సంపాదకీయం

అవసరం లేని ‘దిగుమతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అత్యధిక స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావడానికి రైతన్నల ఆర్తనాదం విచిత్రమైన నేపథ్యం! ఉత్పత్తులు పెరిగి ధరలు పడిపోయినప్పుడు దళారీలు దోచుకుంటున్నారు. ఉత్పత్తులు తగ్గి ధరలు పెరిగినప్పుడు కూడ దళారీలు దోచుకుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- మారీచ మృగం సృష్టించిన మాయాజాలం ఇది. కందులు కావచ్చు, మిరపకాయలు కావచ్చు, పసుపు కావచ్చు, కూరగాయలు కావచ్చు రెండేళ్ల క్రితం ఉత్పత్తులు తగ్గిపోయాయి. కృత్రిమ కొరతను సృష్టించిన దళారీలు కందిపప్పును కిలో రెండు వందల చొప్పున అమ్మి దోచుకున్నారు. కందులు, మిర్చి, పసుపు వంటి వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. దళారీలు ధరలను పాతాళ పతనం చేసి రైతులను దోచుకుంటున్నారు. ఉత్పత్తులు పెరిగినా, తగ్గినా కూడా దోపిడీ మాత్రం సమానం. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయన్న అనుమానం కలుగగానే దళారీలు కృత్రిమంగా కొరతను సృష్టించి ధరలు పెంచి వినియోగదారులను దోచేశారు, దోచుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరగగానే ‘విపణి ప్రాంగణాల’లో ధరలను తగ్గించి రైతులకు గిట్టుబాటు ధరలు లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా దళారీలు విశృంఖల వ్యవహారం నడపడం పేరు ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ లేదా ‘మార్కెట్ ఎకానమీ’! ధరలు పెరగడాన్ని కాని, తగ్గడాన్ని కాని ప్రభుత్వాలు నియంత్రించరాదన్నది స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ వౌలిక సూత్రం. వస్తువులకు గిరాకీ తగ్గడం, పెరగడం ప్రాతిపదికగా ధరలు తగ్గాలట, పెరగాలట! గిరాకీని దళారీలు నియంత్రిస్తున్నా రు!
దేశంలో ఈ ఏడాది అభూత పూర్వకమైన ఆహారం ఉత్పత్తి కా వడం హర్షణీయం. ఆ హార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు స హజమైన ప్రగతికి నిదర్శనాలు. ఈ సహజమైన ప్రగతి మానవ జీవనగతి. మిగిలిన సౌకర్యాలు, భోగాలు, సదుపాయాలు, విలాసాలు కృత్రిమ ప్రగతి రూపాలు. అవి ఉన్నా లేకున్నా జనజీవన శ్వాస ఆగదు. కానీ రెండు పూటలా భోజనం లేకపోతే ప్రాణం విలవిలలాడి పోతుంది. శారీరక, మానసిక వ్యాధులన్నింటి లోను ‘ఆకలి తీరకపోవడం’ అతి భయంకరమైన రుగ్మత! అందుకే ‘అన్నాత్ భవన్తి భూతాని’- ప్రాణులు ఆహారం వల్లనే రూపొందుతున్నాయి అన్నది సనాతన సత్యం. మానవుడు శ్రేష్ఠమైన ప్రాణి. అందువల్ల దేశంలో ఈ ఏడాది- గత వర్షరుతువు నుంచి రానున్న గ్రీష్మరుతువు వరకు నడుస్తున్న సంవత్సరం- ఇరవై ఏడు కోట్ల ఇరవై లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుండడం జనానికి ఆనందం కలిగించదగిన పరిణామం. అమెరికా నుంచి దిగుమతి అయిన ముక్కిపోయిన ఆహార ధాన్యాలు, ఆస్ట్రేలియా నుంచి తరలివచ్చిన పుచ్చిపోయిన ఆహార ధాన్యాలు దేశంలో పంపిణీ కావడం క్రీస్తుశకం 1960 దశకం నాటి ముచ్చట.. అంతకుపూర్వం 1947 నుంచి కొనసాగిన ముచ్చట! దేశం ఆహారం ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే కాక విదేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేయడం మొదలైన తరువాత రెండు దశాబ్దులు గడిచిపోయాయి. కానీ ఆహార సమృద్ధి, అధికోత్పత్తులు సృష్టిస్తున్న సమస్యలు మన ప్రగతిని నిలదీస్తుండడానికి కారణం సమాంతరంగా రెండు దశాబ్దుల క్రితం మొదలైన ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే ‘స్వేచ్ఛా విపణి’. ఆహారం కొరత వల్ల ఏర్పడుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేక పోవడం ‘స్వేచ్ఛా విపణి’ వ్యవస్థ వౌలిక లక్షణం. ధరలు పెరగడం ‘కొరత’ వల్ల సంభవించే తక్షణ పరిణామం. ఆహార సమృద్ధి వల్ల ఏర్పడుతున్న సమస్యలను సైతం ప్రభుత్వం పరిష్కరించరాదన్నదే ‘స్వేచ్ఛా విపణి’ వ్యవస్థలోని ఆదర్శం. ధరలు పడిపోయి రైతన్నలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ‘సమృద్ధి’ వల్ల సంభవిస్తున్న పరిణామం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేవలం మహారాష్ట్ర ప్రాంతంలోనే దాదాపు మూడు వందల ఎనబయి మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారట!
