సంపాదకీయం

ఆదిత్య ‘ఉదయం’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్యనాథ్ యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం భారత జాతీయ సంప్రదాయాలకు అనుగుణమైన పరిణామం! ఈ సంప్రదాయాల ధ్యాసలేని రాజకీయ విశే్లషకులకు, ఈ జాతీయతా పథంనుండి తప్పిపోయిన పాశ్చాత్య భావదాసులకు ఒక ‘యోగి’ లేదా ఒక సర్వసంగ పరిత్యాగి ముఖ్యమంత్రి కావడం గురించి విచిత్రమైన ప్రశ్నలు ఉదయించవచ్చు! కానీ ‘యోగులు’ సర్వసంగ పరిత్యాగులు స్వార్థరహితులై వ్యక్తిగత రాగద్వేషాలకు దూరంగా ఉండడం మాత్రం జాతీయ సంప్రదాయం. సమాజ హితం గురించి ఉద్యమించవలసి వచ్చినప్పుడు యోగులు ‘్ధర్మాచార్యులు’ ‘పరివ్రాజకులు’ ‘సర్వసంగ పరిత్యాగులు’ అగ్రగాములుగా ఉండడం చరిత్ర! కానీ మన దేశంపై విదేశీయుల పెత్తనం సాగిన కాలంలో ఈ చరిత్ర ‘విస్మృతి’కి గురైంది. ప్రధానంగా బ్రిటన్ దురాక్రమణ కాలంలో మన జాతి సాంస్కృతిక దాస్యగ్రస్తం అయింది. ఆర్థిక రాజకీయ స్వాతంత్య్రం నశించడం వల్ల ఒక జాతికి ప్రమాదం. కానీ సాంస్కృతిక స్వాతంత్య్రం నశించిపోవడం మరింత ప్రమాదం. మనకు 1947లో రాజకీయ స్వాతంత్య్రం మాత్రం వచ్చింది. సాంస్కృతిక స్వాతంత్య్రం ఇప్పటికీ సమగ్రంగా లేదు! వచ్చిందనుకున్న ఆర్థిక స్వాతంత్య్రాన్ని 1994నుంచి మొదలైన ‘వాణిజ్య ప్రపంచీకరణ’ హరించి వేస్తోంది. ఈ వాణిజ్య ‘ప్రపంచీకరణ’ మన జాతీయ సంస్కృతిని కూడ మరోసారి గ్రహణగ్రస్తం చేస్తోంది! సాంస్కృతిక దాస్యంవల్ల మన ఆలోచనా రీతి మారింది, పాశ్చాత్య భావదాస్యానికి గురి అయింది. మన ప్రాధాన్యాలు, దృక్పథాలు మారిపోయాయి. సంస్కృతిలో రాజకీయం, వాణిజ్యం, విద్యలు, విజ్ఞానాలు, మతాలు, భాషలు, ఆహారాలు, వేషభూషలు- ఇంకా ఎనె్నన్నో భాగం! ఇదీ భారతీయత...ఈ సం స్కృతి ప్రాతిపదికగా వికసించిన భారత జాతీయత లేదా హైందవ జాతీయతలో ‘రాజ్యాంగ వ్యవస్థ’ ఒక భాగం! కానీ విదేశీయ దురాక్రమణ ఫలితంగా రాజకీయంలో విస్తృత సంస్కృతిని ఇరికించే ప్రయత్నం జరిగింది! ‘‘దేశభక్తి అంటే రాజకీయం...సమాజ హితం అంటే రాజకీయం!’’ ఇలా సర్వస్వానికి రాజకీయం ప్రాతిపదిక కావడం మారిపోయిన మన స్వభావానికి నిదర్శనం! ఈ భావదాస్యపు విశే్లషకులకు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం విస్మయకరమైన విచిత్రం కావచ్చు! కానీ రాజకీయం విస్తృత సంస్కృతిలోని ఒక ప్రధాన అంశం మాత్రమేనని, రాజ్యాంగ వ్యవస్థ ‘జాతి’కి ఉన్న ఒక ప్రధాన లక్షణమని గుర్తించిన నిజమైన భారతీయులకు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం విచిత్రం కాదు. జాతీయతా నిష్ఠ మరింత పెరగడానికి దోహదం చేయగల అభిలషణీయ పరిణామం మాత్రమే!! దేశభక్తి రాజకీయం కాదు, రాజకీయ నాయకులకు ‘జయ’నాదాలు చేయడం కాదు! దేశభక్తి మాతృదేశం పట్ల మమకారం!! అవైద్యనాథ్ ముఖ్యమంత్రి కావడం ఈ మమకారం ప్రజలలో మరింతగా విస్తరిస్తోందనడానికి నిదర్శనం...
