సంపాదకీయం

కాంగ్రెస్‌కు ‘విముక్తి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉత్తర’ పరాజయాల తరువాత కాంగ్రెస్ భవితవ్యంపై చర్చ జరగడం సహజమైన వ్యవహారం. కానీ, రాహుల్ గాంధీ ‘నాయకత్వ పటిమ’ గురించి కూడ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోందని ప్రచారం కావడం హాస్యరస పూరకమైన, అపహాస్య విస్ఫోటకమైన పరిణామం. ‘రాహుల్ నాయకత్వం’ అన్న పదాలను వినగానే జనానికి జుగుప్సాకరమైన అనుభూతి కలుగుతుండడం దశాబ్ది చరిత్ర. ఇటీవలి కాలంలో ఇలా జుగుప్సకు అలవాటుపడిన ప్రజలకు ‘రాహుల్ నాయకత్వం’ అన్న పదాలను విన్న వెంటనే నవ్వు కూడ వస్తోంది. ‘రాహుల్ నాయకుడా?’ అన్నది ప్రజలు మాత్రమే కాక దిల్లీకి కొంతదూరంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంధిస్తున్న ప్రశ్న! ఆయన సోనియా గాంధీ కుమారుడు. ఒకసారి గడ్డం పెంచుతాడు, మరోసారి గడ్డాన్ని సగానికి తగ్గించి ‘ఫ్రెంచి ఫ్యాషన్’ను వెలయిస్తాడు. మరోసారి పూర్తిగా ముఖ క్షవరం చేయించుకొని పాతికేళ్ల బాలాకుమారుని వలె ‘్భంగిమ’- పోస్చర్-లను అభినయిస్తాడు. నలబయి ఐదేళ్ల వయస్సు వాడైనా ఇరవై ఏళ్లవాడి వలే బాధ్యతా రహితంగా అదృశ్యమైపోతాడు, విదేశాల్లో విహరిస్తాడు! తరచూ విశ్రాంతి తీసుకుంటాడు- ‘ఎంతో కష్టపడి వేదికలపై విచిత్ర ప్రసంగ విన్యాసాలు చేసిన తరువాత..’! ఇదంతా జనాలకు, కాంగ్రెస్‌లో దిల్లీ చూడని కార్యకర్తలకు రాహుల్ పట్ల ఏర్పడి ఉన్న అవగాహన. ఆయన ప్రధానమంత్రినీ, ఇతర అధికారపక్ష నాయకులను తరచూ నిందిస్తాడు. అలా నిందించకపోతే తనకు పేరురాదు.. అందుకని! ఆర్థిక, సామాజిక, ధార్మిక, వాణిజ్య, రక్షణ, రాజకీయ సమస్యలు గాని, రాజ్యాంగ ప్రక్రియ గురించి గాని రాహుల్‌కు ఏమీ తెలియదు. ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నించిన దా ఖలా కూడ లేదు. ఒకవేళ ప్రయత్నించడానికి పూనుకుంటే వెంటనే అలసిపోతాడు. విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లి రావల్సి వస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలి తనయుడు కాబట్టి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు కాబట్టి ఈ వారసత్వ దర్పంతో రాజకీయాల్లో బలాదూరుగా తిరుగుతున్న రాహుల్‌కు పేరు తెచ్చుకొనడానికి ఒకటే మార్గం ఉంది. ప్రధాని మోదీని నిందించడం ఆ మార్గం. ‘ఘటం భింద్యాత్ పటం భింద్యాత్, కుర్యాత్ వాగార్ద్భ స్వరం.. యేనకేనపి ఉపాయేన ప్రసిద్ధః పురుషోభవేత్’- కుండను పగులకొట్టి కాని, బట్టలను చింపుకొని కాని, గాడిద వలే ఓండ్రపెట్టి కాని, ఏదో ఒక ఉపాయంతో పేరు తెచ్చుకోవాలి- అన్నది ప్రాచీన సూక్తి. దీన్ని ఎవరో రాహుల్ చెవిలో ఊదినట్టుంది. అందువల్ల ఏమీ తెలియని రాహుల్ ప్రధానమంత్రిని, ఆయన సహచరులను తరచూ విమర్శిస్తున్నాడు. మాధ్యమాలలో ప్రచారం పొంది పేరు తెచ్చుకుంటున్నాడు. అయినప్పటికీ ఈయన ప్రసిద్ధిని గుర్తించిన దిల్లీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను సోనియా కుమారుడు కాబట్టి గౌరవిస్తున్నారు. కానీ- ‘ఆయన నాయకుడా?’ అని వారంతా ఆశ్చర్యపోతున్నారు. జనం సంగతి చెప్పనక్కర్లేదు. ఆయన నాయకుడు కావడం వేరే సంగతి. ఆయన ‘గొప్ప వ్యక్తా?’ అన్నది జనం సంధిస్తున్న ప్రశ్న..
