మెయన్ ఫీచర్

గోరక్షణతో భూరక్షణ సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవును కాని గోసంతతిని కాని హత్యచేసే వారికి పదునాలుగేళ్లపాటు జైలుశిక్షను విధించడానికి వీలుగా గుజరాత్ ప్ర భుత్వం చట్టాన్ని సవరించడం విప్లవాత్మక పరిణామం! నేరం ఋజువైనట్టయితే పదునాలుగేళ్లు కటకటాల వెనుక పడి ఉండాలన్న భయంతోనైనా ఆవులను చంపడం హంతకులు మానుకోవడానికి ఈ సవరణ చట్టం వీలు కలిగిస్తుంది. ఆవును పోషించడం పాలించడం పరిరక్షించడం పెంపొందించడం మన దేశంలో అనాదిగా జాతీయ సంప్రదాయం. భారత రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణం ఈ జాతీయ సంప్రదాయానికి ధ్రువీకరణ మాత్రమే. రాజ్యాంగంలోని మార్గదర్శక సూత్రాలను పాటించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. గుజరాత్ ప్రభుత్వం ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడ ‘గుజరాత్’ను అనుసరించడం వల్ల ‘స్వచ్ఛ్భారత్’ పునర్ నిర్మాణం వేగవంతం అవుతుంది! మన దేశానికి సంబంధించిన మంచి విషయాలకు ప్రచారం చాలా తక్కువ.. అత్యధిక విద్యావంతులకు తథాకథిత బుద్ధిజీవులకు ధ్యాస తక్కువ! దేశానికి అప్రతిష్ఠ కలిగించే అతార్కికమైన అన్యాయమైన ప్రయత్నాలకు మాత్రం భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయేలా ప్రచారం జరుగుతోంది! ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా పనిచేస్తున్న పశువధశాలలను మూసివేయించింది. సక్రమంగా పనిచేస్తున్న పశువధశాలలను సైతం మూసివేయించినట్టు భ్రాంతి కలిగేలా ఈ మహా విషయానికి ప్రచారం జరిగింది. తమను మాంసం తినకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అటకాయిస్తోందని అలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం అనుబంధ వసతి గృహంలోని విద్యార్థులు ఆక్రోశించారట. దీనికి గొప్ప ప్రచారం! లక్నో సమీపంలోని ఒక వన్యమృగ విహార కేంద్రంలోని పులులకు పశుమాంసం లభించలేదట! కోడిమాంసం మాత్రమే తినవలసి వచ్చినందుకు ఆ శార్దూల రాజులు ఆగ్రహం చెందారట! ఇలాంటి దుర్వార్తలకు ప్రచారం జాస్తి. వీటికి మానవీయ ఆసక్తిపూరిత కథనాలు- హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీస్- అని పేర్లు! అక్రమ పశువధశాలలను మూయించడం వల్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు పర్యావరణ కాలుష్య నివారణకు స్వచ్ఛ్భారత్ పునర్ నిర్మాణానికి చేస్తున్న కృషిపట్ల మాత్రం ప్రసార మాధ్యమాల్లో చిన్నచూపు..
