సంపాదకీయం

మందిర మధ్యవర్తిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య రామజన్మభూమి దేవాలయ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం వారు సలహా ఇవ్వడం ఆలస్యంగానైనా సంభవించిన శుభ పరిణామం. ఈ వి వాదం దాదాపు ఏడేళ్లుగా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. అంతకుపూర్వం దశాబ్దుల పాటు ఈ వివాదం అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం పరిశీలనకు గురి అయింది. 2010లో ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పక పూర్వం లేదా కనీసం ఏడేళ్ల క్రితం ఈ ‘మధ్యవర్తిత్వం’ గురించి సుప్రీం కోర్టు ప్రతిపాదించి ఉండాలి. అలా ప్రతిపాదించ లేదు. అ యోధ్య రామజన్మభూమి మందిరాన్ని క్రీస్తుశకం 1528లో మొఘలాయి బాబర్ అనే జిహాదీ బీభత్సకారుడు కూల్చివేయడం వివాదానికి మూలం. ఈ వివాద వారసత్వం శతాబ్దులుగా కొనసాగుతోంది. ఈ చారిత్రక సత్యాన్ని ఈ దేశంలోని కొందరు అంగీకరించక పోవడం వివాద కారణం. ఈ చారిత్రక సత్యాన్ని అంగీకరించని వారికి ప్రస్తుతం ‘ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు’- ఏఐఎంఎల్‌బి- వంటి సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి చరిత్ర బాబర్ పేరుతో మసీదు నిర్మాణం అయిన నాటి నుంచి మాత్రమే మొదలైందని ‘ముస్లిం లా బోర్డు’ వంటి సంస్థలు ప్రచారం చేశాయి, చేస్తున్నాయి. అయితే, ఇలా ‘బాబరీ మసీదు’ పేరుతో చెలామణి అయిన కట్టడంలో ఇస్లాం మతస్థులు ప్రార్థనలు చేసినట్లు చారిత్రక ఆధారాలు లేవు. అందువల్ల అది మసీదు కాదని బాబర్ పేరుతో చెలామణిలో ఉన్న ‘కట్టడం’ మాత్రమేనని రామజన్మభూమి మం దిర ఉద్యమకారుల వా దం. ఏమైనప్పటికీ ర ఘురాముడు అయోధ్యలో జన్మించడం చ రిత్ర. మొఘలాయి బా బర్ అయోధ్యలో జ న్మించలేదు. మధ్య ఆ సియాలోని సమీర్‌ఖండ్‌లో పుట్టి పెరిగిన మొ ఘలాయి బాబర్ క్రీ స్తుశకం 1526లో మన దేశాన్ని దురాక్రమించడం చరిత్ర. ఈ కారణంగా రఘురాముడు స్వజాతీయ మహా పురుషుడు, బాబర్ విదేశీయ దురాక్రమణదారుడు. భారతీయులందరూ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా స్వదేశీయ మహా పురుషుడిని సమర్ధించాలి. విదేశీయ దురాక్రమణదారుని నిరాకరించాలి. ఏ దేశంలోనైనా ఇది సహజం. ఇది న్యాయం! బ్రిటన్ ప్రజలు హిట్లర్‌ను సమర్థించరు. అలాగే భారతీయులు బాబర్ అనే విదేశీయుడిని సమర్థించరాదు. ఈ ‘జాతీయత’ను అందరూ సమర్ధిస్తే రామజన్మభూమి వివాదం లేదు. కొందరు విదేశీయ దురాక్రమణదారుడైన బాబర్‌ను సమర్ధించడం వివాదానికి ప్రాతిపదిక.
వివాదం న్యాయస్థానం వెలుపల పరిష్కారం కాకపోవడం వల్ల మాత్రమే సంబంధితులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం వారు వివాదాన్ని సత్వరం విచారించి తీర్పు చెప్పడం వల్ల మాత్రమే వివాదానికి పరిష్కారం లభించగలదు. దశాబ్దుల పాటు కాలయాపన జరిగినప్పటికీ అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం వారు చివరికి తీర్పు చెప్పారు. ఆ తీర్పును అంగీకరించని వారు సర్వోన్నత న్యాయస్థానానికి వివాదాన్ని నివేదించారు. మధ్యవర్తిత్వమే పరిష్కార మార్గమైనచో అలహాబాద్ న్యాయస్థానం వారు దశాబ్దుల క్రితం ఉభయ పక్షాలకు ఈ సలహా చెప్పి ఉండవచ్చు! 2011 నుంచి ఈ వివాదం సర్వోన్నత న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉంది. ఆరేళ్ల క్రితమే సుప్రీం కోర్టు వారు ఈ మధ్యవర్తిత్వం సంగతిని మాట్లాడి ఉండవచ్చు! అదేమీ జరగలేదు. అప్పీలు దాఖలైన తర్వాత ఆరేళ్లుగా సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన ప్రగతి ఏమిటి? ఇప్పుడైనా భారతీయ జనతాపార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ‘క్షిప్ర న్యాయ యాచిక’ను దాఖలు చేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఇలా స్పందించింది. ‘రామజన్మభూమి-బాబరీ కట్టడం’ వివాదాన్ని వేగవంతంగా పరిష్కరించాలన్నది డాక్టర్ స్వామి అభ్యర్థన.. ఈ దశలో సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహార్ మధ్యవర్తిత్వం గురించి మంగళవారం ప్రస్తావించారు.
ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించడం వల్ల అయోధ్యపై సత్వర సయోధ్యకు చర్యలు ఆరంభం కాగలవన్న ఆశలు చిగురించాయి. భారతీయ జనతాపార్టీ వారు, రామమందిర నిర్మాణాన్ని సమర్ధిస్తున్న ఉద్యమ నిర్వాహకులు కూడ మధ్యవర్తిత్వాన్ని సమర్ధించడం హర్షణీయం. న్యాయస్థానం పర్యవేక్షణలో మధ్యవర్తిత్వం ప్రక్రియ కొనసాగాలన్నది సుబ్రహ్మణ్య స్వామి చెప్పినమాట! అవసరమైతే తానే మధ్యవర్తిగా ఉండగలనని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి చెప్పడం కూడా పరిష్కార నిష్ఠకు ప్రతిబింబం. కానీ ఈ ప్రతిపాదన ఆచరణకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ‘ముస్లిం లా బోర్డు’లోని ఒక వర్గం వారు తదితర ‘బాబరీ మసీదు’ సమర్ధకులు న్యాయస్థానం వారి ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండడం ఇందుకు కారణం. అంటే ‘బాబరీ మసీదు కార్యాచరణ సంఘం’లోని ఒక వర్గం వారికి ‘రామజన్మభూమి మందిర ఉ ద్యమకారుల’తో స యోధ్య ఇష్టం లేదని స్పష్టమైపోయింది! స యోధ్య ద్వారా చర్చల ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకొనడానికి ‘బా బరీ’ ఐక్య కార్యాచరణ సమితి వారు ప్రయత్నించవచ్చు! కానీ, మ ధ్యవర్తిత్వ ప్రతిపాదన వెలువడిన వెంటనే తిరస్కరించడం ద్వారా ‘బాబరీ’ సమర్థకులలోని కొందరు మరోసారి ‘కయ్యానికి కాలుదువ్వే’ వైఖరిని ప్రదర్శించినట్టు అయింది. మధ్యవర్తిత్వం వద్దని, సుప్రీం కోర్టు వివాదాన్ని విచారించి తీర్పు చెప్పాలని బాబరీ సమర్ధకులలోని ఈ వర్గం వారు ప్రకటించడం విచిత్రం. వారి మనసు మారుతుందని ఆశిద్దాం.
అయోధ్యలోని ‘వివాద స్థలం’లో జరిగిన తవ్వకాలలో అతి ప్రాచీన హిందూ దేవాలయం అవశేషాలు బయట పడినాయి. మిగిలిన ఆధారాల మాట ఎలా ఉన్నప్పటికీ వివాద స్థలంలో బాబరీ కట్టడం నిర్మించడానికి అనేక దశాబ్దులకు పూర్వం నుంచి హిందూ దేవాలయం ఉందన్నది తవ్వకాల వల్ల నిగ్గుతేలిన నిజం! అందువల్ల బాబర్ ఇక్కడ మందిరాన్ని ధ్వంసం చేశాడన్నది స్పష్టం! అప్పటి నుంచి అంటే 1528 నుంచి దాదాపు నాలుగు వందల యాబయి ఏళ్లకు పైగా మందిర రక్షకులకు, మందిర ధ్వంసకులకు మధ్య డెబ్బయి ఏడు సార్లు ఘర్షణలు జరగడం చరిత్ర! ‘జిహాదీలు’ క్రీస్తుశకం పదకొండవ దశాబ్ది నుంచి దేశంలోని వేలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. ఈ చరిత్రను వారు స్వయంగా చాటుకున్నారు. వివాద స్థలం ‘మందిరం’ అన్న దానికి ఇది కూడా తిరుగులేని సాక్ష్యం! మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు లేదా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ద్వారా కావచ్చు వావాద స్థలం మందిరమని ధ్రువపడడం ఖాయం! అయోధ్య రఘురాముని జన్మస్థలమన్నది ప్రపంచం గుర్తించిన వాస్తవం..