తెలుగు రాష్ట్రాల్లో కందులు, మిర్చి పండించిన రైతులు ఈ ఏడాది భారీగా నష్టాల పాలుకావడం ‘సమృద్ధి’ సృష్టించిన సమస్య. రెండేళ్ల పాటు కందిపప్పు, మిర్చి ధరలు భారీగా పెరగడం వల్ల మరింత ఎక్కువ విస్తీర్ణంలో వీటిని పండించడం మొదలైంది. ఉత్పత్తులు పెరగడం వల్ల ఎగుమతులు పెరిగే విధంగా ఆర్థిక వ్యవస్థ సహజంగా రూపొందాలి. కానీ, గత రెండేళ్లుగా కొరత ఏర్పడిన సమయంలో వలెనే ఈ ఏడాది కూడ కందిపప్పు దిగుమతులను ప్రభుత్వం అనుమతిస్తోందట. గత ఏడాది దేశంలో ఇరవై ఆరులక్షల టన్నుల కందిపప్పు ఉత్పత్తి కాగా ఈ ఏడాది నలబయి రెండు లక్షల టన్నుల కందిపప్పు ఉత్పత్తి అయిందట. గత ఏడాది క్వింటాలు కందులుకు పదకొండు వేల రూపాయల వరకూ రైతుకు లభించిందట. కానీ ఈ ఏడాది క్వింటాలుకు నాలుగైదు వేల రూపాయలు మాత్రం గిట్టుబాటు కావడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు. ఇదంతా దళారీల మాయాజాలం. మిర్చి పండించిన రైతులకు గత ఏడాది క్వింటాలుకు తొమ్మిది వేల రూపాయలకు పై గా లభించగా ఈ ఏడాది ఐదు వేల రూ పాయలకే అమ్ముకోవలసి వస్తోంది. రైతులు విపణి ప్రాంగణాల్లోను బయటా మిరపకాయలను తగలబెట్టి తమ నిరసనలు తెలిపినా దళారీలకు ‘చీమలు’ కుట్టడం లేదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రైతులకు గిట్టుబాటు ధరలను ఇప్పించవు. అలా ఇప్పించడం ‘మార్కెట్ ఎకానమీ’ స్ఫూర్తికి విరుద్ధమని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డబ్ల్యుటిఓ- నిర్దేశించింది. దీంతో దళారీల సామ్రాజ్యం లోకి ప్రభుత్వాలు కాలు మోపడం లేదు. కందులు, గోధుమల ఉత్పత్తులు భారీగా పెరిగినప్పటికీ, విదేశాల నుంచి కందులు, గోధుమల దిగుమతులు ఆగకపోవడానికి కారణం కూడ మార్కెట్ ఎకానమీ వౌలిక సూత్రం. అందువల్ల దిగుమతులను నిషేధించడం వంటి సంకుచిత- ప్రొటక్షనిస్ట్- జాతీయ ప్రయోజన పరిరక్షణకు మన ప్రభుత్వం పాల్పడడం లేదు. మన వ్యవసాయ రంగం గుల్ల అయినప్పటికీ ఫరవాలేదు. మార్కెట్ ఎకానమీ హోదా మనకు ప్రధానం.
మార్కెట్ ఎకానమీ హోదాను కోల్పోయినట్టయితే విదేశాల నుంచి పెట్టుబడులు రావట! సామాన్య ప్రజలకు అర్థం కాని గొప్ప ఆర్థిక రహస్యం ఇది! మన్‌మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్వేచ్ఛా విపణిని, ప్రపంచీకరణను మన నెత్తికెత్తింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఈ ఆర్థిక వారసత్వాన్ని వదిలించుకోక పోవడం నడుస్తున్న చరిత్ర. వదిలించుకుని ఉంటే కందిపప్పు, గోధుమల దిగుమతులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి ఉండేది.. దిగుమతి సుంకం మాత్రం పెంచింది..!