ఈ నిదర్శనం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆదిత్యనాథ్ ఆదివారం ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరోసారి ప్రస్ఫుటించింది! వేదిక మీదకు ఆదిత్యనాథ్ వచ్చినప్పుడు కార్యకర్తలు హర్షం ప్రకటించారు. కాని వారు ‘ఆదిత్య నాథ్‌కీ జయ్‌‘ అని ఎలుగెత్తలేదు! వేదికమీదకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కూడ ఈ భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు ‘నరేంద్ర మోదీకీ జయ్’ అని జయకారాలు మారుమోగించలేదు! ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించినప్పుడు, నరేంద్ర మోదీ వేదికపైకి వచ్చినప్పుడు వారు ‘్భరత్ మాతాకీ జయ్’ అని మాత్రమే నినదించారు! ‘రాజకీయం’ పరిధిలో ఇరుక్కొని ఉన్న ‘జాతీయత’కు విముక్తి కలిగించడం అంటే ఇదీ.... ‘సంస్కృతి’లో ‘రాజకీయం’ ఒక అంశం మాత్రమే అన్న వాస్తవానికి మరో సాక్ష్యం ఇదీ!! సమాజ్‌వాదీ పార్టీ ఓడిపోవడం భారతీయ జనతాపార్టీ గెలవడం అందువల్ల కేవలం రాజకీయాలకు, ఉత్తరప్రదేశ్‌కు పరిమితమైన ఘటనలు కావడం! వౌలికమైన జాతీయత మాతృదేశం పట్ల మమకారం మరింత విస్తృతం కావడానికి ఈ పరిణామం దోహదం చేస్తోంది! ఆదిత్యనాథ్ ప్రతీక మాత్రమే! జాతీయతా పతాకం ధరించిన సాంస్కృతిక శక్తి మరో ముందడుగు వేయడం సంభవించిన ప్రధాన పరిణామం. పూర్వయుగాలలో ‘జనకుడు’ ‘విదేహ’ పాలకుడు, రాజు! కానీ ఈ మిథిలానగరాధిపతి రాజకీయం సంస్కృతిలో భాగమైన ‘జాతీయత’కు చారిత్రక సాక్ష్యం! ఈ చరిత్రకు ఆదిత్యనాథ్ పునరావృత్తి కావచ్చు...ఎందుకు కారాదు??
జాతీయ సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణ వల్లనే మన దేశం అన్నిరంగాలలోను ప్రగతిని సుగతిని సాధించగలదు! ప్రపంచంలోని అన్ని దేశాలవారు తమ తమ జాతీయ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకుంటున్నారు. కానీ మనదేశంలో మాత్రం అధికాధిక విద్యావంతులు అమెరికన్లలాగా, ఐరోపీయ జాతులుగా చెలామణి అవుతున్నారు! మన దేశపు అనాది జాతీయ అస్తిత్వం హిందుత్వం లేదా భారతీయత! వివిధ మతాలు, భాషలు, అసంఖ్యాక వైవిధ్యాలు ఈ వౌలిక జాతీయతలో భాగం. అందువల్ల బయటనుంచి వచ్చిన మతాలవారైనా, స్వదేశంలో పుట్టి పెరిగిన వారైనా ఈ ‘జాతి’ తమదని, తాము ఈ జాతీయతకు వారసులమని భావించడం సహ జ ప్రవృత్తి! ఈ మాతృభూమిపట్ల మమకారం జాతీయత! ఈ మాతృభూమి సమష్టి హితం సంస్కృతి! ఈ ‘వారసత్వ’పు అవగాహన వల్లనే ఈ దేశంలో పుట్టిపెరిగిన మహాపురుషులు తమకు ఆరాధ్యులని, ఆదర్శ పురుషులని గ్రహించగలరు! జార్జి వాషింగ్టన్ ‘అమెరికా’లోని అన్ని మతాలకు ఆరాధ్యుడు. అలాగే రఘురాముడు, యదుకుల కృష్ణుడు, ఛత్రపతి శివాజీ, వివేకానందుడు వంటి వారు ఈ దేశపు జాతీయ సంస్కృతికి వారసులైన అన్ని మతాలకు ఆరాధ్యులు! ఈ వాస్తవం వెలిగినట్టయితే అయోధ్య రామజన్మభూమిపై వివాదం లేదు! రఘురాముడు ఈ దేశపు జాతీయ పురుషుడు, రామమందిరాన్ని కూలగొట్టిన మొఘలాయి బాబర్ విదేశీయ బీభత్సకారుడు! అందువల్ల ఈ దేశ ప్రజలందరూ రఘురాముని మందిర పునర్‌నిర్మాణం కోరాలి, బాబర్‌ను ద్వేషించాలి!! ఈ జాతీయ అస్తిత్వం ప్రస్ఫుటించడానికి ఆదిత్యనాథ్ రాజకీయ రంగంలో కృషి చేశాడు!!
ఈ దేశపు వౌలిక అస్తిత్వమైన హైందవ జాతీయ తత్త్వాన్ని బ్రిటన్ దురాక్రమణ దారులు ఒక మతంగా చిత్రీకరించిపోయారు! అందువల్ల జాతీయ తత్త్వానికి సంబంధించిన ప్రతి అంశం మతతత్త్వంగా ప్రచారవౌతోంది! గంగానది కావచ్చు, గోసంతతి కావచ్చు, భూమాత కావచ్చు....ఈ విష ప్రచారానికి విరుగుడు ఆదిత్యనాథ్ వంటి రాజకీయ వేత్తలు! హిందుత్వం సర్వమత సమభావం... హిందుత్వం సర్వ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం...‘హిందుత్వం’ ‘్భరతీయత’కు పర్యాయ పదం...హిందుత్వం వౌలిక జాతీయ తత్త్వం..ఆదిత్యనాథ్ రాజకీయాలలో ఈ జాతీయతా జాగృతికి రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నాడు! ఈ కృషికి మరింత విస్తృతి ఆయనకు పాలనాధికారం లభించడం...