ఎంతోకొంత వక్రీకరణ లేనిదే వాస్తవం సమగ్రం కాదన్నది నడుస్తున్న రీతి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరులో కూడ కొంత వక్రీకరణను ‘కల్తీ’చేయనిదే ప్రచారకర్తలకు మనశ్శాంతి లేదు. తన పేరు ఆదిత్యనాథ్ యోగి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్వ యంగా చెప్పుకున్నాడు. కానీ ఎక్కువ శాతం మాధ్యమాలలో ఆ యనను ‘యోగి ఆదిత్యనాథ్’ అని క్రమం మార్చి వక్రీకరిస్తున్నారు. ‘వివేకానందస్వామి’ని ‘స్వామీ వివేకానంద..’ అని పలకడం బ్రిటన్ దొరలు నేర్పిపోయారు. దేశీయమైన పద్ధతులను పాడుపెట్టడం, విదేశీయులను అనుకరించడం మన దాస్యప్రవృత్తికి కొనసాగుతున్న నిదర్శనం. బ్రిటన్ దొరలు దయతలచి ఆదిశంకరాచార్యుడిని, రామానుజాచార్యులను, మధ్వాచార్యులను వదిలేశారు. లేకపోయినట్టయితే మనం ‘ఆచార్య ఆదిశంకర’, ‘ఆచార్య రామానుజ’, ‘ఆచార్య మధ్వ’-అని వగలుబోతూ పలుకుతూ ఉండేవారం.. గవాయనం- ఆవుల నడక-లో పిడకల వేట వంటిది ఇది! కానీ ప్రధానమైన వాస్తవాన్ని గుజరాత్ మంత్రి ప్రదీప్‌సింహ జదేజా వివరించాడు. ‘ఆవును, గోసంతతిని హత్యచేయడం మనిషిని హత్య చేయడంతో సమానం..’ అన్నది జదేజా చెప్పిన వాస్తవం! అందువల్లనే గోహంతకునికి యావజ్జీవ కారాగృహ నిర్బంధ శిక్షను విధించాలని కొత్త చట్టంలో నిర్దేశించారట! 2011నాటి గుజరాత్ ‘పశు పరిరక్షణ’ చట్టం ప్రకారం గోహత్యా నేరానికి మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉంది. ఇప్పుడు గుజరాత్ శాసనసభ ఆమోదించిన ‘పశుసంవర్ధన’ సవరణ బిల్లు ప్రకారం నేరస్థుడికి పదునాలుగేళ్ల జైలు, ఐదు లక్షల వరకు జరిమానా విధిస్తారు! ఆవును హత్య చేయడం మనిషిని హత్య చేయడంతో సమానమన్న జదేజా మాట ఈ దేశపు జాతీయ సంప్రదాయానికి అద్దం! అనాదిగా ఈ దేశంలో ఆవు తల్లి, గోమాత.. గతంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, ‘తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలు ఆహారం, అందువల్ల ఆవు అమ్మవంటిది..’ అన్న పాఠం చదువుకున్నారు. ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- పేరుతో వాణిజ్య వికృతి మన నెత్తికెక్కిన తరువాత పిల్లలకు ఈ పాఠం చెప్పడం మానుకున్నారు. ‘నెజల్’ లేదా ‘నెస్లే’వంటి విదేశీయ వంచక సంస్థలు తయారుచేస్తున్న కల్తీ పాలపొడిని శిశువులకు తినిపిస్తున్నాము, తాపిస్తున్నాము. ‘అ మూల్’వంటి దేశవాలీ ఆవుల పాలతో తయారైన ‘శిశు ఆహారం’- బేబీఫుడ్- పనికిరాదట! ఇతర పశువుల జన్యుజీవకణాలతో సంకరమైన ‘జెర్సీ’వంటివి దేశీయమైన ఆవుల పాలతో తయారయిన ‘కల్తీ’పాలపొడి పిల్లలకు ఆరోగ్యకరమని మన దేశంలోని అనేకమంది ‘కల్తీ’ వైద్యులు నిర్ధారిస్తున్నారు. వీరి స్వభావం ‘నెజల్’వంటి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ పంచిపెడుతున్న బహుమతులలో ‘కల్తీ’ అయిపోయింది! అందువల్లనే ‘ఆవు అమ్మ వంటిది’ అన్న గుజరాత్ మంత్రి మాట ఇలాంటి సంకర స్వభావుల ముక్కులను, మూతులను ‘వంకర’ విన్యాసాలకు గురిచేస్తోంది.. ఈ సంకర స్వభావులు వైద్య ప్రపంచానికే పరిమితం కాదు, అన్ని రంగాలలోను విస్తరించి ఉన్నారు!