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అఖిలేశ్ యాదవ్ మాత్రమే రాహుల్‌ను నాయకుడిగా గుర్తించాడు. ఇలా గుర్తించడానికి ఏకైక కారణం అఖిలేశ్ కూడా స్వయంగా నాయకుడు కాకపోవడం. తన తండ్రి ములాయంసింగ్ యాదవ్ 1990 నుంచి నిర్మించిన సమాజ్‌వాదీ పార్టీ-సపా-ని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ‘సఫా’ చేసిన ఘనుడు అఖిలేశ్. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1969 నుంచి నిర్మించిన కాంగ్రెస్‌ను 1989లో ఆమె తనయుడు, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఘోర పరాజయం పాలు చేసినట్టు 2012లో ములాయం గెలిపించిన ‘సపా’ను అఖిలేశ్ ఇప్పుడు పతనం పాలు చేశాడు. ఇలా నాయకుడు కాని అఖిలేశ్ మాత్రమే రాహుల్‌ను నాయకుడిగా గుర్తించాడు. ఆయన కూడ ఇప్పుడు ‘రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్’తో పొత్తుపెట్టుకొనడం వల్ల తమ పార్టీ పరాజయం పాలైందని బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ‘కాంగ్రెస్-సపా’ కూటమి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసిన అఖిలేశ్ ఫలితాలు వెలువడిన తరువాత ఇలా మాట ఫిరాయించడం మలిన రాజకీయం కావచ్చు. కానీ- అఖిలేశ్ పార్టీని రాహుల్ ‘రాహువు’ వలే గ్రసించాడన్నది స్పష్టం. రాహుల్‌ది ‘నాయకత్వం’ కాదు, ఆయన ఒక ‘గ్రహణం’! కాంగ్రెస్ గ్రహణ గ్రస్తమై ఉంది..
కాంగ్రెస్‌కు ఇలా రాజకీయ గ్రహణం పట్టడం రాహుల్‌తోనే ఆరంభం కాలేదు. ఈ ‘గ్రహణం’ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసాదించిన వారసత్వం.. ఇందిరా గాంధీ దాదాపు పంతొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్‌ను గ్రహణ యుక్తం చేసినప్పటికీ రాజీవ్ గాంధీ మళ్లీ గ్రహణగ్రస్తం చేశాడు. 1977లో అత్యవసర పరిస్థితి- ఎమర్జెన్సీ- అవసాన దశలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఆరునెలలు మాత్రమే వౌనంగా ఉండిన ఇందిర మళ్లీ విజృంభించింది. దేశంలోని మారుమూల గ్రా మాలకు సైతం వెళ్లింది. 1978లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఎనిమిది కిలోమీటర్లకొకచోట ఇం దిర బహిరంగ సభల్లో ప్రసంగించింది. ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది, మూడేళ్లు తిరగకముందే మళ్లీ ప్రధాని కాగలిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల పరాజయం తరువాత సోనియా గాంధీ ఏం చేస్తోంది? అత్తగారి వలె అభినయించిన సోనియా ఎక్కడ పర్యటిస్తోంది? రాహుల్ మాత్రం పర్యటించాడు- విదేశాల్లో!
ఇలా ఇందిరా గాంధీ తప్ప జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వ పరంపరలో నాయకత్వం వహించినవారు, వహించగలిగిన వారు ఎవరూ లేరన్నది కఠోరమైన చారిత్రక వాస్తవం. 1946- 1947 సంవత్సరాల్లో సర్దార్ వల్లభభాయి పటేల్ కాంగ్రెస్ నాయకుడు, ప్రజా నాయకుడు. కానీ ఆయన ప్రధానమంత్రి కాలేదు. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు భిన్నంగా ‘నాయకుడు కాని’ జవహర్‌లాల్‌ను మహాత్మాగాంధీ ప్రధానిని చేశాడు. కాంగ్రెస్ నెత్తిన రుద్దాడు. అదీ కాంగ్రెస్‌కు తొలి గ్రహణం! 1984లో ఇందిరమ్మ హత్య తరువాత ఆమె కుమారుడు రాజీవ్ కాంగ్రెస్‌ను కాజేయడం మలి గ్రహణం! అప్పనంగా వచ్చిన అధికారాన్ని ఐదేళ్లు చెలాయించడం మినహా రాజీవ్ ఈ దేశానికి ఒరగబెట్టింది లేదు. రాజీవ్ భార్య, కుమారుడు 1997 నుంచి ‘అనధికార’ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈ ‘అధికారం’ మాటున రాహుల్ విలాస పురుషుడై విహారయాత్రలు, విదేశీ యాత్రలు చేస్తున్నాడు. కాంగ్రెస్ ముక్త భారతం కాదు కావలసింది.. సోనియా కుటుంబ విముక్త కాంగ్రెస్ రావాలి. ప్రజాస్వామ్యంలో పటిష్టమైన ప్రతిపక్షం కూడ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గ్రహణం నుంచి విముక్తం కావాలి!