంది! అఫ్ఘానిస్తాన్‌లో ‘జిహాదీ’లకు వ్యతిరేకంగా ‘నాటో‘ దళాలు పోరాడాయి, సిరియాలో పోరాడుతున్నాయి. ‘నాటో’ కాలదోషం పట్టిందని ట్రంప్ స్వ యంగా వ్యాఖ్యానించడం ‘నాటో’లోని ఐరోపా దేశాలకు దిగ్భ్రాంతిని కలిగించి ఉండవచ్చు! ‘జిహాదీ’లను తుదముట్టించడం పేరుతో ఇస్లాం దేశాల ప్రజల అమెరికా ప్రవేశాన్ని కట్టడి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోవైపు ‘ఐఎస్‌ఐఎస్’ జిహాదీలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ‘నాటో’ను రద్దు చేయాలని భావించడం అంతుపట్టని గందరగోళం.. అల్‌ఖాయిదాలు, తాలిబన్లు నిష్క్రమించి అఫ్ఘానిస్తాన్‌లోని ఐఎస్‌ఐఎస్ విస్తరించిపోవడం ‘సమాంతర పాలన’ మొదలుపెట్టడం ఈ గందరగోళానికి నేపథ్యం..
పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య సంస్థగా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’-ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజె న్స్-మాయాజాలం సృష్టిస్తోండడం పెద్దగా ప్రచారం కాని వ్యవహారం. గత కొద్ది వారాలుగా ‘ఐఎస్‌ఐ’ అమలు జరుపుతున్న బీభత్స వ్యూహం మారినట్టు అనుమానించడం అతార్కికం కాదు! ఎందుకంటే పాకిస్తాన్‌లో కూడ ఇప్పుడు కొన్ని చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు కా రణం తాలిబన్ల మధ్య, ‘ఐఎస్‌ఐఎస్’ ముఠాల మధ్య, ఇతర పాకిస్తానీ జిహాదీ ముఠాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరం కావచ్చు! ఒకప్పుడు తాము ఆధిప త్యం వహించిన అఫ్ఘానిస్తాన్‌లోకి ‘ఐఎస్‌ఐఎస్’ చొరబడిపోవడం తాలిబన్లకు ఇష్టం లేదు. అందువల్ల ‘యెమెన్’ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అఫ్ఘానీ తాలిబన్లకు, అల్ ఖాయిదా మూకలకు మద్దతుగా పాకిస్తానీ ‘తాలిబన్లు’ బీభత్స చర్యలు ముమ్మరం చేశారు! పాకిస్తాన్‌లో రూపొందిన జాయిష్ ఏ మహమ్మద్, జమాత్ ఉద్ దావా, లష్కర్ ఎ తయ్యబాలకు రాజకీయవేత్తల మద్దతు ఉంది! అందువల్ల ఈ రాజకీయ వేత్తలు పరస్పరం ప్రాబల్యం పొందడంలో భాగంగా కూడ పాకిస్తానీ జిహాదీ ముఠాలవారు పురికొల్పి ఉండవచ్చు! ఏమైనప్పటికీ పాకిస్తాన్‌లో జరుగుతున్న ‘కల్లోల కాండ’ ఫలితంగా జమ్ము-కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిస్తున్న బీభత్సకాండకు అంతర్జాతీయ సమాజం దృష్టిలో ప్రాధాన్యం తగ్గింది! ఇలా దృష్టిని మళ్లించడం ఐఎస్‌ఐ వ్యూహం! ‘ఐఎస్‌ఐ’ అఫ్ఘానిస్తాన్‌లో రూపొందించిన ‘హక్కానీ’ ముఠావారు కొంతకాలంగా ‘నిద్రాణం’గా ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం నడిపిస్తున్న భారత వ్యతిరేక ఉగ్రకాండ వైపునుండి దృష్టి ‘ఐఎస్‌ఐఎస్’వైపు మళ్లడం ‘ఐఎస్‌ఐ’ వ్యూహంలో భాగం..
‘లష్కర్ ఏ తయ్యబా’ బీభత్సకారుడు హఫీజ్ స రుూద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన తరువాత పాకిస్తాన్ బీభత్సం ప్రాధాన్యం తగ్గి ‘ఐఎస్‌ఐఎస్’ చర్యలకు ప్రచారం ఎక్కువైంది! ఆదివారం గుజరాత్‌లో మరో ఇద్దరు ‘ఐఎస్‌ఐఎస్’ దుండగులు పట్టుబడడం, ‘ఐఎస్‌ఐఎస్’ నిర్బంధం నుంచి డాక్టర్ కె.రామమూర్తి అనే మన దేశస్థునికి విముక్తి లభించడం వంటి సంబంధిత పరిణామాలు ‘ఐఎస్‌ఐఎస్’ బీభత్స వ్యవస్థకు ఉదాహరణలు. ఇలా ‘ఐఎస్‌ఐఎస్’ ప్రమాదం ప్రాధాన్యం పొందడం పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’కి ముఖం దాచుకొనడానికి కలసివచ్చిన అవకాశం!