పశ్చిమ బెంగాల్, కేరళ, కొన్ని ఈశాన్య ప్రాంతాలలో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలలోను గోసంతతి పరిరక్షణ చట్టాలు అమలు జరుగుతున్నాయి. అన్ని మతాలకు చెందిన అత్యధిక ప్రజలు గోమాంస భక్షణను, గోవధను వ్యతిరేకిస్తున్నట్టు ధ్రువపడడం జాతీయతా నిష్ఠకు అనుగుణమైన వ్యవహారం. మొత్తం మన దేశ జనాభాలో నాలుగు శాతం కంటె తక్కువమంది మాత్రమే గోమాంసం తినడానికి అభ్యంతరం లేనివారు. వీరిలోను ఒకటిన్నర శాతం మాత్రమే నియతంగా ఆవుమాంసం గేదెల మాంసం తింటున్నారట! గోరక్షణ భూరక్షణతోను భూరక్షణ ప్రజారక్షణతోను ముడివడి ఉందన్న సత్యాన్ని ఈ ‘గోమాంస భక్షకులు’ కూడ గుర్తించినప్పుడు సహజంగానే గోమాంస భక్షకుల సంఖ్య సున్న శాతానికి పడిపోతుంది! ఈ సత్యం సనాతన జీవన వాస్తవం! సేంద్రియ వ్యవసాయానికి ఆవు ప్రాణవాయువు! ఆవునుంచి, అడవి నుంచి లభిస్తున్న పదార్థాలతో వ్యవసాయ భూమి పరిపుష్టం కావడం ‘సేంద్రియ’ పద్ధతి. అందువల్ల సేంద్రియ వ్యవసాయం సహజంగానే ప్రాకృతిక పరిమళ పవనాలతో భారతభూమిని యుగాలుగా ముంచెత్తింది! ఈ దేశపు మట్టి అందువల్లనే మంచి గంధపు ముద్ద అయింది, ఈ మట్టినుంచి సంస్కారాల సమాహారం అంకురించింది, పల్లవించింది! అడవి ఆకులతోను, ఆవు పేడతోను ‘ఆకలి’ని తీర్చుకున్న భరతభూమి స్వభావం ఇది! తిన్న ఆహారాన్ని బట్టి మానవుని శారీరిక మానసిక ఆరోగ్యం, సంస్కారం మారుతున్నాయన్నది శాస్ర్తియమైన నిర్ధారణ! శతాబ్దుల ‘గోహననం’ వల్ల దేశంలోని రెండువందల ‘జాతు’ల ఆవులలో అత్యధికం అంతరించాయి. కేవలం ఇరవై తొమ్మిది జాతుల ఆవులు మాత్రమే ఊపిరి మిగిలి ఉన్నాయట! ఈ స్వదేశీయ స్వచ్ఛ గోసంతతిని రక్షించుకొని, సంఖ్య పెంచడంవల్ల మాత్రమే వ్యవసాయ భూమికి మళ్లీ స్వచ్ఛత ఏర్పడుతుంది! వంద శాతం వ్యవసాయ క్షేత్రాలు సేంద్రియమై ఉండిన సమయంలో భారత జాతీయ జీవన సంస్కారాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి! ఇది యుగాలనాటి చరిత్ర! ఆవులు అంతరించిన తరువాత, అడవులు హననమైన తరువాత ‘కృత్రిమ రసాయనపు ఎరువుల విషాల’ను బొక్కవలసి వస్తోన్న వ్యవసాయ భూగర్భం పొక్కిపోయింది, స్రుక్కిపోయింది, శుష్కించిపోయింది!
‘ఎండో సల్ఫాన్’ అన్న క్రిమినాశక విషాన్ని పిచికారీ చేసిన పంటలను తిన్నవారు చిత్ర విచిత్ర మానసిక శారీరక వ్యాధులకు గురికావడం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ధ్రువపడిన వాస్తవం! అందువల్లనే రసాయన విషాల నుంచి వ్యవసాయ భూమికి విముక్తిని కలిగించగల ‘సేంద్రియ వ్యవసాయం’ మళ్లీ మొదలైంది! యుగాలుగా భూమిని నిరంతరం దున్ని పరిపుష్టం చేసిన ‘వానపాము’-ఎఱ-లు కృత్రిమ రసాయనాల విషపువాసనలు భరించలేక ముప్పయి అడుగుల లోతునకు పారిపోయి ప్రాణాలను కాపాడుకుంటున్నాయట! ‘ఎఱ’లు లేని భూమి పైపొరలు నిస్సారమై నిర్జీవమైపోయాయి! సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం మొదలైనచోట్ల, దేశవాలీ ఆవుల పేడ వాసనలు సోకంగానే ఆ పరిమళ స్పర్శతో పరవసించే ‘వానపాములు’ బిలబిలమంటూ వచ్చి భూగర్భంపై పొరలకు చేరుతున్నాయట! ‘వానపాములు’ దున్నడం వల్ల భూమి నిరంతర సహజ పరిపుష్టిని పొందుతోంది! పరిపుష్టిని పొందుతున్న పొలం పరిపోషకమైన పంటలను ప్రసాదిస్తోంది! అందువల్ల భూమాతకు వరం గోమాత... గోరూపంలో ఉండిన భూమిని పృథు చక్రవర్తి ‘పాలు పితకడం’ కృతయుగం నాటి చరిత్ర! ఇది విశ్వవ్యవస్థ కథ.. భూమి ధేనువు, హిమాలయ పర్వతశ్రేణి ‘గోవత్సము’, అమృతధారలైన నదీ జలాలు పొంగిపొరలిన పాలు.. ఇది ‘కల్పన’ కాదు, భారత జాతీయ జీవన వ్యవహారం..
ధరా పాలకుడైన దిలీపుడు ఆవును మేపుతూ అడవుల వెంట తిరగడం త్రేతాయుగం నాటి చరిత్ర! దిలీపుడు, అతని భార్య సుదక్షిణాదేవి వసిష్ఠుని ఆశ్రమంలోని నందినీ ధేనువును పోషించారు, పూజించారు! నందినీ ధేనువును చంపడానికి వచ్చిన క్రూరమృగాన్ని ఎదిరించి ఆవుప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టగలిగిన భరతమాత వజ్రాల బిడ్డడు దిలీపుడు! ఆవు పరమ ప్రమాణం.. ఆవుమీద ప్రమాణం చేస్తే తాము సత్యాన్ని చెపుతున్నట్టు ఇతరులు విశ్వసిస్తారన్నది భారత జాతీయ జీవన విశ్వాసం! ద్వాపర యుగంలో ‘వ్రజ’ ప్రాంతపు వ్రేపల్లెలోని గోప మహిళలు చిన్ని కృష్ణుని ‘ఆగడాల’ గురించి యశోదమ్మకు ‘్ఫర్యాదులు’ చేశారు. తమ మాటలకు మద్దతుగా వారు తమ పుట్టింటివారి ఆవుల మీద ప్రమాణం చేసినట్టు పోతన మహాకవి చెప్పాడు..
‘ఓ యమ్మ నీ కుమారుడు
మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడికైనను
మా అన్నల సురభులానమంజుల వాణీ!’’
గోప మహిళల రుసరుసలకు అలా గురైన యదుకుల కృష్ణుడు స్వయంగ గోపాలకుడు! ఇలాంటి చారిత్రక స్మృతులను థామస్ బాబింగ్టన్ మెకాలే అన్న బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారుడు మన విద్యాప్రపంచం నుండి తొలగించి వెళ్లాడు. పాలస్తీనా దేశపు గొర్రెల కథలను పాడుకొమ్మని నేర్పి వెళ్లాడు!
క్రీస్తుశకం 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని వంచనతో ధ్వంసం చేసిన విదేశీయ జిహాదీలు దక్షిణ భారతంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఆరువందల ఇరవై ఐదు ఏళ్లపాటు ఆవులను హత్యచేశారు! క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కసామ్ అనే అరబ్బీ నరహంతకుడు మన దేశంలో గోహత్యలను ఆరంభించాడు. ఇన్నాళ్లకు మళ్లీ ‘గోరక్షాపురం’- గోరఖ్‌పూర్-నుండి వచ్చిన స్ఫూర్తి గోమాతల ఆర్తిని బాపుతోంది! క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దినాటి ఛత్రపతి శివాజీ మళ్లీ మొదలుపెట్టిన ‘గోరక్షణ’కు ఇది మరో శ్రీకారం. హరిశ్చంద్రుని వంటివారు పాలించిన భారత భూమి నుండి ‘గోహనన మాలిన్యం’ తొలగి సనాతన జాతీయత పునర్ వికాస వైభవం పొందాలని ‘్ఛత్రపతి’ తన తండ్రికి స్పష్టం చేసినట్టు మహాకవి గడియారం వేంకట శేషశాస్ర్తీ ఇలా చెప్పాడు..
‘జనకా! నా మతమున్ వచించెద
హరిశ్చంద్రాది రాజన్యులే
లిన ఈ భారతభూమి గోహనన
మాలిన్యంబులన్ బాసి ప్రా
క్తన జాతీయతనందగా వలెను,
సుల్తానైన నేటి పా
లన సూత్రమ్ముల మార్చివేయవలె,
కల్యాణంబు మ్రోయన్ వలెన్.’

*

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352